శ్రీకాకుళం: స్థానిక ఎన్నికల వేళ ఓ టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. అది కూడా లైన్‌మన్‌ను బెదిరిస్తూ తన చేతుల్లో పెట్టుకోవడానికి యత్నించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.. సింగవలస గ్రామానికి చెందిన లైన్‌మన్ రోహిణీ కుమార్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ 10 రోజులు తాను చెప్పినట్లు వినకపోతే.. మిగతా 1100 రోజులు తనవి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇదేంటి అన్నా.. అని లైన్‌మన్ రోహిణి కుమార్ అడిగితే.. ‘ ఇది రాయి అన్న.. ఇది నాటు అన్న.. నాటు ఎమ్మెల్యే అన్న ఇది’ అంటూ హెచ్చరించారు. తాను ఇక్కడ లేనని లైన్‌మన్ చెప్పగా, తానే వస్తానంటూ సీరియస్ అయ్యారు. దాంతో ‘మీరు వద్దన్న.. నేను మీ దగ్గరకి వస్తా’ అంటూ ఆ లైన్‌మన్ చెప్పాడు. ‘ అయితే మరి రా’ అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు ఎమ్మెల్యే గొండు శంకర్. ఎమ్మెల్యే గొండు శంకర్.. లైన్‌మన్ రోహిణీ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది స్థానిక ఎన్నికల వేళ జరిగిన పరిణామం కాబట్టి.. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల్లో నీచానికి ఒడిగడుతున్నారు: పేర్నినాని


