
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గురుంచి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2013లో రాజస్తాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సంజూ.. 2021లో ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 30 ఏళ్ల సంజూ రాయల్స్ తరపున 11 సీజన్ల పాటు ఆడాడు. అయితే గత సీజన్‌లో సంజూ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.
దీంతో పలు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో జట్టు యాజమాన్యంతో సంజూకు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. జట్టు కూర్పు, ఓపెనింగ్ స్థానం విషయంలో సంజూ ఆంసృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"రాజస్తాన్ రాయల్స్‌కు నాకు ప్రపంచం లాంటింది. కేరళలోని ఒక గ్రామం నుంచి నాకు నా టాలెంట్‌ను నిరూపించుకునేందుకు రాజస్తాన్ అవకాశమిచ్చింది. రాహుల్ ద్రవిడ్ సార్, మనోజ్ బదలే సారు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. రాయల్స్ ఫ్రాంచైజీ వల్లే క్రికెట్ ప్రపంచానికి నేను పరిచయమయ్యాను.
అంతేకాకుండా నాపై ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా అప్పగించారు. రాయల్స్‌తో ఈ ప్రయాణం నిజంగా ఒక అద్బుతం. రాజస్తాన్ వంటి ఫ్రాంచైజీలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇంతకు మించి నేను చెప్పలేను అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.
చదవండి: SA Vs AUS 1st T20I: టిమ్ డేవిడ్ విధ్వంసం.. దెబ్బకు 16 ఏళ్ల వార్నర్ రికార్డు బ్రేక్