హసన్ మహమూద్ (PC: Bangladesh Cricket X)
అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ యువ బౌలర్ హసన్ మహమూద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదు వికెట్లు కూల్చి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఓపెనర్ సెదీకుల్లా అటల్ (17), ఇస్మాత్ అలామ్ (1) రూపంలో కీలక వికెట్లు తీసిన హసన్.. కైస్ అహ్మద్, జియా ఉర్ రహ్మాన్ అక్బర్, యామిన్ అహ్మద్‌జాయ్‌లను డకౌట్ చేశాడు.
హ్యాట్రిక్
ఈ ముగ్గురిని ఒకే ఓవర్లో వరుస బంతుల్లో అవుట్ చేసిన హసన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 83వ ఓవర్లో మూడో బంతికి ఇస్మత్‌ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన ఈ పేస్ బౌలర్.. ఆ మరుసటి బంతికి కైస్ అహ్మద్‌ను కూడా గోల్డెన్ డకౌట్ చేశాడు. తర్వాతి బంతికి జియా ఉర్ రహ్మాన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
చరిత్ర సృష్టించాడు
ఈ క్రమంలో హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు స్పిన్నర్లు అలోక్ కపాలి, సోహగ్ ఘాజీ బంగ్లా తరఫున ఈ ఘనత సాధించారు.
కాగా 26 ఏళ్ల హసన్ మహమూద్ 2021లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ ఇప్పటికి 16 టెస్టులు, 26 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. ఆయా ఫార్మాట్లలో 45, 33, 28 వికెట్లు కూల్చాడు.
346 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులు చేసి ఆలౌట్ అయింది. షాద్‌మాన్ ఇస్లాం (67), తాంజిద్ హసన్ తమీమ్ (83), లిటన్ దాస్ (53) అర్ధ శతకాలతో రాణించారు.
అఫ్గాన్ 240 పరుగులకే ఆలౌట్
అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకే ఆలౌట్ అయింది. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకం (62) చేయగా.. కెప్టెన్ రహ్మత్ షా అజేయ శతకం (105)తో ఆకట్టుకున్నాడు.
బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఎబాదత్ హొసేన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మెహిదీ హసన్ మిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్ 21 ఓవర్లు వేసి కేవలం 55 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.
చదవండి: జైస్వాల్ డకౌట్.. కేఎల్ రాహుల్ విఫలం
Bangladesh turned up the heat on Day 3 morning in Abu Dhabi, bowling Afghanistan out for 240 to take control of the Only Test. #Bangladesh #Tigers #Afghanistan #TestCricket https://t.co/rADzqvkwRW
— Bangladesh Cricket (@BCBtigers) October 11, 2026


