విలాసవంతమైన సౌకర్యాలు, సదుపాయాలకోసం లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన వ్యక్తికి తీరని నిరాశ ఎదురైంది. గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ‘ట్రంప్ టవర్స్’ హౌసింగ్ ప్రాజెక్ట్‌లో (Sector 65) లో రూ. 6.68 కోట్లకు అపార్ట్‌మెంట్ కొన్న వరుణ్ సుహాగ్ (42)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి ఒక వీడియోతో పాటు, M3M ప్రమోటర్ అండ్ డైరెక్టర్ పంకజ్ బన్సల్‌కు తాను పంపిన టెక్స్ట్ స్క్రీన్‌షాట్ షేర్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
వరుణ్ ఎక్స్‌లో ఫోటోలతో సహా తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. లిఫ్ట్ లేక, సరియైన కర్టెన్లు లేక నానా యాతన పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బిల్డర్‌పై ఆరోపణలు గుప్పించాడు. దీంతో బిల్డర్ దిగి రావడం విశేషం.
ఇదీ చదవండి: 15 లక్షల మంది, రూ. 1200 కోట్లు : డిజిటల్ యాప్ స్కాం సంచలనం
I the owner of Apartment number 36C, Trump Towers Delhi NCR, Sector 65, Gurugram have been put under house arrest by the builder M3M and management, Mr. Pankaj Bansal. https://t.co/uOntihr8Cw
— varun suhag (@varunsuhag) November 1, 2026
సుహాగ్ షేర్ చేసిన వివరాల ప్రకారం దుబాయ్‌లో ఉన్నప్పుడు 2018లో రూ. 6.68 కోట్లకు ప్లాట్ బుక్ చేసుకుని, 2025లో పేమెంట్ పూర్తి చేశాడు. తమకు బిడ్డ పుట్టబోతున్న తరుణంలో, తల్లిదండ్రుల సాయం కూడా ఉంటుందనే ఉద్దేశంతో గురుగ్రామ్‌కు మారాలని ఆయన ప్లాన్. కానీ ఈ ప్రాజెక్ట్ ఏడాదిన్నర ఆలస్యం అవడంతో బిల్డర్‌చుట్టూ తిరిగి అలసిపోయి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)లో కేసు కూడా దాఖలు చేశాడు.
చివరకు ఆగస్టు 27న అపార్ట్‌మెంట్‌ను అప్పగించినప్పుడు ఆయనకు మరో షాక్ ఎదురైంది. ఇంటి నిర్మాణం సరిగ్గా లేదు. ఫాల్స్ సీలింగ్ లేదు. ఆ ఇల్లు నివాసయోగ్యంగా లేదు. దీంతో దాన్ని బాగు చేయడానికి మరో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో తెలియదంటూ వాపోయాడు.
లిఫ్ట్ నిలిపేశారని ఆరోపించారు. దీనివల్ల ప్రతిసారీ లిఫ్ట్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు బిల్డింగ్ హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి, 30 నుండి 40 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. అలాగే ఇంటికి వచ్చే డెలివరీ ఏజెంట్లను, సందర్శకులను అడ్డుకుంటున్నారని, ఫర్నిచర్ లారీని లోపలికి అనుమతించకపోవడంతో సోఫాపై పడుకోవాల్సి వచ్చిందని, అలాగే కర్టెన్లు వేసే పనివారిని రానీయకపోవడంతో గ్లాస్ కిటికీల వల్ల గోప్యత లేకుండా పోయిందని ఆరోపించాడు. దీంతో బాత్ రూంలో స్నానం చేయడం చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకొచ్చాడు. పై అంతస్తులో ప్లాట్ ఉన్న తన సోదరి కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటోందని తెలిపాడు. అంతేకాదు బిల్డర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూడా ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: పెళ్లికి ఆహ్వానించిన యువకుడు : బెంజ్‌కార్ గిఫ్ట్, నెటిజన్లు క్యూ!
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కొందరడిగితే, ఒక బిల్డర్ తన ప్రతిష్టను పణంగా పెట్టి, కస్టమర్‌తో ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? పంకజ్ బన్సాల్‌తో వ్యక్తిగత శత్రుత్వం ఉందా?" అని మరొకరు సందేహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదుచేసినా తామేమీ చేయలేమన్నారని, తమ మధ్య వైరం ఏమీ లేదని సుహాగ్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియా : దెబ్బకి దిగొచ్చిన బిల్డర్
సుహాగ్ పోస్ట్ వైరల్ బాగా అయింది. 19 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో బిల్డర్ స్పందించారు. సోమవారానికి లిఫ్ట్ అందుబాటులోకి వచ్చిందని స్వయంగా సుహాగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు లభించిన మద్దతుపై సంతోషం ప్రకటించారు.


