ఏపీలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు: ఎస్‌ఈసీ | SEC announcement on installation of CC cameras in polling stations in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు: ఎస్‌ఈసీ

Oct 31 2026 5:19 PM | Updated on Oct 31 2026 6:02 PM

SEC announcement on installation of CC cameras in polling stations in AP

విజయవాడ:  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేపు(ఆదివారం, నవంబర్‌ 1వ తేదీ) జరిగే పోలింగ్‌కు సంబంధించి యాభై శాతం పోలింగ్‌ కేంద్రాల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.  అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌లు ఉండాలని ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశించగా, అన్ని పోలింగ్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు కష్టమని అంటోంది ఎస్‌ఈసీ. 

వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటంలో  భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొద్ది వ్యవధిలోనే ఎస్‌ఈసీ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టలేమనే నిర్ణయాన్ని ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునెట స్పష్టం చేశారు. 5,737 పోలింగ్‌ స్టేషన్లలో 12 వేల కెమెరాలను ఏర్పాటు పెట్టినట్లు తెలిపారు.  సీసీ కెమెరాల ఫుటేజ్‌ను భద్రపరుస్తామని పేర్కొన్నారు.

12 వేల కెమెరాలతో నిఘా.. 75 వేల మంది సిబ్బంది రెడీ..! ఎస్ఈసీ కీలక ప్రకటన

 ఇదీ చదవండి: ‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement