Photo Credit: Twitter
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట చూసిన తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత సెంచరీ చేసిన మాట్ రెన్‌షా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. కట్‌చేస్తే చివరి రోజుకు వచ్చేసరికి ఆస్ట్రేలియా విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.
421 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో మార్కరమ్ (45 బ్యాటింగ్), వియాన్ ముల్డర్ (5 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, కమిన్స్, రెన్‌షాలు చెరో వికెట్ పడగొట్టారు.
ఇక సౌతాఫ్రికాకు ప్రస్తుతం మార్కరమ్ మినహా స్పెషలిస్ట్ బ్యాటర్ లేకపోవడంతో సౌతాఫ్రికా ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెన్‌షా లాగా మార్కరమ్ కూడా చివరిదాకా నిలబడి వీరోచిత పోరాటం చేస్తే తప్ప సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే.
అంతకముందు ఆస్ట్రేలియా జట్టు 314-6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు, సౌతాఫ్రికా ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకం బాదిన మ్యాట్ రెన్‌షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ (82) సత్తా చాటాడు.
మ్యాడిసన్ (48), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (27), కమిన్స్ (32 నాటౌట్), వెబ్‌స్టర్ 39 (నాటౌట్) ఇలా జట్టులో ప్రతి బ్యాటర్ తలో చేయి వేయడంతో ఆసీస్ ప్రత్యర్దికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జే, మహారాజ్ తలో 2, యాన్సెన్, హార్మర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: Ranji Trophy: విజయం దిశగా హైదరాబాద్


