రజనీకాంత్ 'జైలర్ 2' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తొలి భాగంలో అసలేం జరిగింది? ఇప్పుడు రాబోయే దానిలో స్టోరీ ఏం ఉండనుంది? జనాలు ఈ మూవీ గురించి అసలేం అనుకుంటున్నారు? హైప్ ఎలా ఉందనేది చూద్దాం?
(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'ద ఒడిస్సీ'.. అధికారిక ప్రకటన)
రజనీకాంత్ కెరీర్ ఇక దాదాపుగా చివరకొచ్చేసింది అనే టైంలో అంటే 2023 ఆగస్టులో 'జైలర్' రిలీజైంది. ఏ మాత్రం అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. రెగ్యులర్ స్టోరీనే అయినప్పటికీ రజనీకాంత్ చరిష్మా, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ నెల్సన్ టేకింగ్ మూవీని మరో లెవల్కి తీసుకెళ్లాయి. దీంతో రూ.500-600 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఈ రేంజ్ వసూళ్లు ఎవరూ ఊహించలేదు. దీని తర్వాత రజనీకాంత్ నుంచి లాల్ సలామ్, వేట్టయాన్, కూలీ వచ్చాయి. వీటిలో తొలి రెండు ఫ్లాప్ అయ్యాయి గానీ 'కూలీ' మాత్రం బీభత్సమైన హైప్తో రిలీజై సగటు సినీ ప్రేక్షకుల్ని నిరాశపరిచింది.
కట్ చేస్తే 'జైలర్ 2' ఇప్పుడొస్తోంది. లెక్క ప్రకారం ఇది ఆగస్టు చివరి వారంలోనే రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ వాయిదా పడి అక్టోబరుకి మారింది. తమిళంలో ఏమో గానీ తెలుగులో ఒక్కటంటే ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు. ఎలాంటి ప్రమోషన్ లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ప్రమోషన్ల లాంటి వాటితో పనిలేదు. మరి 'జైలర్ 2'.. తొలిదానిలా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి?
ఇక 'జైలర్'లో ఏం జరిగిందో చూసుకుంటే.. టైగర్ ముత్తువేల్ పాండియన్ అనే మాజీ జైలు వార్డెన్.. రిటైర్మెంట్ తర్వాత భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి ప్రశాంతంగా బతికేస్తుంటాడు. ఇతడి కొడుకు పోలీస్ అధికారి. ఓ విగ్రహాల స్మగ్లింగ్ ముఠాతో గొడవ జరిగినప్పటి నుంచి కనిపించకుండాపోతాడు. అయితే కుటుంబం బాగుకోసం అప్పటివరకు అమాయకుడిలా ఉన్న టైగర్, కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత జూలు విదుల్చుతాడు. తర్వాత వర్మ అనే రౌడీతో తలపడతాడు. చివరకు వర్మని చంపేస్తాడు. అలానే విగ్రహాల స్మగ్లింగ్ ముఠాతో కలిసి తనని మోసం చేసిన సొంత కొడుకుని కూడా చంపేస్తాడు. అలా సినిమా ముగిసింది.
ట్రైలర్ బట్టి చూస్తే.. వర్మ అనే రౌడీని చంపేసిన తర్వాత టైగర్ ముత్తువేల్, ఉంటున్న ఊరిని వదిలేసి మరో చోట ఓ వ్యక్తి దగ్గర డ్రైవర్గా చేరతాడు. వర్మ కంటే పై స్థాయిలో ఉండే రౌడీలు టైగర్ కోసం వెతుకుతారు. అసలు టైగర్ ముత్తువేల్ ఆచూకీని వాళ్లు ఎలా కనిపెట్టారు? ఇతడితో తలపడ్డ 'కల్పక్కం' కుటుంబం బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వీళ్ల కథని ముత్తువేల్ ఎలా ముగించాడనేది సీక్వెల్ స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త సినిమా.. ఎట్టకేలకు తొలి అడుగు)
Tiger is back! The hunt is on!🔥 #Jailer2 from tomorrow in theatres near you! 🤩 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @vidya_balan @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu @mirnaaofficial @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk @sunilreddy22 #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju @kabilanchelliah @kuchirayar73 @RIAZtheboss #Jailer2FromOct15
— Sun Pictures (@sunpictures) October 14, 2026


