జైలర్‌2 బ్లాక్‌ బస్టర్‌.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్! | Hrithik Roshan Remuneration For Jailer 2 Movie, Know How Much This Bollywood Star Reportedly Earned For Cameo Role, Read Story Inside | Sakshi
Sakshi News home page

Hrithik Roshan Remuneration: హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Oct 17 2026 11:24 AM | Updated on Oct 17 2026 12:46 PM

Hrithik Roshan Remuneration for Jailer 2 Movie

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అయిదు నిమిషాల అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం తీసుకున్నారనే ఆసక్తి నెలకొంది. రెండు రోజుల షూటింగ్‌ కోసం భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అయిదు నిమిషాల నిడివి కోసం ఆయన ఏకంగా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఇదే నిజమైతే అతి తక్కువ స్ట్రీన్‌ టైమ్‌కు ఈ స్థాయిలో ఇంత పారితోషికం తీసుకున్న వ్యక్తుల్లో హృతిక్‌ రోషన్‌ నిలివనున్నాడు.  అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సినిమా విషయానికి వస్తే.. 
కాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం కావడంతో తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.
 

(ఇదీ చదవండి: ‘గరివిడి లక్ష్మి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement