యాషెస్ సిరీస్ 2025-26లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్, కాలి మడమ గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తాన్ని దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించాడు. టీ20 ప్రపంచకప్-2026 సమయానికి జోష్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ స్టార్ రైట్ఆర్మ్ పేసర్ గత నెలలో షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడుతున్నప్పుడు తొడ కండరాల గాయం బారినపడ్డాడు.. దీంతో మ్యాచ్ మధ్యలోనే హాజిల్‌వుడ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే, యాషెస్ ఆరంభ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా భావించారు.
కానీ స్కాన్‌లో గాయం తీవ్రమైనది తేలింది. దీంతో అతడు మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అయితే అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో కనీసం ఆఖరి మూడు టెస్టులకైనా అందుబాటులో వస్తాడని టీమ్‌మెనెజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ ప్రాక్టీస్ సెషన్‌లలో అతడి కాలి మడమకు గాయమైంది. దీంతో ఇప్పుడు అతడు పూర్తిగా సిరీస్ నుంచే వైదొలిగాడు.
"జోష్ హాజిల్‌వుడ్ దురదృష్టవశాత్తు యాషెస్ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. ఈ సిరీస్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని మేము అనుకున్నాం. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకునే క్రమంలో కాలి మడమకు గాయమైంది.
అతడు తిరిగి పునరావసంకు వెళ్లనుర్నాడు. టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నాము అని డోనాల్డ్ పేర్కొన్నాడు. అదేవిధంగా మూడో టెస్టుకు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి రానున్నట్లు డోనాల్డ్ స్పష్టం చేశాడు.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..!


