క్రేజీ కాంబినేషన్ | Hrithik Roshan set to collaborate with Nelson for an upcoming film | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్

Oct 20 2026 4:47 AM | Updated on Oct 20 2026 4:47 AM

Hrithik Roshan set to collaborate with Nelson for an upcoming film

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్  దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్‌ సినిమా ‘జైలర్‌ 2’లో హీరో హృతిక్‌ రోషన్  ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్  లభించింది. దీంతో హృతిక్‌ రోషన్ , నెల్సన్  దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్ లో ఓ మూవీ సెట్‌ కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లో హృతిక్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. 

ఈ చిత్రానికి నెల్సన్  దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్‌ సమాచారం. మరోవైపు రజనీకాంత్‌–కమల్‌హాసన్  హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ, ఎన్టీఆర్‌ హీరోగా మరో సినిమా కమిట్‌ అయ్యారు నెల్సన్ . మరి.. తన ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తయిన తర్వాత హృతిక్‌ రోషన్‌తో నెల్సన్  సినిమా చేస్తారా? లేక అంతకంటే ముందే హృతిక్‌ సినిమాను సెట్స్‌కు తీసుకెళతారా? అనే సస్పెన్స్ పై ఓ స్పష్టత రావాలంటే వేచి చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement