ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుపాను | Cyclone Alert, Heavy Rain Forecast For Central Andhra And Rayalaseema Districts As Low Pressure Area Intensifies, Check Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుపాను

Oct 31 2026 1:25 PM | Updated on Oct 31 2026 1:38 PM

Cyclone: Heavy Rains In Central Andhra And Rayalaseema Districts

సాక్షి, విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశ ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి(ఆదివారం) తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇదీ చదవండి: టెన్త్‌ క్లాస్‌ బాలికను రంపంతో కోసిన ఉన్మాది

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement