టీమిండియాతో వన్డే సిరీస్ కోసం రెండు జట్లను ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రెండు దేశాల మధ్య వందేళ్ల క్రీడా సంబంధాల వేడుకల నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారత్‌తో వన్డే సిరీస్‌కు ప్రత్యేక జెర్సీ రూపొందించింది. ఈ జెర్సీతోనే కివీస్ ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బరిలోకి దిగనున్నారు.
ఇరుదేశాల మధ్య క్రీడానుబంధం వందేళ్ల మైలురాయికి గుర్తుగా రెండు సంస్కృతులు మేళవించిన జెర్సీని ఆవిష్కరించింది. బెన్ థామ్సన్, శివ్ నారందాస్, జై పాంచ అనే ముగ్గురు ఆర్టిస్టులు శ్రమించి రూపొందించిన ఈ జెర్సీలో.. భారత జాతీయ పువ్వు కమలం, భారతీయ నిర్మాణాల్లో కనిపించే ఓగీ శైలి, మండల వంటివి ఉన్నాయి.
బ్లాక్ క్యాప్స్ కోటహితంగ వన్డే షర్టును ధరించనున్నారు, ఇది క్రికెట్ స్ఫూర్తి, ప్రేమతో ముడిపడి ఉన్న రెండు సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కివీస్‌లోని పురాతన మావోరి తెగను ప్రతిబింబించేలా నిలువు గీతలు జెర్సీపై ఉన్నాయి. టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్‌లో బ్లాక్ క్యాప్స్ ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీతో బరిలోకి దిగనున్నారు. రెండు దేశాల ఐక్యతకు సూచికగా నిలిచే ఈ జెర్సీ రెబెల్ స్పోర్ట్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉందని న్యూజిలాండ్ క్రికెట్ పేర్కొంది.
అక్టోబర్ 22న మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనను ఆరంభించనుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత నవబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం నవంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇటీవలే భారత్, జపాన్ 75 ఏళ్ల ద్వైపాక్షిక బంధానికి గుర్తుగా ఇటీవలే ఇరుదేశాల జట్లు ఏకైక టీ20 మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయంతో ఐదు ఓవర్ల మ్యాచ్ జరగ్గా.. టీమిండియా తృటిలో ఓటమి నుంచి తప్పించుకోవడం గమనార్హం.
Introducing the limited-edition Kotahitanga ODI shirt. A celebration of two cultures bound by their love of cricket. To commemorate 100 years of sporting ties between Aotearoa and India 🌿 🪷 Available to buy now at https://t.co/QmhJAXWWoV and selected Rebel Sport stores. https://t.co/ZMr3JC1oNf
— BLACKCAPS (@BLACKCAPS) October 10, 2026
ఇదీ చదవండి:


