గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం అందించింది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు
అతడు ఒకట్రెండు రోజుల్లో సౌతాఫ్రికాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాతో జరిగినే వన్డే సిరీస్‌లో ఉదర కండరాల గాయం బారిన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా రెండో టెస్టు కోసం జట్టు ఎంపికు అందుబాటులో ఉండనున్నాడు.
వాస్తవానికి గ్రీన్ గైర్హాజరీలో తొలి టెస్టు తుది జట్టులో ఇంగ్లిష్‌కు చోటు దక్కాల్సి ఉండేది. కానీ ఇంగ్లిష్ కూడా గాయపడడంతో అతడి స్దానంలో నిక్ మాడిన్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చారు. అయితే ఇప్పుడు గ్రీన్, ఇంగ్లిష్ కూడా తిరిగి రావడంతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టును ఎంపిక చేయడం కోచ్‌లకు సవాలుగా మారింది.
కాగా డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు పర్వాలేదనప్పించారు. టాపార్డర్ విఫలమైనప్పటికి రెన్‌షా(190) విరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 137.2 ఓవర్లలో 390 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతున్నారు. 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. విరాట్ కోహ్లి రికార్డ్ బ్రేక్


