దీపావళి పండుగ వేళ సీఎంఆర్ జ్యువెలరీ బంగారం, వెండిపై దీపావళి ధమాకా ఆఫర్లు అందిస్తోంది. అర్హత కలిగిన అన్ని 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపైనా వాల్యూ అడిషన్ (V.A.)కు ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్ అందిస్తోంది. గాజులు, హారాలు, చెవి కమ్మలు, ఉంగరాలు, సంప్రదాయ ఆభరణాలు… కొనుగోలుదారులు తమ అభిరుచికి తగిన అందమైన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. వీఏపై బ్రాంచ్‌లవారీగా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. గాజువాక బ్రాంచ్‌లో వీఏపై ఫ్లాట్ 5.99 శాతం, మియాపూర్ బ్రాంచ్‌లో 6.99 శాతం, మిగిలిన బ్రాంచ్‌లలో ఫ్లాట్ 7.99 శాతం ఆఫర్‌ను సీఎంఆర్ జ్యువెలరీ ప్రకటించింది.
ఇక కొనుగోలుదారుల దగ్గర ఉన్న పాత బంగారం ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ.200 ప్రయోజనం అందిస్తోంది. వెండి కొనుగోలుదారుల కోసం కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గాజువాకలో కిలోకు రూ.5,999 డిస్కౌంట్ అందిస్తుండగా మిగిలిన బ్రాంచ్‌లలో: కిలోకు రూ.6,666 డిస్కౌంట్ అందిస్తోంది.
ఇక వజ్రాల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు ఆఫర్లు వర్తిస్తాయి. జేసీ, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, గాజువాక, గోపాలపట్నం, విజయనగరం, రాజాం, శ్రీకాకుళం, నర్సీపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, తిరుపతి, కొత్తగూడెం, మియాపూర్ బ్రాంచ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: తుఫాన్ బాధితులకు ఎస్‌బీఐ రూ. 5 కోట్ల విరాళం


