తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ రూ. 5 కోట్ల విరాళం | SBI Donates Rs 5 Crore to Andhra Pradesh Cyclone Arnab Victims relief fund | Sakshi
Sakshi News home page

తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ రూ. 5 కోట్ల విరాళం

Oct 31 2026 6:58 PM | Updated on Oct 31 2026 7:11 PM

SBI Donates Rs 5 Crore to Andhra Pradesh Cyclone Arnab Victims relief fund

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్‌ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారీ విరాళాన్ని అందించింది. ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ తరఫున రూ.5.01 కోట్ల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. సర్కిల్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని ఈ విరాళంగా అందజేశారు.

ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్ మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి రూ.5.01 కోట్ల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్, జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ షమీమ్ బాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement