రాప్తాడు ఘటన.. బాలికపై దాడి చేసింది వీడే.. | Rapthadu High School Incident: Accused Hemanth Arrested | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఘటన.. బాలికపై దాడి చేసింది వీడే..

Oct 31 2026 1:52 PM | Updated on Oct 31 2026 2:11 PM

Rapthadu High School Incident: Accused Hemanth Arrested

సాక్షి, అనంతపురం జిల్లా: రాప్తాడు హైస్కూల్ ఘటనలో నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హేమంత్‌ను బాలిక గోపిక బంధువుగా అనుమానిస్తున్నారు. టెన్త్ క్లాస్ విద్యార్థి గోపిక ప్రేమకు నిరాకరించడంతో ఉన్మాదిగా మారిన హేమంత్.. ఎలక్ట్రిక్‌ రంపంతో విచక్షణరహితంగా దాడి చేశాడు.

ధర్మవరం మండలం నాగలూరికి చెందిన హేమంత్‌.. తల్లిదండ్రులు చనిపోవడంతో కొన్నాళ్లుగా అయ్యవారిపల్లెలో అక్క దగ్గరే నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో బాలికను ఉన్మాది వేధిస్తున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాప్తాడు ప్రభుత్వం పాఠశాలకు ఫోరెన్సిక్‌ బృందం చేరుకుంది. దాడి జరిగిన క్లాస్‌రూమ్‌ను పరిశీలించిన ఫోరెన్సిక్‌ టీమ్‌.. రంపం స్వాధీనం చేసుకుంది.

విద్యార్థి సంఘాల ఆందోళన..
రాప్తాడు స్కూల్‌ ఘటనను నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థునులకు భద్రత ఎక్కడుంది?. విద్యార్థునుల కుటుంబాలకు న్యాయం చేయాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

స్కూల్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. నిర్మాణ పనుల్లో భాగంగా పలువురు స్కూల్‌కు వస్తున్నారని స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ తెలిపారు. క్లాస్‌ రూమ్‌లోనే దాడి జరిగింది. ఆ సమయంలో క్లాస్‌ రూమ్‌లో టీచర్‌ ఉన్నారు. ఉదయం 10:30 గంటలకు ఘటన జరిగిందని హెచ్‌ఎం పేర్కొన్నారు. దాడి చేసిన దుండగుడిని మేం గమనించలేదు. మరో బాలికకు కూడా గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన తర్వాత రంపం వదిలేసి పారిపోయాడని స్కూల్‌ హెచ్‌ఎం తెలిపారు.

ఇదీ చదవండి: టెన్త్‌ క్లాస్‌ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement