జనాలు లేకుండా ప్రచారమా? పీఏలపై బాలయ్య ఆగ్రహం! | Balakrishna Fire On PA's Over Crowd Mobilisation For Election Campaign | Sakshi
Sakshi News home page

జనాలు లేకుండా ప్రచారమా? పీఏలపై బాలయ్య ఆగ్రహం!

Oct 31 2026 12:48 PM | Updated on Oct 31 2026 1:16 PM

Balakrishna Fire On PA's Over Crowd Mobilisation For Election Campaign

హిందూపురం (చిలమత్తూరు): మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అవకాశాలు లేవని అంతర్గత సర్వేల్లో తేలడంతో షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే బాలకృష్ణ విశ్రాంతి తప్పనిసరి అయినా ఎన్నికల ప్రచారానికి పురంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం ఆఖరిరోజు కావడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 

బాలకృష్ణ సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో కొందరు లేచి వెళ్లిపోయారు. జనాలు ఆసక్తి చూపించకపోవడంతో బయట నుంచి కూలీ ఖర్చులు చెల్లించి జనాలను రప్పించారు. వారికి కూడా సమయం అయిపోవడంతో ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర అసహనంతో కనిపించారు. ఎన్నికల ప్రచారానికి జనాలని తీసుకురావడం కూడా తెలియదా అని పీఏలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. 
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకే ఎన్నికల ప్రచారం ముగియగా, ఎమ్మెల్యే బాలకృష్ణ 5.30 గంటలైనా సభలో ప్రసంగించి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు. కోడ్‌ ఉల్లంఘన జరుగుతున్నా అధికార యంత్రాంగం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఇదీ చదవండి: టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ.172.27 కోట్లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement