టెస్టు క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. 30 వికెట్లు, 1090 ప‌రుగులు! | SA vs AUS-AFG vs BAN-Matches-Same-Co-Incidence-Rare-Feat-Test Cricket | Sakshi
Sakshi News home page

టెస్టు క్రికెట్‌లో అరుదైన దృశ్యం.. 30 వికెట్లు, 1090 ప‌రుగులు!

Oct 13 2026 1:45 PM | Updated on Oct 13 2026 2:17 PM

SA vs AUS-AFG vs BAN-Matches-Same-Co-Incidence-Rare-Feat-Test Cricket

టెస్టు క్రికెట్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. డ‌ర్బ‌న్‌లోని కింగ్స్‌మీడ్ వేదిక‌గా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డుతుండ‌గా.. అబుదాబి వేదిక‌గా అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు ఆడుతున్నాయి. ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ వేదిక‌ల మ‌ధ్య 10,988 కిలోమీట‌ర్ల దూరం ఉన్న‌ప్ప‌టికీ, ఒక యాదృశ్చిక ఘ‌ట‌న‌కు వేదిక‌గా మారాయి.

విష‌యంలోకి వెళితే.. ఈ రెండు మ్యాచ్‌లు గ‌త శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 9న‌) ప్రారంభ‌మ‌య్యాయి. మ్యాచ్‌లో నాలుగు రోజులు ముగిసిన త‌ర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ స‌మానంగా 30 వికెట్లు నేల‌కూలాయి. అంతేకాదు రెండు మ్యాచ్‌ల్లోనూ నాలుగు రోజుల ఆట ముగిసేస‌రికి యాదృశ్చికంగా 1090 ప‌రుగులు సాధించ‌డం విశేషం. మ‌రో అంశమేమిటంటే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జ‌ట్ల‌పై అతిథులుగా వచ్చిన జ‌ట్లే పైచేయిలో ఉన్నాయి. మ‌రోవైపు మ్యాచ్‌లకు ఆతిథ్య‌మిస్తున్న అఫ్గానిస్తాన్‌, సౌతాఫ్రికాలు చివ‌రి రోజు మొత్తం ఆడి డ్రా కోసమే ప్ర‌య‌త్నిస్తున్నాయి.

విజ‌యానికి ఆరు వికెట్ల దూరంలో..
421 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి నాలుగో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 102 ప‌రుగులు చేసింది.  క్రీజులో మార్క‌ర‌మ్ (45 బ్యాటింగ్‌), వియాన్ ముల్డ‌ర్ (5 బ్యాటింగ్‌) ఉన్నారు.  ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయ‌గా, క‌మిన్స్‌, రెన్‌షాలు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.  

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా జ‌ట్టు 314-6 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన ఆ జట్టు, సౌతాఫ్రికా ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకం బాదిన మ్యాట్ రెన్‌షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ (82) సత్తా చాటాడు. మ్యాడిసన్ (48), లబూషేన్ (37), స్టీవ్‌ స్మిత్ (27), కమిన్స్‌ (32 నాటౌట్‌), వెబ్‌స్టర్‌ 39 (నాటౌట్‌) ఇలా జట్టులో ప్రతి బ్యాట‌ర్‌ తలో చేయి వేయడంతో ఆసీస్‌ ప్రత్యర్దికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జే, మహారాజ్‌ తలో 2, యాన్సెన్‌, హార్మర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఆఫ్గ‌న్‌ డ్రా చేసుకుంటుందా?
ఇక బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ డ్రా ల‌క్ష్యంగా ఆడుతుంది. ఓవ‌ర్ నైట్ స్కోరు 132-3తో ఐదోరోజు ఆట‌ను ప్రారంభించిన అఫ్గానిస్తాన్ ప్ర‌స్తుతం 73 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్లు కోల్పోయి 189 ప‌రుగులు చేసింది. సేదికుల్లా అట‌ల్ (64), ఇక్ర‌మ్ అలిఖిల్ (27) క్రీజులో ఉన్నారు. బంగ్లా గెలుపుకు ఏడు వికెట్లు దూరంలో ఉండ‌గా, అఫ్గాన్ విజ‌యానికి 290 ప‌రుగులు అవ‌స‌రం.

చదవండి: జింబాబ్వే మాజీ క్రికెట‌ర్ అకాల మ‌ర‌ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement