‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ | Supreme Court issues key directives on local body elections | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

Oct 31 2026 3:47 PM | Updated on Oct 31 2026 3:54 PM

Supreme Court issues key directives on local body elections

న్యూఢిల్లీ: స్థానిక ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ 27 నాటి విచారణకు సంబంధించిన ఆర్డర్‌ కాపీ రిలీజ్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ ఆధారాలపై సుప్రీంకోర్టు స్పందించింది. నామినేషన్లు అడ్డుకుంటే అక్రమంగా రిజెక్ట్‌ చేసినట్లేనని చెప్పింది. ఆధారాలు పరిశీలించి పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అభ్యర్థి అనుమతి లేకుండా నామినేషన్‌ రిజెక్ట్‌ చేస్తే న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు చెప్పింది. నామినేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు సీసీ ఫుటేజీ భద్రపరచాలి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement