సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌.. కెప్టెన్‌ ఔట్‌! | South Africa In Trouble; Temba Bavuma Out Of World Cup 2023: Reports | Sakshi
Sakshi News home page

World Cup 2023: సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌.. కెప్టెన్‌ ఔట్‌!

Published Sun, Nov 12 2023 1:25 PM | Last Updated on Sun, Nov 12 2023 2:08 PM

South Africa In Trouble; Temba Bavuma Out Of World Cup 2023: Reports - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో కూడా తొడ కండరాలు పట్టేయడంతో పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే అతడు సెమీస్‌కు దూరం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నవంబర్‌ 16న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సెకెండ్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌కు బావుమా దూరమైతే అతడి స్ధానంలో రెజా హెండ్రిక్స్‌ తుది జట్టులో వచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్‌ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement