స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ | Janasena engaged in massive money distribution in Vijayawada | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీ

Oct 31 2026 6:53 PM | Updated on Oct 31 2026 7:08 PM

 Janasena engaged in massive money distribution in Vijayawada

విజయవాడ: స్థానిక ఎన్నికల వేళ జనసేన భారీగా డబ్బుల పంపిణీకి పాల్పడింది. విజయవాడలో బహిరంగంగా ఓటుకు నోటు ఇస్తున్నారు కూటమి నేతలు. మేయర్‌ అభ్యర్థి, కార్పొరేటర్‌ కోసం డబ్బుల పంపిణీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రలోభాలు పెడుతున్నారు.

ఓటర్ల జాబితా పట్టుకుని డబ్బులు పంపిణీ చేస్తోంది కూటమి. ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున ఓట్ల కొనుగోళ్లకు తెగించింది. విజయవాడలోని అన్ని డివిజన్లలోనూ డబ్బుల పంపిణీ జరుగుతోంది. పట‍్టపగలే బరితెగించిన కూటమి నాయకులు.. డబ్బులు పంచుతున్నా అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున‍్నారు. 

ఇదీ చదవండి: ‘స్థానిక’ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement