
స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆదివారం డార్విన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఆసీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది.
ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. తన సహచర ఆటగాళ్లు విఫలమైనప్పటికి డేవిడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడ్డాడు. 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కామెరూన్ గ్రీన్(35) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.
రికెల్టన్ విరోచిత పోరాటం..
అనంతరం 179 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగల్గింది. సఫారీ బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71) ఆఖరి వరకు పోరాడాడు. అతడితో పాటు స్టబ్స్(37) పర్వాలేదన్పించాడు.
మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, జోష్ హాజిల్ వుడ్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటగా.. జంపా రెండు, మాక్స్‌వెల్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 12న డార్విన్ వేదికగా జరగనుంది.
చదవండి: రాజస్తాన్ రాయల్స్‌తో నా జర్నీ ఒక అద్భుతం.. వారికి థ్యాంక్స్: శాంసన్