భారత బ్యాటర్ ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
భారత బ్యాటర్ చిన్మయ్ సుతార్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 123 ఏళ్లుగా.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్ పోన్స్‌ఫోర్డ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మిజోరాం జట్టు తరఫున చిన్మయ్ సుతార్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ సందర్భంగా ఈ రెడ్‌బాల్ టోర్నీలో అరంగేట్రం చేశాడు.135 పరుగులతో అజేయంగాతాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా 29 ఏళ్ల చిన్మయ్ శతక్కొట్టాడు. ఆనంద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి ఈ వన్‌డౌన్ బ్యాటర్ 232 బంతులు ఎదుర్కొని.. 12 ఫోర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు.123 ఏళ్ల రికార్డు బ్రేక్ఇక అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగానే.. చిన్మయ్ సుతార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించాడు. అరంగేట్రం తర్వాత ఐదు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బిల్ పోన్స్‌ఫోర్డ్ (Bill Ponsford 1921-1922) పేరిట ఉండేది. అతడు ఆడిన తొలి ఐదు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌లో 724 పరుగులు చేయగా.. చిన్మయ్ 748 పైచిలుకు పరుగులతో బిల్‌ను అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అరుణాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మిజోరాం మూడు వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి.. 81 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఇదీ చదవండి: Asia Cup: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆరోజే!