breaking news
Kamareddy District Latest News
-
గురుకుల పాఠశాల పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆర్డీవో పార్థసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్, చందాపూర్ శివారులో పంటలను సోమవారం మండల వ్యవసాయ అధికారి నర్సింలు పరిశీలించారు. ఖరీఫ్‌లో వేసిన సోయా, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలుసూచనలు చేశారు. కామారెడ్డి అర్బన్: మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ లింగంపేట మండలం మోతె ప్రాథమిక మత్స్యకారుల సంఘంలోని ఆయన ప్రాథమిక సభ్యత్వం తొలగించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ నివాసంపై ఆరోపణలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి ద్వారా విచారణ జరిపి రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ గుర్తింపు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుని నివాస స్థితిని ధ్రువీకరించినట్టు మత్స్యశాఖ జిల్లా అధికారి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సొసైటీ పరిధిలోని గ్రామాల్లో నివసించే వారికే సభ్యత్వం ఉంటుందన్నారు. మోతెలో నివాసించనందున సొసైటీలో సభ్యత్వం రద్దు చేసినట్టు వివరించారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండల మున్నూరుకాపు సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. మండల అధ్యక్షుడిగా గాదె తిరుపతి, ఉపాధ్యక్షులుగా పేశెట్టి లక్ష్మీనారాయణ, కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా మల్లేశం, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, రవి, దేవేందర్, రాజు, రాములు, కోశాధికారిగా మైదపు శ్రీనివాస్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. -
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ రూరల్: పండుగలను ప్రశాంత వాతావరణంలో సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సోమవారం బాన్సువాడ మండల కార్యాలయంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ అశోక్‌లతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ గణేష్ చవితి పండుగతో పాటు, శోభాయాత్ర, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. దీనికోసం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా ఉంటూ పోలీస్, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులకు సహకారం అందించాలన్నారు. మండపాల వద్ద 24 గంటల పాటు ఎవరో ఒకరు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. -
రాజకీయాల్లో 45 ఏళ్ల మైలురాయి గొప్ప విషయం
భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ రాజకీయాల్లో 45 ఏళ్ల మైల్రాయిని దాటడం గొప్ప విషయమని పీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం భిక్కనూరులో షబ్బీర్‌అలీని ఆయన సత్కరించి మాట్లాడారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేసి గెలిచి మంత్రివర్గంలో స్థానం సాధించారన్నారు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలను షబ్బీర్‌అలీ పొందారన్నారు. కామారెడ్డి పట్టణానికి మంచినీటిని తన హయాంలో అందించి అపరభగీరథుడిగా షబ్బీర్‌అలీ పేరు పొందాడని కొనియాడారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గొండ్ల సిద్దరాములు, సింగిల్ విండో చైర్మన్లు గంగళ్ల భూమయ్య, నాగరాజురెడ్డి, పూల్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. -
డీజే నిర్వాహకుల బైండోవర్
గాంధారి(ఎల్లారెడ్డి): వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాల వద్ద డీజేలను పూర్తిగా నిషేధించామని, డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్సై ఆంజనేయులు అన్నారు. సోమవారం డీజే యజమానులు, డీజేల నిర్వాహకులను తహసీల్దార్ రేణుకా చౌహాన్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా వినాయక మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాన్సువాడ రూరల్: నానోయూరియా స్ప్రే రైతులకు ఎంతో లాభదాయకమని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన బోర్లం సొసైటీ చైర్మన్ సంగ్రాం నాయక్‌తో కలిసి హన్మాజీపేట్, సంగ్రాంతండాల్లో వరి పొలాలను పరిశీలించారు. రైతులకు నానోయూరియా ప్రాముఖ్యత గురించి వివరించారు. అరలీటర్ నానోయూరియా ఒక బస్తా యూరియాతో సమానమన్నారు. పర్యావరణ హితమైన నానో యూరియా స్ప్రే చేయడం వల్ల వరి మొక్క త్వరగా నత్రజనిని గ్రహించుకుంటుందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకుముడత పురుగు ఉధృతి ఉందన్నారు. పురుగు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ లేదంటే క్లోరాంట్రానిపోల్ 0.25 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే దేశాయిపేట్ క్లస్టర్ ఏఈవో దత్తేశ్వరి.. గ్రామంలోని పంటపొలాల్లో రైతులతో కలిసి పర్యటించారు. గాలిలో తేమశాతం వల్ల బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించాయన్నారు. దీని నివారణకు 15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలన్నారు. ప్లాంటామైసిన్ 20 గ్రాములతో పాటు కాపర్ హైడ్రాకై ్సడ్ 600 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే తెగుళ్ల ఉధృతి తగ్గుముఖం పడుతుందన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
రుద్రూర్: తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని రెండున్నర తులాల బంగారం, 38 తులాల వెండి ఆభరణాలు దుండగులు అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఖలీల్‌వాడి: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (35) ఉరేసుకొని మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ రంగు టీ షర్టు, నేవీ బ్లూ రంగు ప్యాంట్ ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే గులాం జిలానీ(50) ప్రమాదవశాత్తు తాడ్కోల్ శివారులోని బీడీ వర్కర్స్ కాలనీలోని డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. బాన్సువాడలోని ఓ హోటల్లో పనిచేసే జిలానీ శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. ఆదివారం రాత్రి వరకు అతని ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాలనీలో దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. మృతుడిని జిలానీగా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య షహనాజ్ ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరికొండ: మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లం లక్ష్మి (60) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. లక్ష్మి, ఆమె భర్త నడ్పి గంగయ్య కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గ్రామంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం వీరి వాహనానికి తగిలింది. దీంతో భార్యాభర్తలు వాహనంపై నుంచి కిందపడిపోయారు. గాయాలపాలైన లక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి సజ్జనపల్లి శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 3,220 నగదుతోపాటు 4 ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ● కాపాడిన తోటి రైతులు బాన్సువాడ రూరల్: మండలంలోని బుడిమి గ్రామానికి చెందిన జంబిక సాయిలు అనే వ్యక్తి సోమవారం మంజీరా నదిలో చిక్కుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నదికి ఆనుకుని ఉన్న పొలంలో నీళ్లు చూసేందుకు వెళ్లాడు. అదే సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టు 12 గేట్ల నుంచి నీటిని వదలడంతో రైతు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాయిలు గ్రామస్తులతోపాటు 100 నెంబర్‌కు ఫోన్‌చేసి సహాయం కోరడంతో స్పందించిన బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటి రైతులు ఖమ్రోద్దీన్, చందునారాయణ, చాకలి అంజయ్యలు సుమారు 300 మీటర్లు ఈత కొట్టుకుంటూ నదిలోకి వెళ్లి సాయిలును కాపాడారు. కానిస్టేబుళ్లు పవన్‌కుమార్, పృథ్వి సహాయక చర్యలు పర్యవేక్షించారు. రైతు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తోటి రైతులు చేసిన ధైర్య సాహసాలను పలువురు ప్రశంసించారు. బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరిందని, అదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని బీజేపీ నాయకులు సోమవారం ఆర్టీసీ డీఎం సరితాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరడంతో ఇటీవల క్యాంటీన్లో పైకప్పు కూలిపోయిందని.. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు గాయాలు కాలేదన్నారు. వెంటనే బస్టాండ్‌ను కూల్చి వేసి నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. నాయకులు చిరంజీవి, చీకట్ల రాజు, ఉమేష్, గజ్జల మహేష్, రామకృష్ణ, భాస్కర్‌రెడ్డి, గంగారాం, నాగరాజు తదితరులున్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర, ధర్మారెడ్డి గ్రామ శివారుల్లో బోరుమోటార్లను చోరీ చేసి పారిపోతున్న ఇద్దరిని స్థానిక రైతులు పట్టుకొని పోలీసులకు అ ప్పగించిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌ డ్ కథనం ప్రకారం..గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన గౌస్ పాష, మో సిన్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి మండలంలోని బంజర ఫంక్షన్‌హాల్ సమీపంలో పంట పొలాల నుంచి బోరుమోటార్లను చోరీచేసి ఎల్లారెడ్డి వైపు వెళ్లారు. అలాగే ధర్మారెడ్డి గ్రామ శివారులోనూ పంట పొలాల నుంచి బోరుమోటార్లను ఎతుకెళ్లే సమయంలో స్థానిక రైతులు గమనించి వారిని పట్టుకొని నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. ధర్మారెడ్డి గ్రామానికి చెందిన తెనుగు రమేష్ అనే బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఽగంట పాటు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. ఆశాలకు ఆదివారం సెలవుగా ప్రకటించాలని, అధికారులు, ఏఎన్ఎంలు వేధింపులు మానుకోవాలన్నారు. కనీస వేతనం రూ.18వేలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కలెక్టరేట్లోని వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో కో తుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కర్రె సిద్ధయ్య (65) ను ఈ నెల 17న ఇంటి వద్ద కోతులు దాడి చేశాయి. దీంతో కిందపడిన ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్ధయ్య సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు బాబు, నలుగురు కుమార్తెలు లక్ష్మి, రేణుకా అనిత, లావణ్య ఉన్నారు. -
ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 92 వినతులుకామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 92 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్వేత మాట్లాడుతూ.. ప్రజావాణికి ఎలాంటి ఫిర్యాదులు రాలేవన్నారు. ఏమైనా సమస్యలుంటే వచ్చే సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఎంపీడీవో సయ్యద్సాజీద్అలీ, ఎంపీవో సవిత, ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా భరోసా కేంద్రం
కామారెడ్డి క్రైం: పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భరోసా కేంద్రం ఆయా కేసుల్లో బాధితులుగా ఉన్న మహిళలు, చిన్నారులకు అండగా నిలుస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోక్సో కేసుల్లో బాధితులుగా ఉన్న ఇద్దరికి ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత మహిళలు, చిన్నారులకు భద్రత, మనోధైర్యం, న్యాయ సహకారాలు అందిస్తూ విశ్వసనీయంగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అందించిన ఆర్థిక సహాయం ద్వారా బాధితులు పునరావాసం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్య, వైద్యం లాంటి అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో సోమవారం జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు దాదాపు 50 మంది వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 29న హైద్రాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు పలువురు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. రికర్వు రౌండ్ జూనియర్ విభాగంలో బి. హిందు, హర్షిణి .. ఇండియన్ రౌండ్ జూనియర్ విభాగంలో ఎస్కే రేహన్, అకుల్, ప్రీతి, సహస్ర, ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్ విభాగంలో శ్రీజ, వకులదేవి ఎంపికై నట్లు కోచ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిర్మల్‌గౌడ్, ప్రదాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
నస్రుల్లాబాద్ : మండలంలోని నెమ్లి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బొబ్బిలి శ్రీనివాస్(39) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్–రే టెక్నీషియన్ గా పనిచేస్తాడు. భార్య ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తుంది. శ్రీనివాస్ సోమవారం ఉద యం పొలానికి పురుగు మందు పిచికారీ చేసేందు కు వెళ్లాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి మధ్యాహ్నం వర కు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలానికి వెళ్లి చూడగా పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. పొలానికి స్ప్రే చేయడానికి మందులు తీసుకొని వచ్చి, బోరు ఆగిపోయి ఉండటంతో శ్రీనివాస్ స్టార్టర్ బాక్సులోని మూడు ఫ్యూజులలో ఒక ఫ్యూజు మాత్రమే తీసి బోరును ముట్టుకుని ఉన్నాడు. బోరు మోటారు నుంచి విద్యుత్ సరఫరా కావడం, పంట కాలువలో నీరు ఉండటంతో షాక్ తగిలి అక్కడిక్కడే షాక్ మృతి చెందాడన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాఘవేంద్ర పరిశీలించి మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రమ్య, కూతురు పర్ణిత, కొడుకు రియాంత్ ఉన్నారు. నాన్నా... అంటూ చిన్నారి ఏడుపు పొలాల మధ్య నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని రోడ్డుపైకి స్థానికులు తీసుకుని వచ్చారు. అప్పుడే పాఠశాల నుంచి వచ్చిన కూతురు పర్ణిత నాన్నా అంటూ ఒక్కసారిగా ఏడవడంతో స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. -
రైతులంతా ఏకం కావాలి
గాంధారి(ఎల్లారెడ్డి): రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రైతులందరూ ఏకమై సమస్యల పరిష్కారానికి పోరాడాలని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం బీకేఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అథితిగా రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. అన్ని రంగాల్లో స్థిరపడ్డవారు ఆర్థికంగా ఎదుగుతున్నారని, రాత్రింబవళ్లు ఎండనకా, వాననకా కష్టపడే రైతులు మాత్రం ఆర్థికంగా, మానసికంగా కృంగి పోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారులు విత్తనాలు, పురుగు మందులను వారి ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారానికి రైతులంతా ఏకమై ప్రభుత్వంతో పోరాడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్‌రావు, విఠల్‌రెడ్డి, శంకర్రావు, రావు సాహెబ్రావు, మధుసూధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తాగి నడిపితే జైలుకు!
● 25 రోజుల్లో 1,014 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ● 13 మందికి రెండు రోజులు, 18 మందికి ఒక రోజు జైలు శిక్ష ● 281 మందికి జరిమానాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాలను ని యంత్రించేందుకు పోలీసు శాఖ బహుముఖ వ్యూ హం అమలు చేస్తోంది. ప్రమాదాలకు కారణాలను గుర్తించి చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా చాలా ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరో కోణమైన యాక్సిడెంట్ స్పాట్లను గు ర్తించి వాటిని ఆయా శాఖల అధికారులతో కలిసి సరి చేయిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా వా హనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నా రు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా ఒత్తిడి తెస్తున్నారు. హెల్మెట్ ధరించనివారికి జరిమానాలు విధిస్తు న్నారు. ఇటీవల జిల్లాలో ఒకేరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి 91 మందిని అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన వారిని రిమాండుకు పంపుతున్నారు. వారికి జరిమానాలు లేదంటే ఒకటి, రెండు రోజుల జైలు శిక్ష పడుతున్నాయి. కఠినంగా వ్యవహరిస్తూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఈ కేసుల్లో జరిమానాలు, ఒకరోజు, రెండు రోజుల జైలు శిక్షలు విధిస్తున్నారు. ఒక్క ఆగస్టులోనే అంటే 25 రోజుల్లో జిల్లాలో 1,014 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవడం గమనార్హం. మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు 281 మందికి కోర్టు రూ. 1,200 చొప్పున జరిమానాలు విధించింది. 13 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 18 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించడంతో వారు చిప్పకూడు తినాల్సి వచ్చింది. మిగిలిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఒక వ్యక్తికి ప్లకార్డు చేతికిచ్చి రోజంతా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఎవరు తాగినా ఇలాంటి శిక్షలు తప్పవనే హెచ్చరికలు చేశారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడుతుండడంతో వాహనదారుల్లో వణుకు మొదలైంది. తాగినప్పుడు వాహనం నడపకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా విందులో మ ద్యం సేవిస్తే వాహనం నడపడానికి కొందరు ఎవరో ఒకరు తాగని వాళ్లను తమ వెంట తెచ్చుకుంటున్నారు.ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసు లు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అయితే పట్టణానికి నలువైపులా తనిఖీలు సాగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎవరినీ వదలడం లేదు. వాహనాల తనిఖీలు చేస్తున్న సందర్భంలో పో లీసులకు అనుమానం వస్తే చాలు బ్రీథ్ అనలైజర్ ద్వారా టెస్ట్‌లు చేస్తున్నారు. టెస్ట్‌లో ఆల్కహాల్ ఎంత పర్సంటేజీ ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎక్కువ మోతాదులో తాగినట్టు తేలితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాగి నడపొద్దని కౌన్సెలింగ్ ఇస్తూనే మరోవైపు రిమాండుకు పంపుతున్నారు. తాగి నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమో, వికలాంగులై జీవితాంతం బాధపడే పరిస్థితులు చూస్తున్నాం. కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండండి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇతరులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఉద్దే శంతోనే జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ శాఖకు సహకరించాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీ -
పీఈటీ కోసం విద్యార్థుల ధర్నా
కామారెడ్డి రూరల్ : పీఈటీ కోసం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు సోమవారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పాఠశాలలో శివరాం అనే పీఈటీ ఉండేవారన్నారు. రెండున్నరేళ్ల క్రితం ఆయనను డిప్యుటేషన్‌పై హైదరాబాద్ పంపించారని, దీంతో ఇక్కడి విద్యార్థులతో ఆటలు ఆడించేవారు లేకుండాపోయారని పేర్కొన్నారు. కలెక్టర్, డీఈవోలను కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదన్నారు. వెంటనే శివరాం డిప్యుటేషన్ రద్దు చేసి, ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
● 22 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక ● విచారణకు ఆదేశించిన సబ్‌కలెక్టర్ కిరణ్మయిబిచ్కుంద : శెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో సోమ వారం మధ్యాహ్న భోజనం వికటించింది. 26 మంది భోజనం చేయగా.. 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంటకే కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే అంబులెన్స్‌లో బిచ్కుంద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు స్వప్నాలి, కాళిదాస్ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. నీరసంగా ఉన్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసు కున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. కిచిడీ, మిల్మేకర్, సాంబారు, గుడ్లు తిన్నామని విద్యార్థులు తెలిపారు. బియ్యంలో నల్ల పురుగులు వస్తున్నాయని, మిల్మేకర్ ఉడక లేదని, రంగుమారి కలుషితమైన తాగునీరు వస్తున్నాయని విద్యార్థులు సబ్ కలెక్టర్‌కు వివరించారు. చాలారోజులనుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని, తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సబ్ కలెక్టర్ డాక్టర్లతో మాట్లాడి విద్యార్ధుల ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందని తెలుసుకున్నారు. రాత్రి వేళలో శెట్లూర్కు వైద్య బృందాన్ని పంపించి పర్యవేక్షించాలని సబ్‌కలెక్టర్ ఆదేశించడంతో మెడికల్ ఆఫీసర్ బృందాన్ని పంపించారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి ఫుడ్ పాయిజన్‌కు కారణాలు తెలుసుకొని నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ్ అధికారులు వెళ్లి సరఫరా అవుతున్న నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించాలన్నారు. గ్రామంలో పైప్‌లైన్‌కు లీకేజీలు లేకుండా చూడాలని, రోజు క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని సూచించారు. పురుగులు ఉన్న బియ్యం నిల్వలను వెంటనే వెనక్కి తెప్పించి, మంచి బియ్యం సరఫరా చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. -
ఇబ్బందులు కలగకుండా చూడండి
● వినాయక ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : గణేశ్ ఉత్సవాలలో భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు, అపాయాలు కలగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమ వారం ఆయన జిల్లా కేంద్రంలో గణేశ్ నవరాత్రి ఉ త్సవాలు, నిమజ్జన శోభాయాత్రలకు సంబంధించి న రూట్ మ్యాప్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర, అధికారుల తో కలిసి పరిశీలించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, మత్స్య, ఆర్అండ్బీ శాఖలు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. చెరువు నిండుగా ఉంది కాబట్టి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతి జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సక్రమంగా జరిగేలా అధికారులకు సహకరించాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బ్రాంచ్ పోస్ట్మాస్టర్లకు ‘పింఛన్’ కిట్ల పంపిణీ
కామారెడ్డి క్రైం : పింఛన్ల పంపిణీ మరింత మెరు గ్గా జరిగేందుకు జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్‌ప్రింట్ డివైజ్‌లు, ఇతర సాంకేతిక పరికరాలతో కూడిన కిట్లను సోమవారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ మొత్తం 211 సెట్లు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. ఆధునిక పరికరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సులువుగా జరుగుతుందన్నా రు. లేదంటే మంత్ర డివైజ్ ద్వారా గానీ, ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా గానీ పింఛన్లు పంపిణీ చే యవచ్చన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పరికరాలతో ఎక్కువ మందికి పింఛన్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మ యి, అధికారులు పాల్గొన్నారు. -
‘ఓపెన్ యూనివర్సిటీలో నైపుణ్య ఉపకార ఆధారిత విద్య’
కామారెడ్డి అర్బన్ : అంబేడ్కర్ ఓపెన్ యూ నివర్సిటీలో నైపుణ్య ఉపకార వేతన ఆధారి త విద్యను అందించనున్నట్లు యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి అధ్యయన కేంద్రంలో నైపుణ్య ఉపకార వేతన ఆధారిత విద్య ప్రచార పోస్టర్లను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. రామానందతీర్థ సంస్థతో అవగాహన ఒప్పందంతో ఓపెన్ విద్యతో పాటు వివిధ ఉపాధి సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టినట్లు జేడీ తెలిపారు. మహిళా సాధికారతకు వీ హబ్‌తో ఒప్పందం చేసుకున్నామని, రిటైల్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఎస్‌సీఐ) సహకారంతో ఉపకార వేతన ఆధారిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. గిరిజన తెగలు, దివ్యాంగులకు ఉచిత విద్య అందస్తున్నామన్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్, అధ్యాపకులు రాజ్‌గంభీర్‌రావు, చంద్రశేఖర్, శ్రీనివాస్, కార్యాలయ బాధ్యుడు బాపురావు తదితరులు పాల్గొన్నారు. ‘పాత కేసులు ఎత్తేస్తాం’ రాజంపేట : మండల కేంద్రంలో ఈ ఏడాది వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ని ర్వహిస్తే గతంలో యువకులపై ఉన్న కేసుల ను ఎత్తేస్తామని ఏఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. రాజంపేటలోని శ్రీలక్ష్మీనరసింహ గా ర్డెన్లో మండపాల నిర్వాహకులతో సమావే శం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండపాల ఏర్పాటులో పా టించాల్సిన నియమ నిబంధనలను గురించి వివరించారు. మూడేళ్లుగా ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకుంటున్న గ్రామస్తులను సీఐ సంపత్ అభినందించారు. వి ద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద వినా యక మండపాలను ఏర్పాటు చేయవద్దని ఏఈ నాందేవ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామాల మండపాల నిర్వాహకులు, పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ‘యంత్ర పరికరాలకు దరఖాస్తుల ఆహ్వానం’ కామారెడ్డి క్రైం : జిల్లాకు సబ్ మిషన్ ఆన్ అ గ్రికల్చర్ మెకానైజేషన్–2025 పథకంలో భా గంగా పలు యంత్రాలు మంజూరయ్యా యని డీఏవో మోహన్‌రెడ్డి తెలిపారు. 4,041 బ్యాటరీ ఫుట్ మాన్యువల్లీ ఆపరేటెడ్ పవర్ స్ప్రేయర్లు, 606 పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 260 రొటోవేటర్లు, 64 సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్లు, 286 డిస్క్ హారో కల్టివేటర్ ఎంబీ ప్లాప్ కేజ్‌వీల్స్, రొటోపడ్లర్లు, 15 బండ్ ఫార్మర్లు మంజూరయ్యాయన్నారు. వీటిని చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎ స్సీ ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీపైన అందిస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఆరో తేదీలోగా స్థానిక రైతు వేదికలలోగానీ, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో గానీ దరఖాస్తులను అందించాలన్నారు. ‘తండాల అభివృద్ధికి కృషి’ కామారెడ్డి టౌన్ : తండాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్, లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో నిర్వహించిన సమితి జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీఎంతో చర్చించి పోడు భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. లంబాడీల గోర్ బోలిని భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్‌లో జుక్కల్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణాప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి వినోద్, జిల్లా అధ్యక్షుడు గణే ష్ నాయక్, ప్రధాన కార్యదర్శి బద్రునాయక్, నాయకులు శ్రవణ్, లక్ష్మణ్, వినోద్, గణపతి, మదన్‌లాల్, రూప్సింగ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు చర్యలు
● ప్రతినెలా కంపెనీలను తనిఖీ చేయాలి ● అధికారులకు కలెక్టర్ సంగ్వాన్ సూచనకామారెడ్డి క్రైం : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 44 కార్మికులు మృత్యువాత పడిన నేపథ్యంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 331 జీవోను విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి ప్రతినెలా తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవాలని కంపెనీలకు సూచించారు. పరిశ్రమల యజమానులు ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి, జీఎం లాలూ నాయక్, అధికారులు ప్రభుదాస్, లక్ష్మీప్రసాద్, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
సువర్ణ శోభితం..
తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ ● 26, 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఎప్‌సెట్–2025 ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ యూనివ ర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 26, 28, 29 వ తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కంప్యూటర్ సైన్స్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూ టర్ సైన్స్ (డాటా సైన్స్) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీట్లు అలాట్ అయినవారు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఈ డబ్ల్యూఎస్ కోటా నిబంధనలు స్పాట్ అడ్మిషన్స్‌కు వర్తించవని ప్రిన్సిపాల్ తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మే రకు ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తించదన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac.inను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.నీలాకాశంలో ధవళ వర్ణంలో మెరిసిపోయే మేఘాలుంటాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్న కారు మబ్బులు అప్పుడప్పుడు దర్శనమిస్తాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆకాశం అరుణవర్ణంలో కనిపిస్తుంటుంది. కానీ ఆదివారం సూర్యుడు పశ్చిమ దిశలో సాగిపోతున్న సమయంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గగన వీధుల్లో నీలి మేఘా లు సూర్య కిరణాల కలయికతో బంగారు వర్ణంలోకి మారి ఆహ్లాదాన్ని పంచాయి. కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
బోనస్ కథ కంచికేనా?
సన్నవడ్లకు దక్కని ప్రోత్సాహకం ● మూడు నెలలు దాటినా అందని డబ్బులు ● జిల్లాకు రావాల్సింది రూ.89 కోట్లు ● ఒక్క సీజన్‌కే పరిమితం.. నిరాశలో రైతులుకామారెడ్డి క్రైం : జిల్లాలో గత యాసంగి సీజన్లో రైతులు 2,61,110 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 60 వేలకుపైగా ఎకరాల్లో సన్న రకాలున్నాయి. పంట కొనుగోలు కోసం 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో 63 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నరకం ధాన్యాన్ని సేకరించడానికి కేటాయించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. ఇందులో 1,78,416 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి సర్కారు రైతుల ఖాతాలలో మద్దతు ధరను మాత్రమే జమ చేసింది. బోనస్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించిన 72,852 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వంనుంచి రూ. 89 కోట్లు రావాల్సి ఉంది. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడిచినా బోనస్‌పై ఎలాంటి ప్రకటనా లేదు. జిల్లా ప్రధాన పంట వరి. గతంలో రైతులు దొడ్డు రకాలనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగిలో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ఎకరాకు రూ. 500 చొప్పున బోనస్ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలోనే బోనస్ ఇవ్వని సర్కారు.. ఖరీఫ్‌లో ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే రైతులు మళ్లీ పాత పద్ధతిలో దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి. సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్.. ఒక్క సీజన్‌కే పరిమితమయ్యింది. రబీలో సన్న వడ్లు పండించి కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. పంటను విక్రయించి మూడు నెలలు దాటినా బోనస్ రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. -
మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలి
కామారెడ్డి టౌన్: మున్సిపల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనియన్ ఐదవ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో కార్మికులు చాలీచాలని వేతనాలకు వెట్టి చాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలన్నారు. ప్రతి నెలా 1న కార్మికుల బ్యాంక్ అకౌంట్లో వేతనాలను వేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజనర్సు, మహబూబ్ అలీ, నాయకులు అరుణ్, దీవెన, కార్మికులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు భరోసా
● అలుగెల్లిన చెరువులు, కుంటలు ● నిండుకుండల్లా ప్రాజెక్టులు ● అన్నదాతల్లో ఆనందంనిజాంసాగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. దీంతో వానాకాలం సాగు చేస్తున్న పంటలకు భరోసా లభించినట్లయ్యింది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కౌలాస్, పోచారం ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్, చెరువులు, కుంటలు, లిఫ్ట్‌లు, వ్యవసాయ బోరుబావుల కింద 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వర్షాధారంగా, ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల కింద సాగు చేసిన పంటలకు వరుణుడి భరోసా లభించింది. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయాలు కళకళలాడుతుండడంతో ఈ సీజన్లో పంటలు గట్టెక్కుతాయన్న నమ్మకం రైతుల్లో పెరిగింది. అలుగెల్లిన 780 చెరువులు, కుంటలు జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో 780 చెరువులు వరద నీటితో అలుగెళ్లాయి. మిగతా చెరువులు, కుంటలు 50 నుంచి 70 శాతం మేర నిండాయి. ఆయా చెరువుల కింద 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు, కుంటలు ఆధారంగా సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఉన్న నీటితో గట్టెక్కనున్నాయి. -
ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు..
బీబీపేట: ప్రమాదవశాత్తు బావిలో జారిపడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి దేవయ్య శనివారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ మోటారు మరమ్మతుల కోసం బావిలోకి దిగే ప్రయత్నంలో జారిపడ్డాడు. అంతలోనే ఫిట్స్ రావడంతో నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఉదయం పొలంలోని బావిలో మృతదేహం కనిపించడంతో గ్రామస్తుల సహాయంతో నీటిని మోటార్ల ద్వారా తీయించారు. మృతుడి భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి అర్బన్ : జిల్లా వాలీబాల్ అసోసి యేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఇందులో జిల్లా కార్యవర్గా న్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జె.రవీంద ర్, కార్యదర్శిగా పి.బాలయ్య, కోశాధికారిగా కె.సురేందర్, ఉపాధ్యక్షులుగా ఎ.దత్తాత్రి, ఎ.అనంతరావు, ఎం.స్వామి, సంయక్త కా ర్యదర్శులుగా కె.ఈశ్వర్‌కుమార్, డి.ప్రదీప్ దేశ్‌పాండే, నరేష్కుమార్, కార్యవర్గసభ్యులు గా జె.ప్రభులింగం, ఆర్.రవీందర్‌గౌడ్, మ ణికంఠ పటేల్, బాబాగౌడ్, పండరి గౌడ్, ప్రి యాంక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మైలారం శ్రీనివాస్ తెలిపారు. ‘ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’ నాగిరెడ్డిపేట: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంఘ్ ఇందూరు విభాగ్ ప్రచార ప్రముఖ్ డాక్టర్ వారె దస్తగిరి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలోని శ్రీ కోదండ రామాలయం కళ్యాణ మండపంలో స్వయం సేవకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ పంచసూత్రాలైన పర్యావరణం, సామాజిక సామరస్యం, స్వబోధ, పౌరమర్యాదలు, కుటుంబ జ్ఞానోదయం అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సంతోష్‌రెడ్డి, ప్రసాద్, భూపతి రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్రమోహన్కు అవార్డు ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్రమోహన్ మోస్ట్ కాంపాజినేట్ సర్జన్ అవార్డును అందుకున్నారు. అత్యధిక సర్జరీలు చేసినందుకు ఆయనను ఈ అవార్డు వరించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ ఐకాన్ అవార్డుల కార్యక్రమంలో ఆయన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు రెండు సీవోఈ మైనారిటీ కళాశాలలు కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని టెమ్రిస్ ఉ మ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి బషీర్ ఓ ప్రకటనలో తెలిపారు. నిజామా బా ద్‌లోని నాగారం (బాలుర), ధర్మపురి హిల్స్ (బాలికల)లలో ఏర్పాటు చేసిన సీవోఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన ముస్లింలు, క్రిస్టియ న్లు, పార్సీలు, జైనులు, సిక్కులతోపాటు నాన్ మైనారిటీ కోటా కింద అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు మైనారిటీ గురుకులాల ప్రి న్సిపాల్ సయ్యద్ హైదర్(89857 83112), ఆయేషా (85550 30851), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అ ధికారి బషీర్ (98494 19469)ను సంప్రదించాలని సూచించారు. డైట్లో స్పాట్ అడ్మిషన్లు కామారెడ్డి అర్బన్: డైట్లో మిగిలిపోయిన సీ ట్లకు రెండో విడత స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు నిజామాబాద్ డైట్ ప్రిన్సిప ల్ టి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ని జామాబాద్ కళాశాలలో ఈనెల 26న, ప్ర యివేట్ కళాశాలల్లో 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హత పరీక్ష మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ ఉంటుందని, ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉండదని తెలిపారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
సదాశివనగర్: భార్యను బండరాయితో హత్య చేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. సదాశివనగర్ పీఎస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన చిందం రవి, లక్ష్మి భార్యా భర్తలు. వీరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున భార్యాభర్త మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన రవి భార్యపై బండరాయితో మోది హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన బండరాయిని, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. హత్య కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గుప్పుమంటున్న గంజాయి
బాన్సువాడ: గంజాయి విక్రయాలకు బాన్సువాడ కేరాఫ్‌గా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న బాన్సువాడలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. బాన్సువాడ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్ శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నారు. తాజాగా బాన్సువాడ సమీపంలోని బీర్కూర్ చౌరస్తా వద్ద 300 గ్రాముల గంజాయిని తీసుకెళ్తున్న వ్యక్తిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ నెలలోనే బాన్సువాడలో 575 గ్రాముల గంజాయిని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రాముకు రూ.500 చొప్పున విక్రయం.. బాన్సువాడలో యువత, కార్మికులను టార్గెట్ చేసుకొని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలు, గ్రామ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గంజాయి దందా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ, గౌలీగూడ తదితర కాలనీల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే గంజాయికి అలవాటుపడిన వారిలో అధికంగా యువత ఉండడం, అందులోనూ వివిధ పనులు చేస్తూ కార్మికులుగా జీవనం సాగిస్తున్న వారే ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. రోజువారీగా కూలి పనులు చేసుకునే వారు సైతం గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. మరో వైపు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వారిలో యువతే ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బాన్సువాడలో మత్తు పదార్థాలకు బానిసగా మారిన యువకులు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. నిఘా పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారం ఇస్తే తప్ప అటు వైపు దృష్టి సారించకపోవడం గమనర్హం. ఇటీవల పట్టుకున్న ఘటనలు.. ● ఈ నెల 6న బాన్సువాడ పట్టణంలో ఓ హోటల్ సమీపంలో దాసరి పోశెట్టి అనే వ్యక్తిని గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 275 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ● ఈ నెల 23న బాన్సువాడ సమీపంలో బీర్కూర్ చౌరస్తా వద్ద గంజాయి తీసుకొస్తున్న దెగ్లూర్‌కు చెందిన అర్జున్ అనే వ్యక్తిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకుని 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ దిలిప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. బాన్సువాడలో విచ్చలవిడిగా విక్రయాలు రోజువారీ కూలి పనులు చేసుకునే యువతే లక్ష్యంగా దందా టీ పాయింట్లు, శివారు ప్రాంతాలే అడ్డా.. నెల రోజుల్లో 575 గ్రాముల గంజాయి పట్టివేత -
విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి
భిక్కనూరు: దుక్కిదున్నుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగలకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర రాజిరెడ్డి(46) జంగంపల్లి శివారులో ఉన్న రాజంపేట మండలం బస్వన్నపల్లికి చెందిన ఆశిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం ఆ భూమిని దున్నేందుకు రాజిరెడ్డి తన ట్రాక్టర్‌తో ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా బోరు బావికి కనెక్షన్ ఇచ్చిన సర్వీస్ వైరు ట్రాక్టర్‌కు తగులుతుందని దానిని పైకి లేపే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యుదాఘాతం సంభవించడంతో రాజిరెడ్డి ట్రాక్టర్పైనే ప్రాణాలు విడిచాడు. కొద్ది సేపటికి అటు వైపుగా వెళ్లిన రైతులు విషయాన్ని గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జల్లాపల్లి ఫారంలో యువకుడు.. రుద్రూర్: పొతంగల్ మండలం జల్లాపల్లి ఫారం కు చెందిన షేక్ ముబీన్ (30) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ముబీన్ తన స్నేహితులతో కలిసి శనివారం చేపలు పట్టేందుకు స్థానిక గ్రామ చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ముబీన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ముస్కాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మాక్లూర్: మండలంలోని దాస్‌నగర్‌లో చిన్న గంగారాం(60) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్న గంగారాం గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. భార్య మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. కుమారుడు, కోడలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం కుమారుడు తండ్రి గంగారాంకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉందని, కిటికీల నుంచి చూడగా విగతజీవుడిగా ఉన్నట్లు కుమారుడికి సమాచారం అందించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మట్టి వినాయకుల వితరణ
రాజంపేట: వినాయక చవితిని పురస్కరించుకుని రాజంపేట వాస్తవ్యుడు కొండ మహదేవ్ గుప్తా (రామకృష్ణ మెడికల్) ఆధ్వర్యంలో ఆదివారం రాజంపేట ఆ ర్యవైశ్య సభ్యులకు మట్టి వినాయకులను అందజేసిన ట్లు గ్రామ ఆర్యవైశ్య అధ్యక్షుడు ముత్యపు సిద్ధరాము లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న కొండ మహదేవ్ గుప్తాకు రాజంపేట ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మొగిలిపల్లి రమేష్, రాజు, బంధం అనిల్, రాజు పాల్గొన్నారు. రాజంపేటలో.. విగ్రహాల పంపిణీ రాజంపేట: మండల కేంద్రానికి చెందిన బల్ల ఆంజనేయులు అనిల్ ఆదివారం కామారెడ్డి పరిధిలోని ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో వేయి మందికి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడటంలో తన వంతు బాధ్యతగా 5 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నేతలు గుర్రాల రవికుమార్, వడ్ల రవి, అంజగౌడ్, సాయి,భాస్కర్, మహేష్, పిట్ల సింహం పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు నిరీక్షించాల్సిందేనా?
● ఆఖరి మజిలీకి జాగ కరువు ● రామారెడ్డిలో అంత్యక్రియలకు అవస్థలురామారెడ్డి: రామారెడ్డిలో సగం జనాభాలో ఎవరైనా చనిపోతే పటేల్ చెరువు వైపు, సగం జనాభా చింతలకుంట వైపు, కొంత మంది సొంత స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. చింతలకుంట వైపు వైకుంఠధామం నిర్మించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పటేల్ చెరువు వైపు అంత్యక్రియలు నిర్వహించే వారికే శవం కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకేరోజు ఇద్దరు చనిపోతే ఒక శవానికి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా మరో శవం నిరీక్షించాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆరు గజాల జాగే. ఆ అంత్యక్రియలు నిర్వహించేది కూడా పటేల్ చెరువు చివరిలోని 6 గజాల స్థలంలో మాత్రమే. ఆ ఆరు గజాల స్థలంలో నీళ్లు నిండితే అంత్యక్రియలకు జాగే ఉండదు. 2024 నవంబర్‌లో ఒకే రోజు ముగ్గురు చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. అదృష్టం ఏంటంటే ముగ్గురిదీ కూడా దహన సంస్కారాలే ఉండటంతో అది సాధ్యమైంది. ఖననం చేయాల్సి వస్తే చాలా ఇబ్బంది పడేవారు. స్పందించిన ఎమ్మెల్యే.... గతంలో అంత్యక్రియలకు సంబంధించిన సమస్యను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. డీఆర్డీవోను గ్రామానికి పంపి మరో వైకుంఠధామం నిర్మించాలని ఆదేశించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే 8,822 జనాభా ఉంటుంది. ప్రస్తుత ఆ జనాభా రెట్టింపైంది. అధికారుల నిర్లక్ష్యంతో చివరికి శవాలు కూడా అంత్యక్రియలకు నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ కల్పించుకొని రామారెడ్డిలో మరో వైకుంఠధామం నిర్మించి తమ అంత్యక్రియల కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. -
వంగిన విద్యుత్ స్తంభాలు..
మద్నూర్(జుక్కల్): గోజేగావ్, సోనాల గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ తీగలు సైతం తెగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. పశువులు, ఎడ్లబండ్లపై వెళ్లే వారు విద్యుత్ తీగల వద్ద వంగి జాగ్రత్తగా వెళ్తున్నారు. విద్యుత్ తీగలను గమనించకపోతే ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి వంగిన స్తంభాలను సరిచేయాలని కోరుతున్నారు. కామారెడ్డి టౌన్: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ 45 సంవత్సరాల రాజకీయ జీవన ప్రస్థానం పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. ఆయన 45 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉంటూ ఆయన చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించారు. సదాశివనగర్: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన 1984–85 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. మొదటగా పదో తర గతి బ్యాచ్‌కు చెందిన గంగాగౌడ్, సత్యనారాయ ణ, బాలకిషన్, నారాయణ వివిధ కారణాలతో మరణించారు. వారికి సంతాపం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం కొట్టాల్పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బచ్చగారి రాజమణి(50) భర్త విఠల్ గల్ఫ్‌కు వెళ్లి వచ్చాడు. చేసిన అప్పులు తీరలేదు. దీంతో తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. భార్యా భర్తల మధ్య ఆదివారం ఉదయం మరోసారి గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన రాజమణి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మోపాల్: మండలంలోని మోతీరాంనాయక్ తండా వద్ద రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కాల్పోల్ తండాకు చెందిన హీరాబాయి నగరంలో నివాసం ఉంటోంది. తండాలో తీజ్ వేడుకలు ఉండటంతో యాక్టివాపై వెళ్తుండగా, మోతీరాంనాయక్ తండా వద్ద బైరాపూర్ శివారులోని పోచమ్మ తండాకు చెందిన బానోత్ మంగూరామ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో హీరాబాయి కాలికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి ముపన్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఓ సబ్ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. టాన్స్‌కో జిల్లా కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో పని చేస్తున్న దేవీప్రసాద్ విధుల్లో భాగంగా టేక్రియాల్ వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. గాంధారి: మండల కేంద్రంలోని దాబా నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓ దాబాలో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడు అన్వేష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాబాలు, హోటళ్లలో ఎవరైనా అనుమతి లేకుండా సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. బాన్సువాడ: బీర్కూర్ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న మూడు టిప్పర్లు, పొక్లె యిన్ సీజ్ చేసినట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. దాడిలో మూడు టిప్పర్లను, పొక్లెయిన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా మొరం తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
ఘనంగా తీజ్ సంబురాలు
ఎల్లారెడ్డి: సోమర్యాగడితండాలో ఆదివా రం తీజ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉ త్సవానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రావణమాసంలో పెళ్లికాని యువతులు గోధుమ బుట్టలతో తీజ్ మాతను పూజిస్తారని అన్నారు. ఆచారంగా వస్తున్న ప్రతీ పండగను ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. బంజారా సంఘం నాయకులు రాములు, సర్దార్ ఉన్నారు. గజ్యానాయక్‌తండాలో.. మాచారెడ్డి: గజ్యానాయక్ తండాలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని యువతులు 9 రోజుల పాటు నిష్టతో గోధుమ కుదుళ్లపై నీళ్లు పోసి తొమ్మిదవ రోజు ఆ కుదుళ్లతో డీజే వాయిద్యంతో వారి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఊరేగించిన అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. కొట్టాల్గడ్డతండాలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): కొట్టాల్‌గడ్డ తండాలో ఆదివారం గిరిజనులు తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోధుమ నారుతో సేవాలాల్ మందిరం వరకు ర్యాలీగా చేరుకొని సేవాలాల్, జగదాంబ మాతామాలకు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా జాగృతి అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్‌గౌడ్ పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో అక్రమ మద్యాన్ని పట్టుకొని నిర్వాహకుడిపైఊ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావ్ ఆదివారం తెలిపారు. మండల కేంద్రంలోని తిమ్మనగర్ రోడ్డులో ఉన్న సాయి కూల్‌డ్రింక్స్ షాప్‌లో ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. దాడిలో 25 లీటర్ల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. షాపు యజమాని పై కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. -
దేశ సేవ చేసేందుకు మళ్లీ సిద్ధం
భిక్కనూరు: దేశ సేవ చేసేందుకు ఎల్లప్పుడు మాజీ సైనికులు సిద్ధంగా ఉంటున్నారని కామారెడ్డి జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు బాపురెడ్డి అన్నారు. ఆదివారం తిప్పాపూర్‌లో జిల్లా స్థాయి మాజీ సైనికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, సంఘ భవన నిర్మాణానికి వెయ్యి గజల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కామారెడ్డి జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమం కోసం అవసరమైన వాటి గురించి విన్నవిస్తామన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో సైనికుల కోసం ఆర్మీ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతామన్నారు. గతంలో ప్రభుత్వం సైనికులకు ఇచ్చిన భూములలో కొందరివి ఆక్రమించుకున్నారని వాటిని ప్రభుత్వం తిరిగి వీరికి ఇప్పించాలన్నారు. తమ సంఘం ఆద్వర్యంలో నూతనంగా సైన్యంలో చేరే యువతకు శిక్షణ ఇస్తామన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపరి బీంరెడ్డి, సాయిరెడ్డి, మరో 50 మంది మాజీ సైనికులు పాల్గొన్నారు. -
టీపీడీఈఏ సర్కిల్ కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
సుభాష్‌నగర్: తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ (టీపీడీఈఏ) నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్ ఎన్నికల అధికారిగా, సర్కిల్ సెక్రెటరీ సంపత్ సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అంతకుముందు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పి రాజేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా కంపెనీ జనరల్ సెక్రెటరీ నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్, కంపెనీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మల్లికార్జున్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తోట రాజశేఖర్, కంపెనీ జాయింట్ సెక్రెటరీ శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, సర్కిల్ కార్యదర్శి ఏ కాశీనాథ్, కోశాధికారి పి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి ఆర్ సుమిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తేజ, ఆఫీస్ సెక్రటరీ కెఎస్ఆర్ మూర్తి, డివిజన్ సెక్రెటరీలు జి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, నాయిని కృష్ణ, శంకర్ గౌడ్, గంగాధర్, కోశాధికారులు భరత్, గిరిధర్, భరత్ కుమార్, కాంతారావు, జుబేర్, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్: నందిపేట మండలం కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శంకర్‌ను సస్పెన్షన్ చేస్తూ డీఈవో అశోక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థులను కొట్టడం, వారి కళ్లల్లో కారం చల్లడం వంటి ఆరోపణలు రావడంతో ఎంఈవో గంగాధర్ చేపట్టిన విచారణ, నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు పేర్కొన్నారు. సదాశివనగర్: మండల కేంద్రంలోని ఓ గోల్డ్షాప్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన బంజ ప్రభులింగం అనే వ్యక్తి గోల్డ్షప్ ఫర్నీచర్ కోసం ఓ దుకాణంలో పనులు చేపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు పనులు జరుగుతున్న షాప్‌లోకి చొరబడి ఫర్నీచర్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో మండల కేంద్రానికి అవుసుల శ్రీధర్ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆధునిక పద్ధతుల్లో బోధించాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతుల్లో బోధన సామగ్రిని వినియోగిస్తూ పాఠా లు బోధించాలని ఎంఈవో ప్రవీణ్‌కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో శనివారం బోధన అభ్యసన సామగ్రి (టీ చింగ్ లర్నింగ్ మెటీరియల్–టీఎల్ఎం) మేళా నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ తమ సామగ్రిని ప్రదర్శించారు. తహసీల్దార్ దశరథ్, జగదీష్, కిషోర్, హెచ్ఎం కమల, వల్లభరావు పాల్గొన్నారు. టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం కామారెడ్డి రూరల్: విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి ఉపాధ్యాయ బోధనోపకరణాలు ఎంతో ఉపయోగపడుతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో ఎల్లయ్య అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ జెడ్పీహెచ్ఎస్లో శనివారం మండలస్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేళాలో ప్రతిభ కనబర్చిన వాటిని జిల్లాస్థాయిలో కూడా ప్రదర్శించి మొదటి బహుమతి వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అర్చన్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ యూనియన్, టీపీటీఎఫ్, తపస్ తదితరులు పాల్గొన్నారు. -
నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సీ్త్రనిధి రుణాలకు సంబంధించి నాగిరెడ్డిపేట మండలంలో 85శాతం బకాయిలు పేరుకుపోయాయని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ కిరణ్ తెలిపారు. మండలకేంద్రం గో పాల్పేటలో సీ్త్రనిఽధి ద్వారా ఇవ్వనున్న సౌభా గ్య, ఐశ్వర్య రుణాలకు సంబంధించిన వ్యాపారాలను శనివారం ఆయన పరిశీలించారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి ద్వారా రూ.95కోట్లు రుణాలుగా ఇవ్వాలని ల క్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.30కోట్లు రుణాలుగా ఇచ్చామని ఆయన చెప్పారు. కాగా జిల్లాలో 50శాతం సీ్త్రనిధి రుణబకాయిలుండగా వాటిలో నాగిరెడ్డిపేట మండలంలోనే 85శాతం రుణబకాయిలు పేరుకుపోయాయయని వివరించా రు. బకాయిల వసూళ్ల కోసం ప్రతి మంగళవారం, గురువారం స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఐకెపీ సీసీ దత్తు ఉన్నారు. రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అ న్నారు. రహదారికి ఇరువైపులా భూములు కో ల్పోతున్న రైతులకు పరిహారం అందేలా చూ స్తామన్నారు. మహమ్మద్ నగర్ మండల తహశీల్ కార్యాలయంలో శనివారం ఆమె మహమ్మద్ నగర్, బూర్గుల్, గున్కుల్ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. రహదారికి భూములు ఇవ్వాలని, విస్తరణ పనులను ఆపవద్దన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్థానిక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ సవాయిసింగ్, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్, హెచ్ఎం మధుసూదన్రాజ్, గిర్దావర్ పండరి ఉన్నారు. మద్యం పాలసీలో 25శాతం రిజర్వేషన్ కల్పించాలి కామారెడ్డి టౌన్: ప్రభుత్వ మద్యం పాలసీలో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 25శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ గ్రామంలో ఈత వనాలను పెంచడానికి 10 ఎకరాలను కేటాయించాలన్నారు. సాయాగౌడ్, రవీందర్‌గౌడ్, రాజు,రమేష్ తదితరులున్నారు. -
రైతులు కెపాసిటర్లు అమర్చుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పొలాల్లో కెపాసిటర్లు అమర్చుకోవాలని, అవసరం ఉన్నవారు వాటికోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ విజయసారథి అన్నారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు. మండలంలోని కోమట్‌పల్లి గ్రామంలో శనివారం ట్రాన్స్‌కో అధికారులు పొలంబాట కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా పంటచేనుల్లో లూజ్ వైర్ లైన్లు, వంగిన పోల్స్‌ను సరిచేసినట్లు ఆయన తెలిపారు. అలాగే రైతులతో మాట్లాడారు. గ్రామంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాల్లో కరెంటు విషయంలో జాగ్రత్తలు పాటించాలని యువకులకు సూచించారు. ఏడీఏ మల్లేశం, సిబ్బంది అనిల్‌కుమార్, మల్లయ్య, రాజు, పోశెట్టి, రాజు, రైతులు ప్రవీత్ పంతులు, శ్రీను, భీమయ్య, కళ్యాణ్, విఠల్, సాయిలు, హరీష్, కమ్లీ పాల్గొన్నారు. విద్యుత్ లైన్లను సరిచేస్తున్నాం.. కామారెడ్డి అర్బన్: విద్యుత్ అధికారుల పొలంబాట లో ఇప్పటివరకు 1425 వదులుగా ఉన్న లైన్లను సరిచేశామని, 1384 వంగిపోయిన స్తంభాలు సరిచేసి వాటి మధ్యలో 1631 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ శ్రావణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో తక్కువ ఎత్తులో ఉన్న 161 లైన్ క్రాసింగ్, 84 డీటీఆర్ ప్లింత్లు, 95 డబుల్ ఫీడింగ్ పాయింట్లను మార్చినట్టు పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులు సమస్యలు వచ్చినప్పుడు విద్యుత్‌శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించాలని సూచించారు. -
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
● అనుమానంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ ● మద్యం మత్తులో బండరాయితో దాడి.. భార్య మృతి సదాశివనగర్(ఎల్లారెడ్డి): కలకాలం వెన్నంటి ఉండి కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్తే కాలయముడయ్యాడు. భార్యను బండరాయితో మోది హతమార్చిన ఘటన మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతినగర్ కాలనీకి చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ(40) వంట చేస్తుండగా భర్త రవి అతిగా మద్యం సేవించి గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య, భర్తపై దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న రవి బండరాయితో తలపై దాడి చేయగా లింగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, అనుమానంతోనే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని కాలనీవాసులు తెలిపారు. మృతురాలికి కొడుకులు సురేశ్, మహేశ్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రైం కార్నర్
సీపీ ఎదుట 13 మంది బైండోవర్ బోధన్‌టౌన్(బోధన్): వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన 13 మందిని అదనపు జిల్లా మెజిస్ట్రేట్, సీపీ సాయిచైతన్య ఎదుట శనివారం బైండోవర్ చేశారు. వచ్చే ఆరు నెలలపాటు సత్ప్రవర్తన కలిగించేందుకు సొంత పూచీకత్తుతో బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. డీజే యజమానులు రూ.2 లక్షలు, డీజే ఆపరేటర్లు రూ.50 వేలు, ట్రబుల్ మాంగర్స్ రూ.లక్ష పూచీకత్తు చెల్లించినట్లు పేర్కొన్నారు. బైండోవర్ అయినవారు మళ్లీ నేరాలకు పాల్పడితే పూచీకత్తు డబ్బులను జప్తు చేస్తామన్నారు. ఆర్మూర్‌టౌన్: హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ఇష్టంలేక బయటికి వచ్చిన విద్యార్థిని పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బాల్కొండలోని వసతిగృహంలో ఉంటూ చదువుతున్నాడు. శనివారం ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థి హాస్టల్‌కు వెళ్లకుండా పెర్కిట్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్టాండ్‌లో రోదిస్తూ కూర్చున్న విద్యార్థిని గమనించిన స్థానికులు ఆరా తీయగా బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు విద్యార్థికి కౌన్సెలింగ్ చేసి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సమయానికి బస్టాండ్‌కు చేరుకొని విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడిన శాంతికుమార్, దినేశ్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్ గ్రామంలో ఓ వివాహిత శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన వడ్డె పుష్ప(40) భర్త కిషన్, అతని కుటుంబసభ్యుల వేధింపులకు గురవుతూ వస్తుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది పుష్ప ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, కుటుంబసభ్యుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం భర్త బతుకుదెరువు నిమిత్తం దుబాయిలో పనిచేస్తున్నాడు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దివ్యాంగులను మోసం చేస్తున్న సీఎం
బాన్సువాడ: ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి దివ్యాంగుల పింఛన్ రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని హా మీ ఇచ్చి గద్దె ఎక్కగానే దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్న వారిని నిలదీయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని దుయ్యాబట్టారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే మహా గర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంథని సామిల్, దివ్యాంగుల హక్కుల సమితి జిల్లా నాయకులు కుమ్మరి సాయిలు ఉన్నారు. పెన్షన్లను పెంచాలి.. ఎల్లారెడ్డిరూరల్: ఆసరా, వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎల్లారెడ్డిలో శనివారం నిర్వహించిన పెన్షన్‌దారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆదిమూలం సతీష్, ప్రవీణ్ తదితరులున్నారు. -
బైక్ పైనుంచి పడి గాయాలు
ఎల్లారెడ్డి: పట్టణ శివారులో బైక్ పైనుంచి పడిన యువకుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు శనివారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పోచాపూర్ గ్రామానికి చెందిన పండరి బైక్‌పై ఎల్లారెడ్డికి వస్తుండగా పట్టణ శివారులో రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ‘సాగర్’లో యువకుడి గల్లంతు నిజాంసాగర్(జుక్కల్): పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందని గైని పండరి (30) శనివారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతయ్యాడని ఎస్సై శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు సందర్శన కోసం ద్విచక్ర వాహనంపై వచ్చిన పండరి గుల్దస్త్రా వద్ద జలాశయంలోకి దూకినట్లు పేర్కొన్నారు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
సాక్షి నెట్వర్క్: సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్థానిక తహసీల్దార్లకు, బాన్సువాడలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద యూఎస్పీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు, నాయకులు తరలివెళ్లారు. -
రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి
● జిల్లా ఆస్పత్రికి తరలింపు నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో శనివారం అల్లెపు అక్షర అనే రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నారి అక్షప మధ్యాహ్నం తన ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడి చేస్తుండగా గమనించిన చిన్నారి అమ్మమ్మ కర్రతో ఎంత తరిమినా వదలకుండా చిన్నారిని కరవడంతో ముఖం, చెంప, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్‌లో ఒకరికి.. ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం వాకింగ్‌కు వెళుతున్న శ్రీనివాస్‌రావు అనే వ్యక్తిని కుక్కలు వెంబడించాయి. దీంతో ఆయన జారిపడటంతో కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా ఎడమకాలు విరిగినట్లు బాధితుడు తెలిపారు. -
వృద్ధుల రక్షణకో చట్టం
మీకు తెలుసా? ఎల్లారెడ్డి: చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పిల్లలు భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇలా దగ్గరి వాళ్లతో దగాపడ్డ తల్లిదండ్రులకు వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 రక్షణ కల్పిస్తోంది. ● చట్టం ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులను పోషించేందుకు, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ● పిల్లలు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. వారి నుంచి భరణం లేదా సంరక్షణావ్యయం పొందేందుకు న్యాయస్థానం తలుపుతట్టవచ్చు. ● తల్లిదండ్రులకు ఆహారం, బస, దుస్తులు, వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను కచ్చితంగా సమకూర్చాలి. ● పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే కోర్టు నేరంగా పరిగణించి తల్లిదండ్రులకు న్యాయం చేస్తుంది. తల్లిదండ్రులను పోషించడంలో విఫలమైతే కోర్టు పిల్లలకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తుంది. ● నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బాధితులు తెల్లకాగితంపై తమ సమస్యను వివరిస్తూ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ జరిపి వారికి పోషణ, సంక్షేమం వచ్చేలా చర్యలు తీసుకుంటారు. -
క్రమశిక్షణతో ముందుకెళ్లాలి
భిక్కనూరు: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ముందుకెళ్తే బంగారు భవిష్యతును పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన బస్వాపూర్‌ను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా లబ్ధిదారులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో అన్ని వ్యాధులకు సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ప్రతి కాన్పు ప్రభుత్వాస్పత్రిలో జరిగేలా ప్రజలకు చైతన్య పరచాలన్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. చదువుతో పాటు సామాజిక సేవలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ వినియోగం, ప్రయోగాల గురించి ఆయన విద్యార్థుల ను ప్రశ్నించారు. సరైన సమాధానాలిచ్చిన విద్యార్థులకు నోటు బుక్కులను బహుమతిగా అందించారు. కార్యక్రమాలలో జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్‌వో విద్య, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, వై ద్యురాలు యెమీమా, హెచ్ఎం సబిత, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ తదతరులు పాల్గొన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : జాతీయ లోక్ అదాలత్‌ను వచ్చేనెల 13న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం కోర్టు హాల్లో పోలీసులు, న్యాయమూర్తులు ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, రాజీకి వచ్చే క్రిమినల్, వైవాహిక తగాదాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్, బ్యాంకు రికవరీ తదితర కేసులను వీలైనంత ఎక్కువ పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రెటరీ ఈట సుమలత, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత్‌రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, ఎస్సై మురళి, జిల్లా కోర్టు ఏవో లక్ష్మీకాంత్, డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీ తదితరులు పాల్గొన్నారు. ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్ : రేషన్ షాప్‌ల ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఒకటో తేదీన ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూన్‌లో ఒకేసారి అందించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో మాత్రం ఒకే నెలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ‘సాగర్’ గేట్లు మూసివేత నిజాంసాగర్ : ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం మ ధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈనెల 18 నుంచి శనివారం ఉదయం వరకు ఆరు రోజుల పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి 40.70 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజె క్టు వరద గేట్ల ద్వారా ఆరు రోజుల్లో 27.151 టీఎంసీల నీటిని మంజీర నదిలోకి విడుదల చేశామన్నారు. శనివారం సాయంత్రం 13,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,404 అడుగుల (16.357 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ‘బోర్డులు తప్పనిసరి’ బీబీపేట: ఫర్టిలైజర్ దుకాణాలకు, గోదాములకు బోర్డులు తప్పనిసరిగా ఉండాలని డీఏవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆ యన బీబీపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను సందర్శించారు. వాటికి ఎ లాంటి బోర్డులు లేకపోవడంతో ఆయన ఆ గ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా బో ర్డులు పెట్టాలని, లేకుంటే లైసెన్స్‌లు రద్దు చే స్తానని దుకాణాదారులను హెచ్చరించారు. ఇ–పాస్ యంత్రం ద్వారానే ఎరువులు పంపిణీ చేయాలన్నారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏవో నరేందర్, ఏఈవోలు రాఘవేంద్ర, సంతోష్, రాజేష్ ఉన్నారు. ‘పారదర్శకంగా ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం’ కామారెడ్డి టౌన్ : జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఆడిటింగ్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూస్తామని, స్వయంగా ప్రతి సీహెచ్‌సీని సందర్శిస్తానని తెలిపారు. అడిటింగ్ సిబ్బందికి వైద్య సిబ్బంది సహకరించాలని సూచించారు. -
సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్
భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని సోషల్‌వర్క్ డిపార్ట్మెంట్లో రీ సెర్చ్ స్కాలర్ ప్రగతికి శనివారం డాక్టరేట్ ప్ర దానం చేశారు. రీసెర్చ్ సూపర్వైజర్ డాక్టర్ రాజేశ్వరీ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ఆటిట్యూడ్ ఎమాంగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కేరీర్ ప్లానింగ్ ఇన్ కేజీబీవీస్ నిజామాబాద్’ అనే అంశంపై సీహెచ్. ప్రగతి పరిశోధన చేసింది. ప్రగతి నిజామాబాద్ సోషల్ వేల్ఫేర్ గురుకుల కళాశాలలో జువాలజీ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తోంది. కార్యక్రమంలో ఓయూ సీనియర్ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, తెయూ సోషల్ సైన్సెస్ డీన ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, సోషల్‌వర్క్ హెచ్‌వోడీ అంజయ్య, గైడ్ సూపర్వైజర్ రాజేశ్వరీ పాల్గొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు బిచ్కుంద: మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో గత ఎన్నో ఏళ్ల నుంచి మరుగుదొడ్లు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. దీంతో సాక్షి దినపత్రికలో ఇటీవల ‘మూడొందల మందికి ఒకే టాయిలెట్’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య వెంటనే పరిష్కరించాలని ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. 10 మరుగుదొడ్లకు రూ.6.90 లక్షలు నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్ ప్రొసీడింగ్ జారీ చేశారు. పనులు ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరానికి కృషి చేసిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సాక్షి దినపత్రికకు విద్యార్థులు, హెచ్ఎం, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. లైంగిక వేధింపుల నివారణకు కృషిచేయాలి కామారెడ్డి టౌన్: పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్, వీఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. పట్టణంలోని జిల్లాకోర్టులో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నుంచి పిల్లల హక్కులు–రక్షణ అనే అంశంపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. పోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. న్యాయమూర్తి సుమలత, ఏఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా శిశు సంరక్షణ అధికారిణి స్రవంతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేషు, సఖీ సెంటర్ ఇన్చార్జి కవిత, భరోసా కో–ఆర్డినేటర్, కవిత, చంద్రసేన్ రెడ్డి, ఖాజా పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలి కామారెడ్డి టౌన్: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని అధ్యాపకులు అన్నారు. పట్టణంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి అన్నారు. డీన్ నవీన్‌కుమార్, ప్రిన్సిపాల్లు గోవర్ధన్‌రెడ్డి, గంగాధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి’
కామారెడ్డి క్రైం : వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండపాల ఏర్పాటు, నిర్వహణ విషయంలో నిర్వాహకులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తప్పనిసరిగా పోలీసు శాఖ సూచించిన విధంగా ఆన్లైన్ ద్వారా వివరాలు సమర్పించి అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిబంధనలకు లోబడి కార్యక్రమాలు జరపాలని, పెట్రోలింగ్‌కు వచ్చే పోలీసులకు వలంటీర్లు సహకరించాలని పేర్కొన్నారు. మండపాల్లో ఏదైనా బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 డయల్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ షాక్‌లు జరుగకుండా నిపుణులైన ఎలక్ట్రీషియన్లతో ఏర్పాట్లు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, ఎకై ్సజ్ శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
పోలీసు పహారాలో పంపిణీమాచారెడ్డి : యూరియా కోసం శనివారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి రైతు లు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసుల పహారాలో పంపిణీ చేశారు. విండోలో 450 బస్తాల యూ రియా ఉండగా.. దానిని రైతులకు అందించారు. సాయంత్రం చీకటి పడే వరకు పంపిణీ కొనసాగింది. కాగా యూరియా కోసం రైతులు గొడవకు దిగగా.. జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, కామా రెడ్డి ఏడీఏ అపర్ణ అక్కడికి చేరుకుని వారిని సము దాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. బీబీపేటలో.. బీబీపేట: మండలకేంద్రంలోని సింగిల్ విండో కా ర్యాలయానికి శనివారం 440 బ్యాగ్‌ల యూరియా వచ్చింది. రైతులు ఉదయమే కార్యాలయం వద్దకు చేరుకుని బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ చొప్పున ఇచ్చారు. ఎరువుల పంపిణీని డీఏవో మోహన్‌రెడ్డి పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అవసరానికి మించి యూరియా వాడడం వల్లే కొరత ఏర్పడుతోందన్నారు. రైతులు నానో యూరియా వాడాలని సూచించారు. -
మోసానికి గేట్‌వే!
మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయకులకు వల వేస్తూ.. చిక్కినవారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. అద్దెకు తెచ్చిన కార్లను ఆన్లైన్లో విక్రయిస్తూ.. ఆపై అదే కారును ఎత్తుకెళ్లి మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇటీవల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్షిస్తూ, నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మరో ముఠా గుట్టూ రట్టు చేసిన ఉదంతమూ విదితమే.. అయితే ఈ కేసులో వందలాది మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్శించి వారిని తమ దగ్గరకి రప్పించుకుని వారికి తెలియకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ దందా నడిపిన ముఠా సభ్యులు ఐదుగురిని ఈనెల 2న కామారెడ్డిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిపై ఇప్పటికే 11 కేసులు నమోదవగా.. బాధితులు నలభై మంది దాకా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా వందల్లో ఉంటారని సమాచారం. బాధితుల్లో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కొందరు బాధితులు తమ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందన్న ఉద్దేశంతో బయటకు రావడం లేదు. మరికొందరు కుటుంబ సభ్యుల ముందు ఇబ్బందిపడొద్దని వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న ముఠా సభ్యుల కస్టడీ కోసం పిటిషన్ వేసి వారిని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.. కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా బాధితుల వివరాలు సేకరించి వారి ద్వారా ఫిర్యాదులు తీసుకుని ఎంత నష్టపోయారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు యాభై మంది వరకు బాధితులను గుర్తించినట్లు సమాచారం. బాధితులు ఇంకా వందల్లో ఉంటారని భావిస్తున్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు అరెస్టయిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ ముఠా సభ్యులు వివిధ యాప్‌ల ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్శిస్తారు. వారికి కామారెడ్డిలో తాము ఏర్పరచుకున్న స్థావరం లొకేషన్ పంపించి రప్పించుకుంటారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న గే.. వారిని రిసీవ్ చేసుకుని, సహకరిస్తూ బట్టలు విప్పించి న్యూడ్‌గా మారుస్తాడు. దీనిని ముఠా సభ్యులు ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. వచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కుంటారు. అతడి బ్యాంకు ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెక్ చేసి ఆ డబ్బునంతా తమకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. కొందరిని తర్వాత కూడా ఫోన్ చేసి డబ్బులకోసం డిమాండ్ చేస్తున్నారని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలు బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ముఠా కార్యకలాపాలు నాలుగేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్‌కు చెందినవారు కూడా ఎంతో మంది వీరి వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. అయితే బాధితులు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతున్నారు. ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు వివరించడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. యాప్ ద్వారా స్వలింగ సంపర్కులకు వల నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్ రూ. లక్షలు వసూలు చేస్తున్న ముఠా ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నాలు బాధితుల గురించి ఆరా తీస్తున్న పోలీసులు -
ఉచిత బస్సు ప్రయాణం మాకొద్దు
కామారెడ్డి టౌన్ : ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేయాలని పలు వురు మహిళలు డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాజ లలిత ఆధ్వర్యంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట బస్సులు బయటకు వెళ్లే దారిలో బైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలతో పాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరిపడా బస్సులు లేక, కిక్కిరిసిన ప్రయాణికులతో ప్రయాణాలు చేయలేకపోతున్నామన్నారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం.. ఈ పథకం ద్వారా మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, వృద్ధులకు ఈ పథకం అమలు చేయాలని కోరారు. ఈ ఉచిత పథకం వల్ల ధరలు పెంచుతూ మళ్లీ పేద, మధ్యతరగతి వారికే భారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.● కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మహిళల ధర్నా -
పట్టు పట్టి.. పీహెచ్డీ సాధించి..
ఓవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ.. మరోవైపు ఉద్యోగం చేస్తూ.. ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి విజయం సాధించారు ఆ మహిళామణులు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు తెలంగాణ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో తాము ఎంచుకున్న అంశంపై పరిశోధనలు చేశారు. ఇటీవల యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డికామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొ టెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో) గా పనిచేస్తున్న స్రవంతి తెయూలో పీహెచ్డీ చేశా రు. పోక్సో చట్టంపై జిల్లా లోని కౌమార బాలబాలికలకున్న అవగాహన స్థాయిని అధ్యయనం చేసి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ యూ నివర్సిటీ సౌత్‌క్యాంపస్ సోషల్ వర్క్ విభాగంలో విజయ్‌కుమార్ శర్మ పర్యవేక్షణలో ఆమె పరిశోధన సాగింది. ఇటీవల జరిగిన తెయూ స్నాతకోత్సవంలో ఆమె డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు మోస్తూనే పరిశోధనలు సమాజానికి మేలు చేసే అంశాలతో.. డాక్టరేట్ పట్టా అందుకున్న మహిళా‘మణులు’ -
జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్ (32) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం వేకువజామున అతడు బయటకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి, బైక్‌పై బయలుదేరాడు. జంగంపల్లి చెరువు సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. బాన్సువాడ: బాన్సువాడ బస్టాండ్‌లో ఉన్న క్యాంటీన్ పైకప్పు శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో క్యాంటీన్లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్టాండ్ పురాతన భవనం కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు తడిసిపోయి కూలింది. పైకప్పు కూలిన శబ్దానికి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. క్యాంటీన్లో ఉన్న సామగ్రి పూర్తిగా దెబ్బతింది. ఆర్టీసీ అధికారులు శిథిలావస్థకు చేరిన బస్టాండ్‌కు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పెర్కిట్(ఆర్మూర్): పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలకు ఎంఈవో రాజ గంగారాం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. టీసీల కోసం వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో నోటీసులు ఇచ్చినట్లు ఎంఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజుల విషయంలో గాని టీసీల విషయలో విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బదులకు గురి చేస్తే పాఠశాల యాజమాన్యాలపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామంలో ఒకరిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. గ్రామానికి చెందిన సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగాగౌడ్ శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లివస్తుండగా వస్తుండగా పాఠశాల సమీపంలో కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. వెంటనే పిట్లం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి భూపల్లి ప్రదీప్, స్థానిక ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ వైద్యుడు సాయిబాబా, ఏఎన్ఎం లక్ష్మి, ఆయనకు ఆరోగ్య సలహాలు అందించారు. కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ తదితరులు ఆయనను పరామర్శించారు. పెద్దకొడప్గల్(జుక్కల్): హైదరాబాద్‌లో 2022లో పోయిన బైక్, మూడేళ్ల తర్వాత మండలంలో దొరికింది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా, ఓ బైక్‌పై నాన్ కాంటాక్ట్ చలాన్ వేశారు. దీంతో ఆ బైక్‌పై కేసు ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీస్ సిబ్బంది ఆ బైక్‌ను వెతికి పట్టుకొని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎస్సై అరుణ్ కుమార్‌ను అభినందించారు. -
మూడొందల మందికి ఒకే టాయిలెట్
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటుకు ధీటుగా అన్ని రంగాల్లో తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జెడ్పీహెచ్ఎస్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. హైస్కూల్లో 250 మంది విద్యార్థులు, ప్రైమరీలో 50 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి ఉంది. హైస్కూల్ టాయిలెట్స్ పూర్తిగా శిధిలావస్థలో ఉన్నాయి.. వాడడం లేదు. ప్రైమరీ పాఠశాలకు ఉన్న ఒకే మరుగుదొడ్డిని రెండు పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు వాడుతున్నారు. తరగతులు వదిలి టాయిలెట్ వద్ద క్యూలో నిలబడాల్సిన దుస్ధితి ఏర్పడింది. కొందరు విద్యార్థులు టాయిలెట్స్ కోసం ఇంటికి వెళ్తున్నారు. ఇన్ని ఇ బ్బందులున్నా అధికారులు ఇటు వైపు కన్నెతి చూడకపోవడం గమనర్హం. నిర్మించడానికి రేపు మాపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. వచ్చిన నిధులు వెనక్కి.. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మరుగు దొడ్ల నిర్మాణం కోసం 2023లో అలాగే 2025లో హైస్కూల్‌కు రూ.12 లక్షలు, ప్రైమరీ పాఠశాలకు రూ.4 లక్షల నిధులు రెండు సార్లు మంజూరయ్యాయి. అధికారుల అలసత్వంతో ఏళ్లు గడుస్తున్నా మరుగుదొడ్లు నిర్మించలేదు. బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఆగిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలో ఈజీఎస్ పనులు చేయకపోవడంతో మరుగు దొడ్లకు మంజూరైన రూ.లక్షల నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. జీపీగా ఉన్నప్పుడు మంజూరైన పనులు చేయకుండా అధికారుల నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా టాయిలెట్లు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.. అయినా ఎలాంటి ఫలితం దక్కలేదు. తూతూమంత్రంగా ఒక టాయిలెట్‌కు మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు చేసి కనీసం నాలుగు మరుగుదొడ్లు కట్టించాలని విద్యార్థులు కోరుతున్నారు.టాయిలెట్ వద్ద క్యూలో నిల్చున్న విద్యార్థినులు టాయిలెట్స్ కోసం చదువులు వదిలి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్దితి ఏర్పడింది. చాలా అసహ్యంగా ఉంది. ఆపుకుంటే కడుపు ఉబ్బి నొప్పి వస్తుంది. కలెక్టర్ సారు స్పందించి కట్టించాలని కోరుతున్నాం. –దీపాలి, 7వ తరగతి విద్యార్థిని, బిచ్కుంద పాఠశాలలో మరుగుదొడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా బాధలు ఎవరికీ కనబడటం లేదు. వందల మంది విద్యార్థులకు ఒకటే మరుగుదొడ్డి ఉంది. కనీసం నాలుగైదు కట్టించాలని కోరుతున్నాం. – సంధ్య, 7వ తరగతి విద్యార్థిని, బిచ్కుంద బిచ్కుంద బాలికల జెడ్పీహెచ్ఎస్లో మరుగుదొడ్లు లేక అవస్థలు గతంలో నిధులు మంజూరైనా నిర్మించకపోవడంతో వెనక్కిపోయిన నిధులు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిన ఈజీఎస్ నిధులు -
తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం
ఘనంగా ఇలియాస్ జన్మదిన వేడుకలుకామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్ జన్మదినం సందర్భంగా తలసేమియా బాధితుల సహాయార్థం శుక్రవారం జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువకులు, కార్యకర్తలు 105 మంది రక్తదానం చేశారు. ఈ మేరకు రక్తదాతలను షబ్బీర్ అలీ, ఇలియాస్‌ను అభినందించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలు, నర్సింగ్‌రావు, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తహసీల్ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 నగదు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం రూ.15వేలు, యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి అందజేయాలని డిమాండ్ చేశారు. వారసత్వం ద్వారా వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేయాలని, అర్హులైన వారికి ఫ్యామిలీ సర్టిఫికెట్లను ఇప్పించాలని కోరారు. అదే విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను ప్రతి సొసైటీలో అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. -
మత్తు పదార్థాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: మత్తు పదార్ధాలను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్ధులు, యువతకు మత్తు పదార్ధాల వాడకం ద్వారా కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల సరఫరాపై పోలీసు, ఎకై ్సజ్ శాఖలు నిఘా పెట్టాలన్నారు. గంజాయి, మద్యానికి బానిసలైన వ్యక్తులకు కౌన్సెలింగ్ చేపట్టి వారిని సాధారణ స్థితికి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కట్టడికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వామ్మో బస్సు..
ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద ఇటీవల ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాడ్వాయి మండలంలో మహిళ కాలు మీదుగా బస్సు టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయి ఆస్పత్రిపాలైంది.బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు వద్ద గురువారం బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు పెరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఒక్కోసారి బస్సులో వంద మందికి పైగానే ఉంటున్నారు. ప్రయాణికులు ఒకరినొకరు తోసుకోవడంతో ప్రతి రోజూ బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతింటోంది. కాలం చెల్లిన బస్సులను నడపడమే ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఒక వైపు, బస్సులో పరిమితికి మించి జనాలు ఎక్కడం, ఆపై పనిగంటలు పెరగడంతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ డిపోలు మాత్రమే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు బస్సులు చాలా వరకు కాలం చెల్లినవే తిప్పుతున్నారు. కొన్ని బస్సుల స్టీరింగ్ ఊడిరావడం, మరికొన్ని టైర్లు ఊడిపోవడం వంటి ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి బ్రేక్ ఫెయిలై ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా బస్సుల్లో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ కనిపిస్తున్నారు. కనీసం కాలుతీసి కాలు పెట్టే పరిస్థితి ఉండదు. దీనికి తోడు సీట్ల గోళ ఎక్కువవుతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు కాదుగదా కాలు పెట్టే పరిస్థితి లేక ఒకరినొకరు తోసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. అలాగే ఉచిత ప్రయాణం చేసే మహిళల్ని మగవారు చులకన చేసి మాట్లాడడం, దానికి వారు ఎదురు సమాధానం ఇవ్వడం కూడా గొడవలకు దారితీస్తోంది. కిక్కిరిసిన బస్సులో టిక్కెట్లు తీయడం కండక్టర్‌కు గుర్రంమీద స్వారీ చేసినట్టుగానే ఉంటోంది. డ్రైవర్ పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతోంది. ప్రయాణికులు బానెట్ మీదకి వచ్చి కూర్చుంటున్నారు. ప్రమాదం జరిగితే డ్రైవర్‌నే బాధ్యుడిని చేస్తున్నారు కాలం చెల్లిన బస్సులు, రెస్ట్ లేకుండా పనిచేయడం మూలంగా జరిగే ప్రమాదాల్లోనూ ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను బాధ్యులను చేసి తప్పించుకుంటోంది. బస్సులు కండిషన్లో ఉండేలా చూసుకోవాలసిన బాధ్యత యాజమాన్యంపైనే ఉంటుంది. బస్సుల్లో పరిమితికి మంచి ప్రయాణికులను ఎక్కించుకోవడానికి కారణం బస్సుల సంఖ్య తక్కువగా ఉండడమే. అలాగే బస్సుల కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయినా, మరమ్మతులు చేసి తిప్పుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంస్థ యాజమాన్యం తప్పును తమపైకి తోసి తప్పించుకుంటోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాదాలతో బస్సును చూస్తే జడుసుకునే పరిస్థితి కాలం చెల్లిన ప్రగతి రథాలు పరిమితికి మించి ప్రయాణికులు ఒత్తిడిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లుపల్లె వెలుగు బస్సుల్లో కొన్ని కాలం చెల్లినవి ఉంటున్నాయి. దశాబ్దాల కాలంగా లక్షలాది కిలోమీటర్లు తిరిగిన బస్సులను మరమ్మతులు చేస్తూ నడిపిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగడం లేదు. ఉన్న బస్సుల్లో కొన్ని మూలకు చేరుతున్నా వాటి స్థానంలో కొత్తవి రావడం లేదు. చాలా వరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులే వస్తున్నాయి. పల్లెవెలుగులు రాకపోవడంతో ఉన్నవాటినే తిప్పుతున్నారు. దీంతో వాటిని నడపడం కూడా డ్రైవర్లకు సవాల్‌గా మారింది. దీనికితోడు అప్పట్లో 8 గంటల డ్యూటీ చేసి ఇంటికి వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు ఇప్పుడు 12 గంటలు ఆగకుండా చేయాలి. మరుసటి మళ్లీ డ్యూటీకి వెళ్లి మరో 12 గంటలు చేయాల్సిందే. ఇలా వరుసగా డ్యూటీ చేయడం కారణంగా అలసటకు గురికావడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
నేడు పనుల జాతర
కామారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనుల జాతర కార్యక్రమాన్ని నేడు (శుక్రవారం) ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఆయా గ్రామసభల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీలు, ఏపీవోలు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనేలా చూడాలన్నారు. గ్రామ సభల్లో గతేడాది చేపట్టిన జీపీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఉద్యానవనాలు, సోక్ పిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, సిగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు తదితర పనుల వివరాలతోపాటు ఆయా పనులు చేపట్టడం ద్వారా గ్రామంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో అత్యధిక రోజులు పని చేసిన కూలీలను, దివ్యాంగ కూలీలను, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించాలని డీఆర్డీవో సురేందర్‌ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర అన్ని ప్రభుత్వ ఆస్తుల భవనాలపై సోలార్ విద్యుత్ సిస్టంను ఏర్పాటు చేయడానికి చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే వివరాలతో కూడిన జాబితాను వెంటనే ఆన్లైన్లో పొందుపర్చాలని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ రమణను ఆదేశించారు. జిల్లాలోని అడ్వాన్ ్డ్స టెక్నాలజీ కేంద్రాల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏటీసీ కేంద్రాల్లో అధునాతన కోర్సులను అభ్యసిస్తే వచ్చే ఉద్యోగ అవకాశాలను యువతకు వివరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో 11,818 ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వాటిలో 5,909 గృహాలకు మార్కింగ్ ఇచ్చి ప్రారంభించామన్నారు. 2660 గృహాలు బేస్మెంట్ స్ధాయి వరకు, 283 ఇళ్లు గదుల, 107 స్లాబ్ వరకు నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. 100 శాతం పూర్తయిన ఇళ్ల నిర్మాణాల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. తప్పుగా నమోదైన లబ్ధిదారుల ఆధార్ కార్డుల సవరణ త్వరగా పూర్తి చేయించాలన్నారు. ఇళ్లను త్వరితగతిన నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యను వీలైనంత త్వరగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, హౌసింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
సమన్వయంతో పనిచేయాలి
● గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ● శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధంగా ఉందన్నా రు. ప్రజలందరూ సోదర భావంతో మెలగాలన్నా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. మండపం ఏర్పాటు చేసే ప్రాంతానికి అనువైన పరిమాణంలో ఉన్న వినాయక ప్రతిమలను తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలు ఇ బ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, నిబంధనలకు లోబ డి లౌడ్ స్పీకర్లను వినియోగించాలన్నారు. నిమజ్జన సమయంలో తగిన జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ను సక్రమంగా నిర్వహించాలని, రోడ్లు, విద్యుత్ తీ గల మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలలో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ నరసింహారెడ్డి, అదన పు కలెక్టర్ చందర్, ఏ ఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్‌కు తగ్గిన వరద
● ఇన్‌ఫ్లో 52,477.. అవుట్ ఫ్లో 37,291 క్యూసెక్కులునిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. గురువారం సాయంత్రానికి 52,477 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 9 గేట్ల ద్వారా 37,291 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1402.58 అడుగుల (14.438 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కౌలాస్‌లోకి 1,403 క్యూసెక్కులు.. జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి 1,403 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు)గాను ప్రస్తుతం 457.60 మీటర్లు (1.141 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఒక గేటు ద్వారా 648 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. కల్యాణిలోకి 200 క్యూసెక్కులు.. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కల్యాణి ప్రాజెకులోకి 200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. కల్యాణి వాగు ద్వారా ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 అడుగులకు గాను 408.30 అడుగుల నీటిని నిలువ ఉంచుతూ 100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మెయిన్ కెనాల్‌కు డైవర్షన్ చేయగా 100 క్యూసెక్కుల నీటిని ఒక వరద గేటు ఎత్తి నీటిని మంజీరాలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు. -
మొబైల్ ఫోరెన్సిక్‌తో మెరుగైన సేవలు
కామారెడ్డి క్రైం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనం జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించగలదని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం కామారెడ్డి జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని గురువారం జిల్లా పోలీసు కార్యాయలం వద్ద ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేరాలు జరిగిన ప్రదేశాల్లో సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ విభాగం పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, పలువురు సీఐలు, ఎస్సైలు, క్లూస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ● ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కొత్తగా ఏర్పాటైన మహమ్మద్‌నగర్ రెవెన్యూ మండలానికి 13 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, చైన్‌మెన్, ముగ్గురు అటెండర్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మండల రెవెన్యూ కార్యాలయానికి సరిపడా పోస్టులు మంజూరు కావడంతో పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇంతకా లం డిప్యుటేషన్‌పై ఉన్న ఒకరిద్దరు అధికారు లు, సిబ్బందిని నెట్టుకువచ్చారు. పోస్టులు మంజూరవడంతో రెగ్యులర్ అఽధికారులు, సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. భిక్కనూరు: పాఠశాలల్లో లైబ్రరీ పీరియడ్‌ను తప్పనిసరిగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి టి.వేణుగోపాల్ అన్నారు. గురువారం భిక్కనూరు రైల్వే స్టేషన్ ప్రాథమిక పాఠశాలతోపాటు ఇతర పాఠశాలలను వేణుగోపాల్ తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో వర్క్ షీట్ల ద్వారా ఎప్పటికప్పుడు సాధన చేయిస్తూ పాఠ్య పుస్తకం, పాఠ్య ప్రణాళిక, వర్క్ బుక్‌ల మధ్య అలైన్మెంట్ పాటించాలని సూచించారు. ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూలైలో 1708 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. 1708 మందిలో 966 మందిపై అభియోగాలు మోపుతూ చార్జిషీట్ లు కోర్టులో వేయగా వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. 77 మందికి జైలు శిక్ష, మి గతా కేసుల్లో జరిమానాలు విధించినట్లు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు ఆర్టీఏ అధికారులు జూలై నెలలో 62 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు సీపీ తెలిపారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి దేవాగౌడ్
● ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా దే వాగౌడ్పై కథనం పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కర్రోల్ల దేవాగౌడ్ గాయకుడిగా, జానపద కళాకారుడిగా, కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సినీ ఆర్టిస్టుగా, లఘుచిత్ర దర్శకుడిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా, డ్యాన్సర్‌గా, నృత్య దర్మకుడిగా విభిన్న ప్రతిభను చూపుతున్నారు. ఎంఎస్సీ, బీఎడ్ చదివి ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన 5వ తరగతి నుంచే దేశభక్తి గేయాలు, జానపద పాటలు పాడేవారు..ఉపన్యాసాలు, వ్యాసరచనలు చేశారు. 18 సంవత్సరాల నుంచి కళారంగంలో రాణిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో గద్దర్, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ మరెందరో కళాకారులతో ధూంధాం... కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. లఘుచిత్రాల్లో నటిస్తూనే సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నారు. ఎన్నో సన్మానాలు, 7 రాష్ట్ర స్థాయి, 7 జాతీయ స్థాయి, 2 అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకున్నాడు. ఇటీవలె మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో మల్టీటాలెంటెడ్ పర్సన్‌గా ఆయన పేరు నమోదైంది. పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామానికి చెందిన కర్రోల్ల సావిత్రి, నారాగాడ్ గార్ల మూడవ సంతానమే దేవాగాడ్. ఈయనకు భార్య సుమలత, కుమారుడు అఖిల్ గౌడ్, కుమార్తె వర్ణిక ఉన్నారు. తండ్రి గీత కార్మికుడు, వ్యవసాయదారుడు, తల్లి బీడీ కార్మికురాలు నిరుపేద కుటుంబంలో జన్మించినా చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి చదివి, మనోధైర్యంతో, స్వశక్తినే నమ్ముకుని, తెలివితేటలతో, కళా రంగంతో పాటు వివిధ రంగాల్లో కూడా విజయాలు సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా దేవాగౌడ్ మాట్లాడుతూ.. చదువు, ప్రతిభ ఉండి కళారంగంలో రాణిస్తున్నందుకు, తెలంగాణ సాంస్కృతిక సారథిలో తనకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటునట్లు తెలిపాడు. -
రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మద్నూర్(జుక్కల్): భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డిమాండ్ చేశారు. డోంగ్లీ మండలంలో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను విస్మరించిందని మండిపడ్డారు. అధికారులకు ధన్యవాదాలు.. నాలుగు రోజుల క్రితం కురిసిన నియోజికవర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లలో ఎగువ భాగం నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నిజాంసాగర్, కౌలాస్ నాలాల వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారన్నారు. దీంతో శెట్లూర్‌లో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతుతో పాటు 656 గొర్రెలను ప్రాణాలతో కాపాడిన అధికారులకు, రెస్క్యూ టీం సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. -
క్రైం కార్నర్
మాచారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్‌కు చెందిన మంగళి హన్మాండ్లు (45) తన బైకుపై గురువారం మాచారెడ్డి నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. అదే సమయంలో గజ్యానాయక్ తండా చౌరస్తాకు చెందిన కడమంచి పండరి తన బైకుపై కామారెడ్డి వైపు నుంచి మాచారెడ్డి వైపు వస్తున్నాడు. పాల్వంచ మండల కేంద్రం శివారులో వారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ ఘటనలో హన్మాండ్లు అక్కడికక్కడే మృతి చెందగా, పండరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పండరిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు .. గ్రామానికి చెందిన తడకంటి అలియాస్ గుడాల గణేశ్ (30) హజ్గుల్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. అతడి తల్లి గతంలో భర్తను చంపి జైలుకెళ్లింది. అతడు తరచుగా కాస్లాబాద్ గ్రామానికి వస్తుండేవాడు. ఇటీవల అతడు కాస్లాబాద్ వెళ్లగా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గురువారం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలి
● మురికి కాలువలు శుభ్రం చేయించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గురువారం పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన అనంతరం ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు. డ్రై డేను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మరోసారి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మురికి కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి నిర్దేశించిన రెండు లక్షల మొక్కలను ఈ నెలాఖరులోగా నాటాలన్నారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి ని ఆదేశించారు. ఆయన వెంట స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
విశ్వ సాహితీ కళావేదిక తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీకాంత్
దోమకొండ: సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ విశ్వ సాహితీ కళావేదికకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన జెట్టబోయిన శ్రీకాంత్‌ను సంస్థ చైర్మన్ కొల్లి రమావతి నియమించారు. కవితాశ్వమేధం పుస్తక రచయిత జాతీయవాది జెట్టబోయిన శ్రీకాంత్‌ను తెలుగు గజల్ గాయకుడు, నటుడు, ఉద్యమకర్త 125 ప్రపంచ భాషలలో గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నిస్ రికార్డులు సాధించిన గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానించి నియామక పత్రం అందజేశారు. ఈ నెల 17 న ఆవిర్భవించిన కళావేదిక తెలుగు భాషా సంరక్షణ, సాహితీ విలువల సంస్థాపన ధ్యేయంగా పనిచేస్తుందని కవులకు రచయితలకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని శ్రీకాంత్ అన్నారు.వరద నీటి ప్రవాహంతో ప్రాణభయంనిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వల్ల తమకు ప్రాణభయం ఉందని తెలియజేస్తూ గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి మర్పల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువనకు మర్పల్లి గ్రామం ఉండటంతో గ్రామం చుట్టూ వరద నీరు చేరుతుందని తమకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తే ఇళ్లు కట్టుకొని జీవనం సాగిస్తామని సబ్‌కలెక్టర్‌ను కోరారు. తమను ఆదుకోవాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్, మర్పల్లి గ్రామస్తులు ఉన్నారు.నలుగురు విద్యార్థులు ఎంపికభిక్కనూరు: హైదరాబాద్ గౌలీపురలోని ఆలె నరేంద్ర స్టేడియంలో ఈ నెల 19న జరిగిన రాష్ట్ర స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీల్లో భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ఫిజికల్ డైరెక్టర్ వై.నర్సింహారెడ్డిలు తెలిపారు. అండర్–17 విభాగంలో పదో తరగతి చదువుతున్న జి.అంతోష్, బి.సుశాంత్, అండర్–15 విభాగంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.మహేశ్, డి.రాంచరణ్‌లు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వివరించారు. మహారాష్ట్రలోని షిరిడీలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.407 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుదోమకొండ: మండలానికి 407 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధులు తెలిపారు. లబ్ధిదారులకు గురువారం మంజూరు పత్రాలను అందజేశారు. వీవో యాదగిరి, మాజీ కో–ఆప్షన్ సభ్యులు షమ్మీ, అబ్రబోయిన రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
పిన్‌కోడ్‌లో ఆరు అంకెల రహస్యం
మీకు తెలుసా? సదాశివనగర్(ఎల్లారెడ్డి): తపాలా కార్యకలాపాల్లో పిన్‌కోడ్ నంబరులు కీలక పాత్ర పోషిస్తాయి. తపాలా శాఖ పరిధిలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేందుకు ఆరు అంకెల పిన్‌కోడ్‌ను ఉపయోగిస్తారు. ● చాలా ఏళ్లుగా ఉత్తరాలు, వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపడంతోపాటు ఇటీవల కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ కార్యకలాపాలు పిన్ కోడ్ ఆధారంగా కొనసాగిస్తున్నారు. ● మన దేశంలో 1972 ఆగస్టు 15 నుంచి పిన్‌కోడ్ నంబరు వినియోగంలోకి వచ్చింది. ● ఆరు అంకెలా పిన్‌కోడ్‌లో మొదటి అంకె జో న్ను, రెండో అంకెను సర్కిల్‌ను, మూడో అంకె జిల్లా చివరి మూడు అంకెలు తపాలా కార్యాల యం ఉన్న ప్రాంతంను సూచిస్తాయి. –ప్రధాన తపాలా కార్యాలయంతోపాటు ఉప తపాలా కార్యాలయాలకు కూడా పిన్‌కోడ్ నంబర్లను కేటాయించారు. ● పిన్‌కోడ్ నంబర్ల ఆధారంగా వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
కామారెడ్డి క్రైం: సుమారు ఐదు జిల్లాల్లో బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటూ బాధితులను ఎమర్చి బంగారం, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్ర్రాష్ట్ర దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. భిక్కనూర్‌కు చెందిన ఊరె లక్ష్మి దంపతులు స్థానికంగా బొంబు మర్చంట్ దుకాణం నడుపుతున్నారు. ఫిబ్రవరి 26న లక్ష్మి దుకాణంలో ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటలు కలిపాడు. బ్యాంకు నుంచి వచ్చానని, మీ దుకాణంపై రుణం ఇప్పిస్తామని నమ్మించి లక్ష్మిని బ్యాంకుకు తీసుకువెళ్లాడు. పేదవారిగా కనిపిస్తేనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తారని, మెడలోని బంగారు గొలుసు తీసేయాలని చెప్పారు. లక్ష్మి మెడలోని 3 తులాల బంగారం గొలుసును తీయగా, మేనేజర్ వద్దకు వెళ్లి వచ్చేదాకా తన వద్ద భద్రంగా ఉంచుతానని నమ్మబలికాడు. ఆమె దృష్టిని మళ్లించి అక్కడ నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, భిక్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆఫ్తాబ్ అహ్మద్ షేక్, ఫహీమా బేగం అనే భార్యా భర్తలు కబీరుద్దీన్, దీపక్ కిసాన్ సలుంకే అనే మరో ఇద్దరితో కలిసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భిక్కనూర్ టోల్ గేట్ వద్ద ఒకరిని, కామారెడ్డిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు భిక్కనూర్తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ తరహాలో మొత్తం 8 నేరాలు చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు గొలుసు, రెండు కార్లు, ఓ ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పట్టించిన బైక్ నెంబర్ ప్లేట్..అఫ్తాబ్ అహ్మద్ షేక్‌పై గతంలో 60 పైగా దృష్టి మళ్లింపు, చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా చోరీలు చేస్తూనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ఐదు జిల్లాల పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నా తప్పించుకు తిరుగుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ నేరస్తుడి గురించి దొంగ చిక్కడం లేదంటూ పలు టీవీ చానెళ్లలో వార్తా కథనాలు సైతం వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ అహ్మద్ షేక్ తప్పుడు నెంబర్ ప్లేట్‌తో ఉన్న బైక్‌ను వాడి పోలీసులకు చిక్కాడు. అతడు వాడిన బైక్ ముందర ఒక నెంబర్, వెనుక భాగంలో మరో నెంబర్ ఉండటాన్ని గమనించిన భిక్కనూర్ పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫేక్ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలను పట్టుకుని 6 కేసులను చేధించినట్లు ఎస్పీ తెలిపారు. అందుకే వాహనాల తనిఖీలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన భిక్కనూర్ సీఐ సంపత్ కుమార్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఆంజనేయులు, ఉస్మాన్, కానిస్టేబుళ్లు రవి, రాజేందర్, మైసయ్య, రమేష్ యాదవ్, మేకల నరేష్, జి నరేష్ లను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నరసింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఎరువులు మోతాదుకు మించి వాడొద్దు
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు తాము సాగు చేసిన పంటలకు రసాయన ఎరువులను, పురుగు మందులను మోతాదుకు మించి వాడొద్దని ఎల్లారెడ్డి ఏడీఏ సుధామాధురి అన్నారు. గురువారం ఆమె, ఏవో రాజలింగంతో కలిసి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. దుర్గం శివారులో మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోడానికి నానో యూరియా, డీఏపీ వాడాలని సూచించారు. నానో ఎరువుల నాణ్యత, ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం మండల కేంద్రంలో పలు రసాయన ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. -
ఒంటరి మహిళలే టార్గెట్..!
కామారెడ్డి క్రైం: రెండు రోజుల క్రితం లింగంపేట సమీపంలో వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. లింగంపేటలోని మట్టకిందిపల్లి కాలనీకి చెందిన ఒడ్డె ఎరుగుదిండ్ల చిన్నక్క (41) భర్త గతంలోనే చనిపోగా కూలీ పనులు చేసుకుంటూ జీవించేది. ఈ నెల 4న పింఛన్ డబ్బులు తెచ్చుకుంటానని బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశారు. రామాయిపల్లి అటవీప్రాంతంలో చిన్నక్క మృతదేహాన్ని పోలీసులు రెండు రోజుల క్రితం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. హత్యగా నిర్ధారించి విచారణ కొనసాగించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని పర్మల్ల తండాకు చెందిన బదావత్ ప్రకాష్ అలియాస్ చిరంజీవిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఈ నెల 4న నిందితుడు లింగంపేట కల్లు దుకాణం వద్ద చిన్నక్కను కలిసి మాటల్లో పెట్టాడు. డబ్బులు ఆశ చూపి తన వెంట అటవీప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేసి మృతురాలి సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. నిందితుడు ఒంటరిగా కనిపించిన మహిళలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడటం అలవాటు చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలోనూ దేవునిపల్లి పీఎస్ పరిధిలో ఓ మహిళ విషయంలో కూడా ఇదే తరహాలో హత్యకు పాల్పడగా ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ లింగారెడ్డి, లింగంపేట ఎస్సై దీపక్ కుమార్, సిబ్బంది సంపత్, లిక్యా నాయక్, అనిల్, శివ, రాజులు, ప్రకాష్ లను ఎస్పీ అభినందించారు. లింగంపేట హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర -
ఏసీబీకీ పట్టుబడ్డ ఆర్మూర్ ఎంవీఐ
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఏవీఐ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గుర్రం వివేకానందరెడ్డి రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టణంలోని పెర్కిట్ శివారులో గల తన కార్యాలయంలో గురువారం జిల్లా కేంద్రానికి చెందిన ఫిర్యాదు దారుడి నుంచి తన ప్రైవేటు డ్రైవర్ తిరుపతి మధ్య వర్తిగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల పునరుద్ధణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ తదితర ఫైళ్ల క్లియరెన్స్‌కు ఏజెంట్ వద్ద ఎంవీఐ లంచం డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం సదరు ఏజంట్ ఎంవీఐ ప్రైవేటు డ్రైవర్‌కు రూ. 25 వేల లంచం ఇవ్వగా వాటిని డ్రైవర్ ఎంవీఐకి అందజేసాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ చంద్ర శేఖర్‌గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేష్, శ్రీనివాస్ ఉన్నారు. ఆర్టీవో ఏజెంట్ వద్ద ప్రైవేటు డ్రైవర్ ద్వారా రూ.25 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
కామారెడ్డి జీసీడీవో సుకన్య నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని కామారెడ్డి జీసీడీవో సుకన్య ఆదేశించారు. నాగిరెడ్డిపేట కస్తూర్బా పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతనుపరిశీలించారు. ఉపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆమె సూచించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో మొత్తం 19 కస్తూర్బా పాఠశాలల్లో 5,800 మంది విద్యార్థినులు చదువుతున్నారన్నారు. వీటిలో 13 పాఠశాలల్లో ఇంటర్‌విద్య అమలవుతుందని చెప్పారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరయ్యేలా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రత్యేకాధికారిణి గీతతోపాటు ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. -
పెండింగ్‌లోనే సీఎంఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం పండించడంలో, ధాన్యం సేకరణలోనూ జిల్లా నంబర్ వన్‌గా నిలిచింది. అదేవిధంగా సీఎంఆర్ రికవరీని పెండింగ్ పెట్టడంలోనూ మొదటి స్థానంలోనే నిలబెట్టడంపై జిల్లా యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్క సీఎంఆర్ రికవరీ విషయంలో చర్యలకు దిగాలని ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించినా ఫలితం లేదు. ● 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావాల్సిందే రూ.60 కోట్లు. ఇందుకు సంబంధించి గతంలో సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్నా రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ రూపొందించి కేసుల మీద కేసులు పెట్టి తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అడ్వొకేట్ జనరల్‌తో కలిసి హైదరాబాద్‌లో సమీక్షకు రావాలని ఆదేశించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకుగాను షకీల్‌కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రి క్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్‌కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. షకీల్ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్‌కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు బాధితుడు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే, సీఎంఆర్ సైతం కిషోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రులుగా వచ్చిన జూపల్లి, సీతక్క అధికారిక సమీక్ష సమావేశాల్లో ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ విషయమై అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా స్పందించలేదు.కేసులకే పరిమితంసీఎంఆర్ రికవరీలో ఉన్నతాధికారులే అ ధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్‌రాజ్‌లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్‌మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపి ఉన్నతాధికారు లే, సదరు రైస్‌మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించారు. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుకు పంపించి, సీఎంఆర్‌ను కిషోర్‌కు చెందిన మిల్లు నుంచి ఇవ్వాలని ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిషోర్ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ, తదుపరి విచారణ, చర్యలు తీసుకోవడంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సదరు అధికారులను పోలీసులు ప్రశ్నించకపోవడం విశేషం. సీరియస్‌గా తీసుకోని అధికారులు గతంలో మంత్రి జూపల్లి, ప్రస్తుత మంత్రి సీతక్క ఆదేశించినా ఫలితం శూన్యం నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్ -
నేరాల్లోనూ జతగా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భార్యాభర్తల బంధమంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. కొందరు నేరాల్లోనూ జతగా నిలుస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో భర్తకు తోడుగా భార్య నేరంలో భాగస్వామిగా మారుతుండడం విస్మయం కలిగిస్తోంది. కామారెడ్డి పట్టణంలో ఈనెల 17 న సాయంత్రం సొంతూరుకు బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఓ మహిళ లిఫ్ట్ అడిగింది. వారు బైక్‌పై కొద్దిదూరం వెళ్లిన తర్వాత మరో బైకుపై వచ్చిన సదరు మహిళ భర్త వీరిని ఆపాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరు కలిసి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై దాడి చేసి అతడి వద్దనున్న రూ.2 వేలు, సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు భార్యభర్తలను అరెస్టు చేశారు. గతంలో భిక్కనూరు మండలంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో మాచారెడ్డి మండలానికి చెందిన భార్యాభర్తలను పోలీసులు కటకటాల వెనక్కి పంపిన విషయం తెలిసిందే. కామారెడ్డిలో మోసానికి పాల్పడిన ఘటనలో ఓ జంట అరెస్టయ్యింది. భార్యాభర్తలిద్దరూ అరెస్టయి జైలుపాలవడంతో వారి పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇదే సమయంలో నేరాలకు పాల్పడి చిక్కిన వారిపై ఎప్పటికీ ఆ ముద్ర అలాగే ఉండిపోతుంది. అలాంటి నేరాలు మళ్లీ ఎక్కడ జరిగినా పోలీసులు వారినే అనుమానించే పరిస్థితి ఎదురవుతుంది. తప్పించుకోలేరు... నేరం చేసిన వారు తప్పించుకునే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అడుగడుగునా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ నెట్వర్క్ నేరస్తులను పట్టిస్తున్నాయి. వేలిముద్రల ఆధారంగా నేరస్తులు ఎవరో తెలిసిపోతోంది. ఏదో ఒక సాంకేతిక ఆధారాన్ని సాక్ష్యంగా చూపి నేరస్తులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. నేరం చేసి దూరానికి పారిపోయినా సరే దొరికిపోతున్నారు.భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పుదారిలో వెళ్తే వారించి సరైన మార్గంలో పెట్టాల్సిన వారే తప్పుడు పనులకు, అది కూడా నేరాలకు తోడుగా నిలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పలు సంఘటనల్లో భా ర్య, భర్తలు భాగమవుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. కొన్నిచోట్ల కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య భూములు, ఆస్తుల గొడవల్లో జరిగే దాడులు, హత్యల్లోనూ భార్యభర్తలు భాగమై కేసుల్లో జైలుకు వెళుతున్నారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి వివాదంలో జరిగిన హత్య కేసులో భార్యభర్తలు అరెస్టయ్యారు. మరికొన్ని కేసుల్లోనూ భార్యభర్తలు అరెస్టయిన ఉదంతాలున్నాయి. పిల్లల కిడ్నాప్ సంఘటనల్లోనూ గతంలో ఓ జంట అరెస్టయ్యింది. ఈజీ మనీ కోసం ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సులువుగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు పోలీసులకు చిక్కి కటకటాలపాలు తాజాగా దారిదోపిడీ కేసులో మరో జంట అరెస్టు -
సంక్షిప్తం
‘విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి’ కామారెడ్డి అర్బన్:వినాయక విగ్రహాల తరలింపులో మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్‌కుమార్ సూ చించారు. మంగళవారం పట్టణంలోని ప లు ప్రాంతాల్లో పర్యటించారు. సిబ్బందికి పలు సూ చనలు ఇచ్చారు.పది ఫీట్ల కంటే ఎత్తున్న గణేష్ విగ్రహాల ను తరలించే క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు.మండపాల నిర్వహకులు ముందుగా విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తే తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. విద్యు త్ వైర్లపై చిందరవందరగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేసుకోవాలని ఆపరేటర్లకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే పరామర్శ నిజాంసాగర్(జుక్కల్): ఆరేడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు యాటకారి నారాయణను బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పరామర్శించారు. కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణ డిశ్చార్జి అయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరేడ్ గ్రామానికి వచ్చి నాయకుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు దుర్గారెడ్డి, రమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు. కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప కామారెడ్డి టౌన్: మండలంలోని తిమ్మక్‌పల్లి, ఇస్రోజీవాడి గ్రామంలో పలువురిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త సాయిలు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి భార్య ఇంద్రకు రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే బక్క మల్లయ్య, దుబ్బాక ఎల్లవ్వ, సాకలి లక్ష్మిలు చనిపోవడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే తిమ్మకపల్లిలో ఇటీవల మృతి చెందిన కవలలు రామ, లక్ష్మణ్‌ల కుటుంబాన్ని పరామర్శించి వారి తండ్రి నర్సింలుకు ఆర్థిక సాయం అందజేశారు. గొల్ల గంగయ్య, జిల్లేడు లక్ష్మి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గూడెం బాలరాజ్, మాజీ సర్పంచ్‌లు రాజు పాల్గొన్నారు. ఎమ్మారీఎస్ మండల కమిటీ ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఎమ్మార్పీఎస్ కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోచయ్య, ఉపాధ్యక్షుడిగా గన్నారం అల్లూరి, ప్రధాన కార్యదర్శిగా మాసాని సాయిలు, కోశాధికారిగా సాయిలు, ప్రధాన సలహాదారుగా లేగ్గల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం మండల అధ్యక్షుడు పోచయ్య మాట్లాడారు. ఈ నెల 23న ఎల్లారెడ్డి మండల కేంద్రానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు తెలిపారు. నేతలు నెల్లూరి గంగారాం, ద్యామని భూపతి, ఆశయ్య, రాజు, ఆగమయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మంజీరా నీటితో ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. చీనూర్, బంజర, వెంకంపల్లి తదితర గ్రామాల్లో బుధవారం పర్యటించి నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. ముంపునకు గురైన పంటల వివరాలను స్థానిక అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదల కావడం వల్ల నాగిరెడ్డిపేట మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో సుమారు 1,500 నుంచి 2000 ఎకరాలు నీటమునిగాయన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో సింగూర్ జలాలతో పంటలు ముంపునకు గురవుతున్న విషయం తెలుసుకున్న తాను ఆదివారం రాత్రి నుంచి జుక్కల్ ఎమ్మెల్యేతోపాటు నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తించామని చెప్పారు. సర్వే చేయించి వివరాలను సేకరిస్తామన్నారు. సింగూర్ నుంచి నీరు విడుదలైన ప్రతిసారీ పంటలు మునుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా మంజీరనదిలో తుమ్మచెట్లను తొలగింపజేసేలా నీటిపారుదలశాఖ అధికారులు రూ.1.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, నీటిపారుదలశాఖ డీఈఈ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, నాయకులు విక్రాంత్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సుధాకర్, కిష్టయ్య, తదితరులున్నారు. -
ఆగస్టులోనే పూసే ‘అగ్ని శిఖ’ పుష్పం
మీకు తెలుసా? వేసవిలో పూసే ‘మే’ పుష్పం మాదిరిగా ఆగస్టు మాసంలోనే పూసే మరో రకం పుష్పం ఉంది. దాని పేరే అగ్ని శిఖ (కలంగటి పువ్వు). దీనికి ‘గ్లోరీ లిల్లి’ అనే మరో శాసీ్త్రయ నామం కూడా ఉంది. ఇది ‘కొల్చి కేసియే’ అనే కుటుంబానికి చెందిన మొక్క. మొత్తం 11 రకాల జాతుల్లో ‘అగ్ని శిఖ’ ఒకటి. ● ఇది భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో అలాగే సముద్రపు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి వర్షాకాలంలో రుతుపవనాలకు అనుకూలంగా ఉండి పుష్పాలు పూస్తాయి. ● ఇది తమిళనాడు రాష్ట్ర పుష్పం కూడా. మొక్క మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు, ముదురు గులాబీ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ● వినాయక చవితి పండుగకు ముందు ఇవి భారీగా వికసిస్తాయి. అందుకే వీటిని ‘ఎంకయ్య పువ్వు’ అని కూడా అంటారు. చవితి రోజు గణపతిని ఈ పుష్పాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. ఎడ్లపొలాల అమావాస్య నాడు కూడా వీటిని రైతులు పూజకు ఉపయోగిస్తారు. ఇలా చేయడం పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ● పవిత్రంగా భావించే ఈ మొక్కను విషపూరితమైనదిగా పరిగణిస్తారు. మనుషులు, పశువులు తినకూడదంటారు. కానీ, దీనిని ఆర్థరైటిస్, అల్సర్, కు ష్టు, పైల్స్, కడుపునొప్పి, చర్మ సంబంధిత, ఇత ర చాలా రకాల వ్యాధులకు ఉపయోగిస్తారట. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
కారుచౌక మోసం
కేసు వివరాలు తెలుపుతున్న ఎస్పీ రాజేశ్చంద్ర, పోలీసులుజిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల్వాయి ప్రశాంత్ గౌడ్ ఫేస్బుక్ అప్లికేషన్లో చూసి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజు ఓ వ్యక్తి వచ్చి అది తన కారని చెప్పి తీసుకుపోయాడు. కారు విక్రయించిన వ్యక్తులకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన గతనెల 7వ తేదీన మాచారెడ్డి పీఎస్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొందరు ముఠాగా ఏర్పడి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలించారు. ముఠాగా ఏర్పడి.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపీనగర్‌కు చెందిన మహమ్మద్ ఇయాజ్, వికారాబాద్‌లోని ఆలంపల్లికి చెందిన మహమ్మద్ జాహీద్ అలీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పృధ్వి జగదీష్, రాచర్ల శివకృష్ణ, వేములవాడకు చెందిన వివేక్, శేరిలింగంపల్లి మండలానికి చెందిన కర్ణకోట సాకేత్, అలీ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముందుగా ట్రావెల్స్ సంస్థల నుంచి వ్యక్తిగతంగా ఇచ్చే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకుంటారు. వాటి నంబర్ ప్లేట్లు మార్చేసి నకిలీ ఆర్సీ, ఇతర పత్రాలు సృష్టిస్తారు. అనుమానం రాకుండా నకిలీ ఆర్సీ తయారు చేయడానికి ఆన్లైన్ వెబ్సైట్లలో ఖాళీ మైక్రో సిమ్ కార్డులు, ఖాళీ చిప్ కార్డులను కొంటారు. వాటిపై పేర్లు, వివరాలను ప్రింటింగ్ చేస్తారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతర పత్రాలన్నీ తయారు చేస్తారు. ఆపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కారు అమ్మకానికి ఉందని పెట్టి, తక్కువ ధరకే వాటిని అమ్మనున్నట్లు పేర్కొంటారు. కారు, చౌక ధరను చూసి ఆకర్షితులైనవారు వారి వలలో చిక్కుతున్నారు.కారును అమ్మేటప్పుడు దాంట్లో జీపీఎస్ ట్రాకర్‌ను అమరుస్తారు. దీంతో కారు ఎక్కడుందో వారికి తెలిసిపోతుంది. కారున్న చోటుకు వెళ్లి రాత్రికి రాత్రి వారు విక్రయించిన కారునే చోరీ చేసి తీసుకువచ్చి అసలు యజమానికి అప్పగిస్తున్నారు. అలా వీలు కాని సందర్భాల్లో ఇతరులను పంపి కారు మాది అంటూ బెదిరింపులకు పాల్పడి ఎత్తుకొస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని కారు అమ్మిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నారు. అద్దెకు తెచ్చి.. ఫేక్ ఆర్సీ, నంబర్ ప్లేట్ తయారు చేసి.. ఫేస్బుక్ ద్వారా తక్కువ ధరకు విక్రయం ఆపై అదే కారును చోరీ చేసి.. యజమానికి అప్పగిస్తున్న వైనం ముఠా గుట్టురట్టు చేసిన మాచారెడ్డి పోలీసులు ఆరుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరొకరు వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
వాగుల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): అచ్చంపేట, మర్పల్లి, లింగంపల్లి, ఆరేడ్ గ్రామాల పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను బుధవారం స్థానిక ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వరదల వల్ల వంతెనలు నీటమునగడంతో ఆ రోడ్లపై ప్రయాణం చేయవద్దని ఆయా గ్రామాల ప్రజలకు ఎంపీడీవో సూచించారు. జీపీ కార్యదర్శి తుకారాం తదితరులున్నారు. రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్‌పేట్, మర్కల్ గ్రామాల్లో గల బీటీ రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర్మారావ్‌పేట్ శివారులోని పెద్దమ్మ ఆలయం వద్ద బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీగా గుంతలు పడటంతో ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులు దృష్టి సారించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు. -
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ తనిఖీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ ఆకస్మికంగా ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల వాష్‌రూంలు, లైబ్రరీ, ల్యాబ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నా రా అని అడిగారు. ఆయన వెంట తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ప్రిన్సిపల్ గాంధీ, ఉపాధ్యాయులు జహంగీర్, రాజశేఖర్, లక్ష్మణ్‌సింగ్, బ ల్వంత్రావు, విద్యారమణ తదితరులున్నారు. కామారెడ్డి క్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాడకంలో లేని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, ఇతర వస్తువులకు శుక్రవారం(22న) జిల్లా పోలీస్ కార్యాలయంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, కంప్యూటర్ సామగ్రి, జిరాక్స్ మిషన్లు, టెంట్లు, షామియానాలు, ఫర్నిచర్, ఇనుప వస్తువులను వేలం ద్వారా విక్రయించనున్నామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 గంటల కల్లా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం ముగిసిన వెంటనే డబ్బులు చెల్లించి వస్తువులు తీసుకువెళ్లాలని సూచించారు. సందేహాలకు 87126 86115(ఆర్ఎస్సై చంద్రశేఖర్), 87125 25970 (ఏఆర్ కానిస్టేబుల్ అంకుష్)లను సంప్రదించాలన్నారు. కామారెడ్డి టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్లను తక్షణమే విద్యార్థులకు చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల నిధులను విడుదల చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి గోపాల్ సింగ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు శివ, కార్యదర్శి సునీల్, నాయకులు సూర్యపాల్, తరుణ్ తదితరులున్నారు. కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ, బీఈడీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం ఏడు పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పీజీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో 2,366 మంది విద్యార్థులకు 2,240 మంది హాజరుకాగా 126 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో మొత్తం 1,444 మంది విద్యార్థులకు 1,379 మంది హాజరుకాగా 65 మంది గైర్హాజరైనట్లు చంద్రశేఖర్ తెలిపారు. -
నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దు
ప్రమాదాలకు అనువుగా ఉన్న నిషేధిత ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లవద్దని, విహార యాత్ర విషాదానికి కారణం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. వర్షాలు, వరద నీటి ప్రవాహాల సమయంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టును ఎస్పీ సందర్శించారు. పర్యాటకులతో మాట్లాడారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు పోలీసుల సలహాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అంతకుముందు అచ్చంపేట గెస్ట్‌హౌస్‌లో బాన్సువాడ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య, బిచ్కుంద సీఐ రవికుమార్, బాన్సువాడ టౌన్ సీఐ అశోక్, స్థానిక ఎస్సై శివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
డాక్టరేట్ ప్రదానం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామానికి చెందిన ఉద్యమారి నాగలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ కుమార్, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ చేతుల మీదుగా నాగలక్ష్మి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. హిస్టరీ విభాగంలో సీ్త్ర సాధికారతపై బౌద్ధ దృక్పధం అనే అంశంపై నాగలక్ష్మి రీసెర్స్ చేశారు. నాగలక్ష్మి ప్రస్తుతం పురాతత్వ శాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. బీర్కూర్‌కు చెందిన ఉపాధ్యాయుడికి..బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ అప్రోజ్ అనే ఉపాధ్యాయుడు బుధవారం హై దరాబాద్‌లో ప్రొఫెసర్ షీలా మిశ్రా చేతుల మీదు గా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సమకాలీన హిందీ చలనచిత్రాల్లో వృద్ధుల ప్రతిబింబం అనే అంశంపై ఆయన విశేష పరిశోధన చేసి పీహెచ్డీ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాల హిందీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షీలా మిశ్రా, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ఇస్రో చైర్మన్ నారాయణన్‌ల చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా అప్రోజ్ మాట్లాడుతూ..తన విజయం వెనుక గురువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారని..వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జప్తిజాన్కంపల్లిలో బుధవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగామాత ఆలయ ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామశివారులోని ఊరచెరువు వద్ద గల గంగామాత ఆలయం పురోహితుడు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ సర్పంచ్ దేశబోయిన సాయిలు, తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు బాన్సువాడ రూరల్: మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలికలను బ్యాడ్‌టచ్ చేస్తూ వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కొన్నిరోజులుగా శారీరకంగా వేధిస్తుండంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా అధికారి స్రవంతి, బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావులు బుధవారం పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు విద్యార్థినుల తో అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి పోలీసు లు, ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో బాన్సువాడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ఈ పాఠశాలలో జరిగిన కంప్యూటర్ల చోరీలోనూ సదరు ఉపాధ్యాయుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు కామారెడ్డి క్రైం: నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి కామారెడ్డి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూర్‌కు చెందిన జమ్మగౌని పోట్ల ముత్తాగౌడ్ తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా బోయిని స్వామి అనే వ్యక్తి తన ఆటోను అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ముత్తా గౌడ్ మరుసటి రోజు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ స్వామిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సాక్ష్యాలను పరిశీలించిన ప్రత్యేక మొబైల్ కోర్టు 2024 ఏప్రిల్ 4 న నిందితుడికి 9 నెలల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అనంతరం నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. బుధవారం కేసును పరిశీలించిన జిల్లా జడ్జి వరప్రసాద్ గతేడాది ప్రత్యేక మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని భావిస్తూ తీర్పునిచ్చారు. కేసును సరైన పద్ధతిలో విచారణ చేసి పకడ్బందీ ఆధారాలతో కోర్టులో అభియోగపత్రం వేసి నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన ఎస్సై రాజు, పోలీసుఅధికారులను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
‘బాధ్యతగా పని చేయాలి’
బాన్సువాడ : ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మా ర్గాలను అన్వేషించాలని ఆర్టీసీ ఈడీ సోలో మన్ సూచించారు. బుధవారం బాన్సువాడ డిపోను ఆయన సందర్శించి, సిబ్బంది, కార్మికులతో మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని, ఖర్చులు తగ్గిస్తూనే ఆదాయ మార్గాల ను అన్వేషించాలని సూచించారు. ఇందుకో సం కార్మికులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలన్నారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, బాన్సువాడ డిపో మేనేజర్ సరితాదేవి తదితరులు పాల్గొన్నారు. ● ఒక్కో స్కూల్ నుంచి రూ. ఐదొందలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చే నిధుల వినియోగంపై నిర్వహించే ఆడిటింగ్కోసం వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆడిట్ చేయడానికి వచ్చే సిబ్బంది కోసమంటూ ప్రతి పాఠశాల నుంచి రూ.5 వందల చొప్పున మధ్యవర్తులు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. స్కూళ్లపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, చివరికి ఆడిటింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ కాంప్లెక్సుల వారీగా డబ్బులు వసూలు చేసి ఆడిటింగ్ సిబ్బందికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇలాంటి వాటిని నిలువరించాల్సిన అవసరం ఉంది. దోమకొండ: ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ఆశయాలను సాధించే దిశగా కృషిచేయాలని స్వేరోస్ ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. గురువారం దోమకొండలో స్వేరోస్ నెట్వర్క్ వైస్‌చైర్మన్ దేవరగట్టు బాలప్రసాద్ తల్లి సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బడుగు బలహీన వ ర్గాల అభ్యున్నతితో దేశం ముందంజ వేస్తుందన్నారు. కార్యక్రమంలో స్వేరోస్ చైర్మన్ మామిడాల ప్రవీణ్‌కుమార్, ప్రతినిధులు దుర్గయ్య, బాల్‌రాజు, లక్ష్మణ్, రాజ్‌కుమార్, రాజు, రాములు, రవీందర, పాత రాము, మురళి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనుల జాతరకు శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ. 2,523.17 కోట్లతో 3,347 పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేర కు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింద ని డీఆర్డీవో సురేందర్ తెలిపారు. పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్లాస్టి క్ వేస్టేజ్ యూనిట్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల ని ర్మాణం, మహిళా సంఘాలకు పశువుల కొట్టా లు, కోళ్లు, గొర్రెల షెడ్లు, బావుల తవ్వకం, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లా పిట్లు, పండ్ల తోటల పెంపకంలాంటి పను లు చేపట్టనున్నామన్నారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రేపటి నుంచి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. -
చెక్‌డ్యాం పైనుంచి వెళ్లొద్దు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● తాడ్వాయి మండలంలో పర్యటనతాడ్వాయి: వాటర్ ఓవర్‌ఫ్లో తగ్గేంతవరకు ప్రజలు చెక్డ్యాంలపైనుంచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం తాడ్వాయి మండల కేంద్రంతోపాటు సంతాయిపేట్, చిట్యాల గ్రామాలలో పర్యటించారు. సంతాయిపేట్ శివారులోని శ్రీభీమేశ్వరాలయం వద్ద పారుతున్న భీమేశ్వర వాగును పరిశీలించారు. అధికంగా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు చెక్డ్యాంపైకి ఎవరిని వెళ్లనీయొద్దన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. చిట్యాల పాఠశాలలో సీడ్ బాల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విత్తన బంతుల విస్తరణ కార్యకరమాన్ని నిర్వహించారు. గ్రామాలలో కోతుల బెడద పోవాలంటే పండ్ల మొక్కలను పెంచాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తాడ్వాయిలో డ్రోన్ ద్వారా మందులు, ఎరువులను ఎలా పిచికారి చేయాలో రైతులకు అవగాహన కల్పించారు. నానో యూరియా ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మల్లేష్, డీఈవో రాజు, మండల ప్రత్యేకాధికారి శివకుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో కృష్ణాగౌడ్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టుకు జన కళ
● నిజాంసాగర్‌నుంచి కొనసాగుతున్న నీటి విడుదల ● భారీగా తరలివచ్చిన పర్యాటకులునిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు, తిలకిస్తున్న పర్యాటకులునిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు జనసంద్రంగా మారింది. ప్రాజెక్టు అందాలను తిలకించడానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 65,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ ఉన్న సింగూరు ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా హల్దీవాగు, పోచారం ప్రాజెక్టు అలుగుల ద్వారా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 16 గేట్ల ద్వారా 1,00,600 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,403.25 అడుగుల (15.323 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కౌలాస్నాలాకు 2,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 2,724 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 2,624 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీ) కాగా.. ప్రస్తుతం 457.65 మీటర్ల (1.152 టీఎంసీ) నీరు నిల్వ ఉందన్నారు. -
తండాలపై డెంగీ పంజా..!
● సోమారంపేటలో 20 మందికి పాజిటివ్ ● ప్రయివేట్ ఆస్పత్రులలో చేరుతున్న బాధితులు మాచారెడ్డి: గిరిజన తండాలపై డెంగీ పంజా విసురుతోంది. చాలా మంది జ్వరపీడితులు ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని సోమారంపేట, ఎల్లంపేట, బంజపల్లి, సర్దాపూర్ తండాల్లో గిరిపుత్రులు జ్వరాల బారినపడి మంచం పట్టారు. ఒక్క సోమారంపేట గ్రామంలోనే 20 మందికి డెంగీ సోకి ప్రైవేట్ ఆస్పత్రులలో చేరినట్లు ఆయా గ్రామాల ప్రజలు సాక్షికి తెలిపారు. ఇటీవల పాల్వంచ మండలం భవానిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్ నగర్లో దాదాపు 25 మందికి డెంగీ సోకింది. మాచారెడ్డి వైద్యాధికారి ఆదర్శ్ ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వరపీడితులకు వైద్యం అందించారు. ఓ మహిళకు సీరియస్ మండలంలోని గజ్యా నాయక్ తండాకు చెందిన ఓ మహిళకు డెంగీ సోకి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల అనంతరం కోలుకొని ఇంటికి చేరింది. మండలంలోని పలు గ్రామా ల్లో వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. సోమారంపేటలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం జ్వరాలు అదుపులోకి వచ్చాయి. అయి నా మా వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. –ఆదర్శ్, వైద్యాధికారి, మాచారెడ్డి -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
భిక్కనూరు: ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని భిక్కనూ రు ఎంఈవో రాజగంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అంతంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా విద్యను బోధించాలని చెప్పారు. సామర్థ్యాలను పెంపొందించాలి మాచారెడ్డి: ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించాలని మాచారెడ్డి ఎంఈవో దేవేందర్‌రావు అన్నారు. టీఎల్ఎం మేళాలో భాగంగా గురువారం ఆయన చుక్కాపూర్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు వెంకటాచారి, గోవర్ధన్‌రెడ్డి, హెచ్ఎం మాన్సింగ్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖలీల్‌వాడి: నగరంలోని సారంగపూర్‌లోని పెట్రోల్ బంక్ వద్ద గంజాయిని ఆటోలో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని సారంగపూర్‌కు చెందిన సయ్యద్ వాసీం చిన్న ప్యాకెట్లను ఏర్పాటు చేసుకొని గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సారంగపూర్ పెట్రోల్ బంక్ వద్ద ఆటోను ఆపి తనిఖీలు నిర్వహించగా వాసీం వద్ద 100 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ను, ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సిబ్బంది రామ్‌కుమార్, హమీద్, విష్ణు, అవినాష్, భోజన్న ఉన్నారు. -
ఆశ కార్యకర్త ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడిలో ఓ ఆశ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలు ఇలా.. పద్మాజీవాడికి చెందిన మ్యాదరి అంబిక(40) గతకొన్ని రోజులుగా ఆశ కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కొన్నేళ్ల క్రితమే భర్త మరణించాడు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించింది. దీంతో అప్పులు పెరిగిపోవడంతోపాటు, ఒంటరిగా జీవిస్తుండటంతో జీవితంపై విరక్తి చెందింది. ఈక్రమంలో సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురై, డబ్బులు పోగొట్టుకోగా పోలీసులు రికవరీ చేశారు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. కోటగిరి గ్రామానికి చెందిన ఎజాస్ అహ్మద్ ఖురేషి అనే వ్యక్తి వాట్సప్‌కు 13 ఏప్రిల్ 2025 నాడు అనుమానాస్పద లింక్ మెసేజ్ రాగా ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు దోచేశారు. వెంటనే బాధితుడు కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, వారు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి బాధితుడికి రూ.5వేలు రిఫండ్ చేయించారు. నిజామాబాద్ లీగల్/కామారెడ్డి క్రైం: ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలాలా.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన గుడిలింగం పండరి అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. సులువుగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలకు అలవాడు పడ్డాడు. ఈక్రమంలో గ్రామంలోని గోనె కాశవ్వ (58) అనే వృద్ధురాలి ఆభరణాలను దొంగిలించాలనుకున్నాడు. 29 సెప్టెంబర్, 2024న కాశవ్వ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె తలపై రోకలి దుడ్డుతో కొట్టి హత్యచేసి, ఆమె మెడలో ఉన్న గుండ్లు, చెవులకు ఉన్న నగలను దొంగిలించాడు. మృతురాలి కుమారుడు బాబయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. నిందితుడు లింగంను అప్పట్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ (ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి హత్యా నేరానికి గాను జీవిత ఖైదు, దొంగతనం నేరానికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఎస్సీ మహిళను చంపినందుకు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9 నెలల జైలు ఎల్లారెడ్డి: బైక్ చోరీ కేసులో ఇద్దరికి 9నెలల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించారు. వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన బత్తుల హరిక్రిష్ణ ఎల్లారెడ్డి పట్టణంలో ఉంటూ మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. 2024 డిసెంబర్ 11న అతడి బైక్ ఇంటి ముందు నుంచి చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులుగా ఎర్ర అశోక్, దొడ్ల గోపాల్‌గా గుర్తించారు. కోర్టు లో విచారణ జరుగగా ఎల్లారెడి కోర్టు జడ్జి సుష్మ నిందితులకు 9 నెలలు జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సిరికొండ: మండలంలోని కొండూర్ గ్రామంలో సుంకెట విజయకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు తహసీల్దార్ రవీందర్రావు మంగళవారం తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, టీవీ, ఫ్రిజ్, సెల్ఫోన్లు, బియ్యం, నగదు, బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో సుమారు రూ.4లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. -
బోధన్‌లో కలకలం రేపిన రేసింగ్ పావురం
బోధన్‌రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో కోడింగ్ స్టిక్కర్‌తో ఉన్న పావురం కలకలం రేపింది. మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఓ బాలుడు ఆడుకుంటుండగా పావురం దొరికింది. ఆ పావురం కాలికి, రెక్కలకు కోడింగ్ నెంబర్లతో ఉన్న స్టిక్కర్లు ఉన్నాయి. దీంతో ఆ పావురం గూఢచారి పావురం అంటూ ప్రచారం జరిగింది. గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని పావురాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ తీసుకొచ్చారు. ఈ పావురం రేసింగ్ గేమ్‌కు సంబంధించినదని ఎస్సై తెలిపారు. పావురాన్ని పరిశీలించి వదిలేసినట్లు చెప్పారు. ఎటువంటి కేసు నమోదు చెయ్యలేదన్నారు. ఈ పావురం ఘటన మంగళవారం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ శివారులో మంగళవారం వేకువజామున డీసీఎం వాహనం చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి పిట్లం వైపు వెళ్తున్న డీసీఎం ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. రాజంపేట: బోధన అభ్యాస సామగ్రి(టీఎల్ఎం) ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించవచ్చని మండల విద్యాధికారి పూర్ణ చంద్ర రావ్ అన్నారు. మంగళవారం రాజంపేట బాలికల ఉన్నత పాఠశాలలో టీఎల్ఎమ్ మేళా నిర్వహించారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాల నుంచి ఉపాధ్యాయులు టీఎల్ఎంను తయారు చేసి ప్రదర్శించారు. బోధన అభ్యాస సామాగ్రి మేళాను స్థానిక తహసీల్దార్ జానకి సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలిచ్చారు. హెచ్ఎంలు విజయలక్ష్మి, ఈశ్వరయ్య, రమేష్, రెడ్య, కిషన్, కరుణశ్రీ, విజయలక్ష్మి, రీసోర్స్ పర్సన్లు ముదాం స్వామి, శ్రీధర్ గౌడ్, రాజేందర్, నిరూపమా రాణి, సీఆర్పీలు లింగం, సాయిరెడ్డి, రమేష్, సూర్యా పాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనందం కావొద్దు విషాదం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వినాయక చవితి వస్తుందంటే అందరిలోనూ ఆనందం. నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెడతారు. అందరికన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న విగ్రహం కొనాలని ఎక్కడెక్కడికో వెళ్లి తీసుకొస్తారు. మండపాలను అందంగా తీర్చిదిద్దడానికీ పోటీ పడతారు. తొమ్మిది రోజుల పాటు పూజలు, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరకు నిమజ్జన కార్యక్రమంలో నృత్యాలు చేస్తూ పూర్తిచేస్తారు. అయితే ఆనందంలో చేసే నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. వినాయక చవితి ఉత్సవాలకు ముందుగానే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళుతుండగా ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్మూర్ నుంచి సిరిసిల్లాకు కామారెడ్డి మీదుగా మంగళవారం ఉదయం ఎత్తైన విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్తు వైర్లు తగిలి ఓ యువకుడు తన పుట్టిన రోజునే ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలిచివేసింది. గతంలోనూ అనేక అనుభవాలున్నాయి. అయినా విగ్రహాలను తరలించే సమయంలో, శోభాయాత్ర ఊరేగింపులోనూ జాగ్రత్తలు తీసుకోక ప్రాణాలు పోతున్న ఘటనలు ప్రతి ఏడాది జరుగుతున్నాయి. చెరువుల్లో నిమజ్జనం చేసేటపుడు.. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో అవి ఎంతకూ మునగడం లేదని లోతుల్లోకి తీసుకెళ్తుంటారు. ఒక్కోసారి విగ్రహం అదుపు తప్పి వారిపై పడుతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. జిల్లాలో ప్రతి ఏడాది ఒకరిద్దరు నిమజ్జనం చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈత వచ్చినా ఒక్కోసారి పైన విగ్రహం పడితే దాని కింద కూరుకుపోయి చనిపోతారు.వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజేలు వాడడం, భారీ సౌండ్‌తో గుండె తట్టుకోలేక ప్రాణాలు పోయే పరిస్థితులున్నాయి. రెండేళ్ల నాడు రామారెడ్డి మండలం రెడ్డిపేటలో డీజే సౌండ్‌తో ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కుటుంబానికి తీరని వేదన మిగిలింది. తమతో కలిసి ఉన్న స్నేహితుడి ప్రాణాలు పోవడంతో మిత్రులంతా ఆవేదనకు గురయ్యారు. వారికి జీవితాంతం ఒక బాధైతే మిగిలింది. జిల్లా కేంద్రంలో డీజేలకు అనుమతులు ఇవ్వడం లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డీజేలు వాడుతున్నారు. డీజే సౌండ్‌తో అన్ని వయసుల వారికి ప్రమాదమన్న విషయాన్ని గుర్తించాలి. వినాయక ఉత్సవాల్లో జాగ్రత్తలు అవసరం చిన్న చిన్న పొరపాట్లే ప్రాణాలు తీస్తాయి శోభాయాత్ర, నిమజ్జన సమయంలో మరింత జాగ్రత్త అవసరంవినాయక విగ్రహాలను తరలించే సమయంలో సమాచారమిస్తే మా సిబ్బంది సహకరిస్తారు. వైర్లను స్వయంగా తొలగించే ప్రయత్నం చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. ఆరేపల్లి వద్ద జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించాం. ఎత్తైన విగ్రహాన్ని తీసుకువెళ్లేటపుడు సమాచారం ఇవ్వాలి. వినాయక మండపాల వద్ద విద్యుత్తు కనెక్షన్ల కోసం, నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. మా దృష్టికి తీసుకురాకుండా వైర్లను తొలగించొద్దు. – శ్రావణ్‌కుమార్, ఎస్ఈ, విద్యుత్ శాఖవినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద విద్యుత్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే విగ్రహాలను ప్రతిష్ఠించడానికి తరలించే సమయంలో, నిమజ్జనం వేళ శోభాయాత్రలో వెళ్తున్నపుడు కరెంటు వైర్లు తగిలి ఇనుప రాడ్లతో వాహనాలపై కూర్చున్నవారు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల వినాయక విగ్రహాలు మరీ ఎత్తుగా ఉండి, తరలించేటపుడు చూసుకోక ఇబ్బందులు పడుతున్నారు. -
విత్తనక్షేత్రంలో వానాకాలం సాగులేనట్లేనా..?
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ యేడు వానాకాలం పంటలసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ యేడు విత్తనక్షేత్రంలో వానాకాలం పంటల సాగు లేనట్లేనా అంటే ప్రస్తుతం క్షేత్రంలో నెలకొన్న పరిస్థితులు అందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. సగం సీజన్ పూర్తయినా ఇప్పటివరకు క్షేత్రభూముల్లో పంటలసాగుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభమవ్వలేదు. వందల ఎకరాల సాగుభూమిని కలిగి ఉన్న మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వానాకాలం పంటల సాగు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. క్షేత్రభూముల్లో పంటలసాగు కోసం ప్రతియేడులాగే ఈ యేడు కూడ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ రెండుమార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ నేటికీ ఉన్నతాధికారుల నుంచి పంటలసాగు కోసం ఎలాంటి అనుమతులు రాలేదని క్షేత్ర అధికారులు తెలిపారు. ఈ యేడు వానాకాలంలో విత్తనక్షేత్రంలో 50 ఎకరాల్లో వరి, మరో 80 ఎకరాల్లో జీలుగ పంటలను సాగు చేయాలని క్షేత్రఅధికారులు కమిషనర్ కార్యాలయానికి రెండు మార్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. కాని పంటలసాగుపై వారి నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని క్షేత్రఅధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా విత్తనక్షేత్ర భూముల్లో వానాకాలం పంటలసాగుకు సంబంధించి నేటికీ ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. వరిసాగు కోసం కనీసం నారుమడిని సిద్ధం చేయలేదు. ప్రతియేడు ఇదే తీరు.. వందల ఎకరాల సాగుభూమిని కలిగి ఒకప్పుడు మేలు రకాల నూతన వరి వంగడాల ఉత్పత్తితో తెలంగాణ వ్యాప్తంగా పేరుగాంచిన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రంలో అధికారుల తీరుతో నిర్లక్ష్యపునీడలు అలుముకున్నాయి. సాధారణంగా రైతులు వానాకాలం పంటలసాగులో భాగంగా చాలారోజులక్రితమే వరినాట్లు పూర్తిచేశారు. ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన విత్తనోత్పత్తిక్షేత్రంలో నేటికీ వానాకలం పంటలసాగు పనులు ప్రారంభంకాలేదు. పంటలసాగుకు ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఈ యేడు క్షేత్రభూములు పంటలసాగుకు నోచుకోక బీడుగానే మిగలనున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పంటలసాగు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిన క్షేత్రఅధికారులు ఉన్నతాధికారుల నుంచి నేటికీ రాని అనుమతులు బీడుగా మిగిలిన విత్తన క్షేత్ర భూములు -
నాణ్యమైన భోజనం అందించాలి
మాచారెడ్డి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కామారెడ్డి ఆర్డీవో వీణ సూచించారు. మంగళవారం ఘన్పూర్(ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సరళ, ఎంపీడీవో గోపిబాబు, ఎంఈవో దేవేందర్‌రావ్, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: మహ్మద్‌నగర్ మండలంలోని నర్వ చెరువు కట్టపై మట్టి పోసి అలుగు ఎత్తు పెంచడంతో వెంకటాపూర్ గ్రామ శివారు పంటలు నీట మునుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువు కట్టపై పోసిన మట్టిని తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని వెంకటాపూర్ గ్రామస్తులు కోరారు. ఈమేరకు మంగళవారం తహసీల్దార్ ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామస్తులు మల్లేష్, సాయిలు తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: జాతీయ సామాజిక పని వారోత్సవాల సందర్భంగా స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీజీ సోషల్ వర్క్ విద్యార్థులు మంగళవారం మానవహారం ఏర్పాటు చేశారు. సోషల్ వర్క్ స్టడీస్ చైతన్యంతో సామాజిక సేవా ధృక్పథం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాడుతాయని ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో సోషల్‌వర్క్ విభాగాధిపతి జి.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు పీబీ సత్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాత జ్ఞాపకాలను పదిలం చేసేదే ఫొటోగ్రఫీ
కామారెడ్డి అర్బన్: ఫొటోగ్రఫీ అనేది జీవితాన్ని చిత్రీకరించే సృజనాత్మక కళ అని, పాత జ్ఞాపకాలను పదిలం చేస్తుందని అదనపు కలెక్టర్ చందర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఫొటోగ్రాఫర్లకు సన్మానం చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ఫొటోగ్రాఫర్లను సన్మానించి మాట్లాడారు. ఫోటో జ్ఞాపకాలపై రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ముస్కు జైపాల్‌రెడ్డి మాట్లాడారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు యాచం శంకర్, కార్యదర్శి సబ్బని కృష్ణహరి, ప్రతినిధులు పాల్గొన్నారు. బాన్సువాడ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం బాన్సువాడలో ఘనంగా నిర్వహించారు. ఆర్అండ్బీ అతిధి గృహంలో లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ ఫొటోగ్రాఫర్ దండు సంజీవరావును సన్మానించారు. ఫోటోగ్రాఫర్లు గంగాధర్ యాదవ్, గోవర్ధన్, శేఖర్, వెంకటేష్, దత్తు, ఫయాజ్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఫొటోగ్రాఫర్లు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఫొటోగ్రాఫర్లు కృష్ణ, విఠల్, భూపాల్, కార్తిక్ తదితరులున్నారు. -
దారిదోపిడీ కేసులో భార్యాభర్తల అరెస్టు
కామారెడ్డి క్రైం: లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న నిందితులను కామారెడ్డి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన పెద్దల రాజు అనే వ్యక్తి కామారెడ్డిలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 17న సాయంత్రం అతడు విధులు ముగించుకుని ఇంటికి తన బైక్‌పై బయలుదేరాడు. బస్టాండ్ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ లిఫ్ట్ అడగడంతో రాజు లిప్ట్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ఈఎస్ఆర్ గార్డెన్ వరకు వెళ్లగానే మరో బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. సదరు గుర్తుతెలియని వ్యక్తి, మహిళ ఇద్దరూ కలిసి రాజుపై దాడి చేసి అతని వద్దనున్న రూ.2 వేలు నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. రాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న బైండ్ల లక్ష్మీ, ఆమె భర్త రాయపాని రవికుమార్‌గా గుర్తించారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తెలిపారు. నిందితులు మాటల్లో పెట్టి లిఫ్ట్ ఇవ్వాలని అడిగి, గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్లగానే దాడి చేసి దోచేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసును చేధించిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అభినందించారు. -
23న శనేశ్వరుడికి అమావాస్య తైలాభిషేకం
కామారెడ్డి అర్బన్: స్థానిక శని శింగనపురం శనేశ్వరస్వామికి ఈనెల 23న పొలాల అమావాస్య సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి తైలాభిషేకం, సాయంత్రం దీపోత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శని బాధలు తొలిగించుకోవడానికి భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులందరూ సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) కమిటీ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి అన్నారు. ఎర్రాపహాడ్లోగల రెడ్డి సంఘం భవనంలో మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో రైతులకు ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఏడుగురు రైతులతో కమిటీని ఏర్పాటు చేసుకొని నెలనెలా సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే సంవత్సరానికి 4 రైతు పండుగలను జరుపుకోవాలని సూచించారు. నేతలు ఆనంద్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలోని సీతాయిపల్లి శివారులో మంగళవారం ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలు ఇలా.. బాన్సువాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు బయలు దేరింది. కొండాపూర్– సీతాయిపల్లి గ్రామాల మధ్య బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈక్రమంలో రోడ్డుపై గుంతల కారణంగా బస్సు అదుపుతప్పి రోడ్డుకు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి, చెట్టు వద్ద నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను డ్రైవర్ డోర్ ద్వారా కిందికి దింపారు. ఘటన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులున్నట్లు స్థానికులు తెలిపారు. -
‘నానో యూరియాతో రైతులకు మేలు’
పిట్లం: రైతులు సాధారణ యూరియా వాడ కాన్ని తగ్గించి నానో యూరియాను వాడితే ఖర్చులు తగ్గుతాయని డీఏవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పిట్లంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా లభ్యత, పంపిణీ వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు సురేష్, వీణ పాల్గొన్నారు.‘పంచసూత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’కామారెడ్డి అర్బన్: రాష్ట్రీయ సేవక్ సంఘ్ పంచసూత్రాలైన పర్యావరణం, సామాజిక సామరస్యం, స్వబోధ, పౌరమర్యాదలు, కుటుంబ జ్ఞానోదయం అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆడిటోరియంలో సంఘ్ విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్‌చాలక్ బొడ్డు శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ సామాజిక అంశాలపై మాట్లాడారు. జిల్లాలోని ప్రతిగ్రామంలో శాఖలు ప్రారంభించి బలోపేతం చేయా లని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ కొమిరెడ్డి స్వామి, నగర కార్యవాహ కొత్తోళ్ల శివరాజ్ తదితరులు పాల్గన్నారు.ఆయకట్టుకు ఢోకా లేదుబాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రెండు పంటలకు ఢోకా లేదని రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేవాదాయ శాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్ట్‌లు నిండటం ఆనందకరమన్నారు. ఎస్సారెస్పీని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి
● రాజ్యాంగాన్ని మార్చే కుట్ర మానుకోవాలి ● ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటోందన్నారు. సమాన అవకాశాలు కల్పించాలని చెబుతున్న రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు పంటలకు గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా లక్షకుపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు ప్రధాని మోదీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడి రహిత సమాజం కోసం సీతారాం ఏచూరి ఎంతగానో కృషి చేశారంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు వెంకట్రాములు, వెంకట్‌గౌడ్, మోతీరాం నాయక్, నర్సింలు, రేణుక, అరుణ్, అజయ్, రవీందర్, సురేష్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రి.. తల్లడిల్లేలా..
కన్నవారిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిని పట్టించుకోవడం లేదు. ఆస్తులు పంచుకుంటున్న సంతానం.. తనువిచ్చిన తల్లిదండ్రులకు కడుపునిండా అన్నం పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు. తిండికి బదులు ఈసడింపులు మాత్రం వడ్డిస్తున్నారు. తమను కని, గారాబంగా పెంచి, పెద్ద చేసినవారిని కొందరు దిక్కులేనివారిలా వృద్ధాశ్రమంలో వదిలేస్తుండగా, ఇంకొందరు దారుణంగా రోడ్డున పడేస్తున్నారు. దీంతో కన్నవారు తల్లడిల్లుతున్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అమ్మ నవమాసాలు మో సి జన్మనిస్తుంది. నాన్న తన భుజాలపై మోసి పెంచుతాడు. బిడ్డ ఆకలి తీర్చేందుకు తమ ఆకలిని మర చిపోతారు. పిల్లల భవిష్యత్ కోసం తమ కోరికలను త్యజిస్తారు. కష్టాలను తాము మోసి.. బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆరాటపడతారు. పెరిగి పె ద్దయ్యేదాకా కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు..తమకు చేతనైనన్ని రోజులు మన కోసమే కష్టపడతారు. వయసురీత్యా సంక్రమించే వ్యాధుల తో తమ పని కూడా తాము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మేమున్నామనే భరోసా ఇవ్వాల్సిన కొడుకులు, కోడళ్లు.. వారిని భారంగా భావిస్తున్నారు. జీవిత చరమాంకంలో వారి ఆలనాపాలనా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యతల నుంచి చాలా మంది తప్పుకుంటున్నారు. ఇటీవల కామారెడ్డి రైల్వేస్టేషన్ వెనకవైపు ఉన్న షెడ్డు కింద వృద్ధురాలు శకుంతల పడుతున్న ఇబ్బందుల్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి ఆమెను వృద్ధాశ్రమానికి చేర్చారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ‘సాక్షి’ కథనాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. శకుంతల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానీ ఇలా వెలుగులోకి రాని వారందరో ఉన్నారు. కన్నబిడ్డలు కాదనడంతో ఎందరో అభాగ్యులు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. జీవిత చరమాంకంలో మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాల్సిన వారు అందరు ఉన్నా అనాథలుగా బతకాల్సి వస్తోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని ఓ వృద్ధాశ్రమంలో 25 మంది వరకు వృద్ధ మహిళలు ఉంటున్నారు. అలాగే లింగంపేటలోని ఆశ్రమంలో తొమ్మిది మంది ఉంటున్నారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ఓ ఆశ్రమంలో జిల్లాకు చెందిన వృద్ధులు పలువురు ఆశ్రయం పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమంలోనూ ఈ ప్రాంతానికి చెందిన వృద్ధులు ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో చాలా మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాలకు చెందిన పలువురు వృద్ధులు కన్నబిడ్డల ఆదరణ లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నారు. కొందరు ఆత్మాభిమానం చంపుకోలేక ఎక్కడో ఓ చోటు వెదుక్కుని చావు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఇలాంటివారికి ఎందరికో ఆశ్రయమిస్తోంది. గతంలో స్టేషన్ ముందు ఉండే షెడ్డులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆశ్రయం పొందేవారు. మరికొందరు ప్లాట్‌ఫాంలపై గడిపేవారు. స్టేషన్ పునరుద్ధరణ పనులతో అనాథలు, వృద్ధులు పగలు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి దుకాణాలు మూసిన తర్వాత వాటి అరుగులపై సేదతీరుతున్నారు. ఎవరైనా దయతలచి నాలుగు మెతుకులు పెడితే తింటారు. లేదంటే పస్తులుంటారు. వృద్ధుల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలున్నా.. ముసలి తల్లిదండ్రులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని వృద్ధుల సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పుడే జీవిత చరమాంకంలో కాసింత గౌరవప్రదమైన జీవనం దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముసలోళ్లయ్యారని వదిలించుకుంటున్న సంతానం అందరు ఉన్నా అనాథలుగా జీవిస్తున్న పలువురు వృద్ధులు -
కుట్టేస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పారిశుద్ధ్యం అ స్తవ్యస్తంగా మారడంతో దోమలు విజంభిస్తున్నాయి. దోమలు దండయాత్ర చేస్తుండడంతో జనం వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం ప్రపంచ దో మల దినోత్సవం సందర్భంగా కథనం.. జిల్లాలో దోమలు స్వైర విహారం చేస్తున్నా యి. ప్రజలను కుడుతుండడంతో జ్వరాలతో బాధపడుతున్నారు. జిల్లాలో యాభై రోజుల్లో యాభై డెంగీ కేసులు నమోదయ్యాయి. జూలై మాసంలో 26 కేసులు నమోదవగా, ఈనెలలో ఇప్పటివరకు 24 కేసులు రికార్డయ్యాయి. అంటే రోజుకొకటి చొప్పున డెంగీ కేసు నమోదవు తోంది. రికార్డులకెక్కని కేసులు ఎన్నో ఉన్నా యి. టైఫాయిడ్ కేసులు లెక్కలేనన్ని నమోదవు తున్నాయి. ఇంటింటా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చాలామంది టైఫాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. కొందరు డెంగీ లక్షణాలు కనబ డగానే చికిత్సలు పొంది బయటపడుతున్నా.. మరికొందరు ప్లేట్లెట్స్ పడిపోయి ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగితాల మీదే దోమల నివారణ చర్యలు.. దోమల నివారణకు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటోంది. పట్టణాలతో పాటు పల్లెల్లో దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలేవీ క్షేత్ర స్థాయిలో జరగడం లేదు. చాలా చోట్ల ఫాగింగ్ ఊసే లేదు. దీంతో దోమల వ్యా ప్తి ఆగడం లేదు. దోమలు పెరిగినకొద్దీ వ్యాధు ల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారుగా చైతన్యవంతులై దోమల నివారణకు తమ పరిసరాలను ప రిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.విజృంభిస్తున్న దోమలు పెరుగుతున్న వ్యాధులు జిల్లాలో యాభై రోజుల్లో యాభై డెంగీ కేసులు నేడు ప్రపంచ దోమల దినోత్సవం -
నగరంలో ఏటీఎం చోరీకి యత్నం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలోగల ఎస్బీఐ ఏటీఎంను ముగ్గురు దుండగులు చోరీకి యత్నించారు. పోలీసులు రావడంతో మారుతి వ్యాన్‌లో పరారయ్యారు. వివరాలు ఇలా.. చంద్రశేఖర్ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు మంగళవారం వేకువజామున ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి మారుతి వ్యాన్‌లో వచ్చా రు. వారి వెంట తీసుకువచ్చిన గ్యాస్కట్టర్లతో ఏటీఎంను కట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. నగదును ఎత్తుకెళ్లే సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో దుండగులు మారుతి వ్యాన్‌లో పరారైయ్యారు. వ్యాన్ బాసర వైపు వెళ్లడంతో పోలీసులు అన్ని పోలీస్స్టేషన్లను అలర్ట్ చేశారు. దీంతో నిందితులు నవీపేట్ మండలం పాల్దా వద్ద మారుతీవ్యాన్‌ను ఆపి, పారిపోయారు. చుట్టుపక్కల ప్రాంతంలో కొత్తవారు కనబడితే పోలీసులకు స మాచారం అందించాలని గ్రామస్తులకు తెలిపారు. ముంబాయి మెయిన్ బ్రాంచ్‌కు మెసేజ్‌తో ఆలర్ట్ దుండగులు ఏటీఎం చోరీకి యత్నించడంతో ముంబాయిలోని మెయిన్ బ్రాంచ్‌కు మెసేజ్ వెళ్లడంతో అక్కడి సిబ్బంది నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనం ఏటీఎం వద్దకు వెళ్లడంతో నిందితులు పరారయ్యారు. ఏటీఎంను పూర్తిగా ధ్వంసం చేసిన ఎలాంటి నగదు పోలేదని ఎస్సై హరిబాబు తెలిపారు. ఘటన స్థలాన్ని సీపీ పోతరాజు సాయిచైతన్య పరిశీలించారు. క్లూస్ టీం, సీసీఎస్ టీం అధికారులకు కేసు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కు అందిన సమాచారం అప్రమత్తమై, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరారైన దుండగులు -
ట్రయల్ రన్ సక్సెస్
నిజాంసాగర్: ఆరేడ్ గ్రామ పరిసరాల్లో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్లకు మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఒక్కో గేటును 5 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ట్రయల్‌రన్‌ను జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఈఈ సోలోమాన్, ఏఈలు శివప్రసాద్, సాకేత్, వర్క్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ పర్యవేక్షించారు. ఈ 20 గేట్లను ఎత్తడం 36 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అన్ని గేట్లు సక్రమంగా లేవడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తరలివచ్చిన జనం.. నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో ప్రాజెక్టు అందాలను తిలకించడానికి జనం తరలివచ్చారు. ఈ గేట్లను 36 ఏళ్ల తర్వాత ఎత్తడం గమనార్హం. వేలాది మంది పర్యాటకులు తరలిరావడంతో ప్రాజెక్టు జనకళను సంతరించుకుంది. -
డ్రంకెన్ డ్రైవ్‌కు సమాజ సేవ శిక్ష
కామారెడ్డి టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి సామాజిక సేవను శిక్షణ విధించింది కామారెడ్డి కోర్టు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు మంగళవారం కామారెడ్డి కోర్టులో హాజరు పరిచారు. సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ టి.చంద్రశేఖర్ నిందితుడికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించారు. ‘నేను మద్యం సేవించి వాహనం నడిపినందకు కోర్ట్ నాకు ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది. మద్యం సేవించి వాహనం నడుపవద్దు’ అనే ప్లకార్డును ప్రదర్శిస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నిల్చున్నాడు. ఇకపై మద్యం తాగి వాహనం నడపనని అతడు పేర్కొన్నాడు. ఈ వ్యక్తిని చూసైనా మద్యం తాగి వాహనాలు నడిపేవారిలో మార్పు వస్తుందేమో.వినూత్న శిక్ష విధించిన కామారెడ్డి కోర్ట్ -
‘పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం’
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. గేట్ల నిర్వహణ, వరద నీటి మళ్లింపు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోల వివరాలను జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. గోల్ బంగ్లా వద్ద పర్యాటక అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ముంపు గ్రామాలతో పాటు పురాతన ఇళ్లలో నివసిస్తున్నవారు పునరావాస కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. వారి వెంట మండల ప్రత్యేకాధికారి రమాదేవి, ఈఈ సోలోమాన్, తహసీల్దార్ భిక్షపతి, ఏఈలు శివప్రసాద్, సాకేత్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై శివకుమార్ తదితరులున్నారు. -
‘యూరియా కొరత రాకుండా చూడండి’
నిజాంసాగర్: యూరియా కొరత రాకుండా వ్యవసాయశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం నర్సింగ్‌రావ్‌పల్లి చౌరస్తా వద్దనున్న అచ్చంపేట సొసైటీ గోదామును ఆయన తనిఖీ చేశారు. నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే యూరియా విక్రయించాలన్నారు. రైతుల ముసుగులో యూరియా బస్తాలను ప్రైవేట్‌కు తరలిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఏవో మోహన్‌రెడ్డి, ఏవో అమర్‌ప్రసాద్, సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, సీఈవో సంగమేశ్వర్ గౌడ్ తదితరులున్నారు. కామారెడ్డి టౌన్: నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన అదనపు తరగతుల నిర్మాణం అసంపూర్తి ఉంది. దీంతో 105 మంది విద్యార్థులు ఆరు బయట చదువుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. విద్యార్థుల అవసరం దృష్ట్యా కనీసం రెండు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయడానికి రూ. 4 లక్షల నిధులు మంజూరు చేశారు. పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలని డీఈవో రాజును ఆదేశించారు. -
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన ఘటన దుర్కి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు(28) సోమవారం ఉదయం నస్రూల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని మాంధారి చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. భారీ వర్షాల ధాటికి అలుగు 765డీ మీదుగా పారుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అలుగు కోసం మొరం కింద నుంచి పైపులు వేశారు. వరద ఉధృతికి మొరం కొట్టుకుపోయింది. రహదారి ఎగువ భాగాన దిగిన రాజు నీట మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోడుగా వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు గజ ఈతగాళ్లతో గాలించగా పైపులైన్లో మృతదేహం లభించింది. కాగా, రహదారి పనులు నెమ్మదిగా జరగడంతోనే రాజు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది. అదుపు తప్పిన స్కూటీ... నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద స్కూటీ అదుపు తప్పి ఓ యువతి సైడ్ డ్రెయిన్‌లో పడిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న తాత్కాలిక మట్టిదారి పూర్తిగా కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం డ్రెయిన్ దాటుతుండగా యువతి స్కూటీతో సహా అందులో పడిపోయింది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలు గమనించి ఆమె పైన ఉన్న వాహనాన్ని తీసి కాపాడారు. నిజామాబాద్‌నాగారం: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు మయాంక్ తేజ్, శీతల్ ఎంపికై నట్లు కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో మయాంక్ తేజ్, శీతల్ పాల్గొననున్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేశ్ పవార్, ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ● ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఏర్పాటు ● రూ.45 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు రెండు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ మండల కేంద్రంతోపాటు బాన్సువాడ పరిధిలోని వర్నిలో రూ.45 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతులతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.దాన కిశోర్ విడుదల చేశారు. కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల విభాగంతోపాటు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో 46 ఏటీసీల ఏర్పాటుకు ఉత్తర్వులు అయ్యాయి. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండు కేంద్రాలు మంజూరు కావడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ ఏటీసీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఏ వాహనానికి ఏ నెంబర్ ప్లేట్
మీకు తెలుసా? ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉంటుంది. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని తిప్పుతూ పోలీసులకు పట్టుబడితే జరిమానా వేస్తారు. వాహనాలకు వివిధ రంగుల్లో నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. అసలు ఏ రంగు నెంబర్ ప్లేట్ ఏ వాహనాలకు కేటాయిస్తారో తెలుసుకుందాం. తెలుపు రంగు: ఈ నంబర్ ప్లేట్ వ్యక్తిగత వాహనాలకు ఇస్తారు. ఈ ప్లేటు కలిగిన వాహనాలను కమర్షియల్‌గా ఉపయోగించరాదు. పసుపు రంగు : ట్యాక్సీలు, ఆటోలు వంటి ప్రయాణికులను తరలించే వాహనాలకు ఈ నంబర్ ప్లేట్‌ను వాడతారు. ఆకుపచ్చ : ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రంగు ఉన్న నంబరు ప్లేట్లను ఏర్పాటు చేస్తారు. ఎరుపు : ఈ రంగు నంబర్ ప్లేట్లు రాష్ట్రపతి, గవర్నర్ వాహనాలకు మాత్రమే కనిపిస్తాయి. మధ్యలో జాతీయచిహ్నం ఉంటుంది. నలుపు : విలాసవంతమైన హోటళ్లలకు చెందిన వారి వాహనాలకు ఉపయోగిస్తారు. నీలం రంగు : విదేశీ దౌత్యవేత్తలు ఉపయోగించే వాహనాలకు ఈ రంగు నంబర్ ప్లేట్లు ఉంటాయి. బాణం గుర్తు : ఈ నెంబర్ ప్లేట్లు సైనిక అవసరాలకు ఉపయోగిస్తారు. ఇవి రక్షణ శాఖకు రిజిస్టేషన్ అయి ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లలో ఫస్ట్ లేదా రెండో అక్షరం తర్వాత బాణం గుర్తు ఉంటుంది. బాణం గుర్తు అనంతరం వచ్చే సంఖ్య వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత బేస్ కోడ్, సీరియల్ నంబరు, చివరిది వెహికల్ క్లాస్‌ను వివరిస్తుంది. భారతదేశం సిరీస్ : నెంబర్ ప్లేట్‌పై బీహెచ్ అని ఉంటే ఆ వాహనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదిగా గుర్తించవచ్చు. నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ సీఎంసీలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగులు ఈ నెంబర్ ప్లేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నంబర్ ప్లేట్ లేకుంటే : వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తే వారిపై సెక్షన్ 171 కింద ఆర్టీఏ, ట్రాఫిక్, పోలీసులు చర్యలు తీసుకుంటారు. మొదటిసారి పట్టుబడితే రూ.200, రెండోసారికి రూ.500 జరిమానా విధిస్తారు. మూడోసారి చిక్కితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. – ఖలీల్‌వాడి -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు వచ్చాయి. భూ సంబంధిత రెవెన్యూ ఫిర్యాదులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారునికి తెలియపర్చాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అండగా బీకేఎస్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఉంటుందని సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నగేష్ పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటలో గల శ్రీ కోదండ రామాలయం కల్యాణ మండపంలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో రైతులందరూ సంఘటితం కావాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో సంఘంలోని ప్రతి సభ్యుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సంఘ్ ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్‌రావు, రాష్ట్ర కోశాధికారి మాణిక్య రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల శంకర్రావు, నాగిరెడ్డిపేట మండలాధ్యక్షుడు కాంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణురావు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన
కామారెడ్డి క్రైం: తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యావాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకే అదనంగా ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్‌తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడాల్సింది పోయి అమలుకు పూనుకుంటోందని విమర్శించారు. అంగన్వాడీ సేవలకు తప్పనిసరి చేసిన ఎఫ్ఆర్ఎస్(ఫేస్ క్యాప్చర్ సిస్టం) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్లు, ట్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు ఇవ్వాలని కోరారు. జిల్లా అధికారులు వచ్చి తమ సమస్యలు వినాలని అంగన్వాడీలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని సముదాయించారు. చివరకు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల అక్కడకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. దీంతో అంగన్వాడీలు వెనుదిరిగారు. సీఐటీయూ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, నర్సింలు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల లేమి
పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇళ్లు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వం మండల కేంద్రంలో సుమారు 1 కోటి 25 లక్షల రూపాయిలతో 25 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సరైన స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా ఇళ్ల చుట్టూ వర్షపు నీరు నిలుస్తున్నాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేదు. ఇప్పటికీ ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతూ ఆ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. డ్రెయినేజీకి కనెక్షన్ ఇవ్వని వైనం.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినప్పటికి డ్రెయినేజీ కనెక్షన్ లేకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువైపోయాయి. అదేవిధంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే నీరు ఇంటి ముందే నిలవడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నీటి గుంతలతో పాటు పిచ్చి మొక్కలతో నిండిన ఖాళీ స్థలం ఉండడంతో ప్రతిరోజు రాత్రి పూట ఇళ్లలోకి పాములు, విష పురుగులు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో పూర్తి సౌకర్యాలు కల్పించి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పాములు, విష పురుగులు ఇళ్లలోకి వచ్చి చేరడంతో ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నాం. రాత్రి పూట బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లలో పూర్తి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. – మంగళి రాజమణి, పెద్దకొడప్గల్ డబుల్ బెడ్ రూం కాలనీవాసి సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేకపోవడంతో ఇళ్ల ముందు మురుగు నీరు నిలవడంతోపాటు వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. మురుగు నీరు ఇళ్ల చుట్టూ నిల్వ ఉండడంతో దుర్వాసన భరించలేకున్నాం. దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. – గడ్డం రాజు, డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసి సమస్యల వలయంలో పెద్దకొడప్గల్ డబుల్ బెడ్ రూం కాలనీ ఇళ్లు సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేక ఇళ్ల ముందే నిలిచిన మురుగు నీరు పట్టించుకోని అధికార యంత్రాంగం -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
నస్రుల్లాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన జల్ల నర్సింలు(52) కామిశెట్టిపల్లిలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని జాతీయ రహదారి 765డీ పై సైకిల్ నడుపుతూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలుపగా నర్సింలును బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే నర్సింలు మరణించినట్లు నిర్ధారించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కుంటలో పడి ఒకరు.. నవీపేట: మండలంలోని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన బోడాసు ఎల్ల య్య (50) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందినట్లు ఎస్సై తి రుపతి సోమవారం తెలిపారు. చెరువులోని పూలను అమ్ముకొని జీవనం సాగించే ఎల్లయ్య ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సో మవారం ఉదయం ఫకీరాబాద్ సమీపంలోని కుంటలో ఎల్లయ్య మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వర్ని: మండలంలోని హుమ్నాపూర్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. డీకొండ శ్యామల ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పరుపు కింద దాచిన రూ.10 వేలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, ఇంటిని కూల్చిన కేసులో ఆరుగురికి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి టీ శ్రీనివాస్ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలం రామన్నపేట్ గ్రామానికి చెందిన పత్రి పోశన్న తన చిన్నమ్మ, చిన్న నాన్నలకు పిల్లలు లేకపోవడంతో వృద్ధాప్యంలో సేవలు చేశాడు. దీంతో వారు తమ తదనంతరం ఇంటిని పోశన్నకు ఇచ్చారు. ఐతే, ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని విజయ అనే మహిళ పోశన్న కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుంది. రావుట్ల గ్రామానికి చెందిన బాజిరెడ్డి రమాకాంత్, పిప్రి గ్రామానికి చెందిన అరిగెల జనా ర్దన్, కొంపల్లి మల్లేశ్, భీమ్‌గల్ గ్రామానికి చెందిన గంగాధర్, రాధ, రామన్నపేట్కి చెందిన విజయలు 2015 జూన్ 19న పొక్లెయిన్‌తో పోశన్న ఇంటిన కూల్చి వేసి, కులం పేరుతో దూషించారు. దీంతో పోశన్న కుటుంబసభ్యులు మోర్తాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు పంపారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు రమాకాంత్, జనార్దన్, మల్లేశ్‌లకు రూ.ఐదు వేల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఎస్సీలైన గంగాధర్, విజయ, రాధలకు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బంటు వసంత్ వాదించారు. ఖలీల్‌వాడి: నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్‌ను సీసీఎస్‌లో కలిపినట్లు పోలీస్‌వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో పేకాట, రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, మొరం దందాలు, మట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు చేసేది. ఐతే, ఈ విభాగాన్ని సీసీఎస్ చూడనున్నట్లు తెలిసింది. సీఐ, ఎస్సై, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు పనిచేసే టాస్క్‌ఫోర్స్‌కు సరైన సమాచారం రావడం లేద నే ఉద్దేశంతో తాత్కాలికంగా తీసివేసినట్లు సమాచారం. గతంలో సీపీగా కల్మేశ్వర్ ఉన్న సమయంలో సిబ్బందిపై ఆరోపణలు రావడంతో వారిపై బది లీ వేటు వేశారు. కొన్ని నెలలపాటు టాస్క్‌ఫోర్స్ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. సీపీగా పోతరాజు సాయిచైతన్య వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌కు సిబ్బందిని కేటాయించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ మళ్లీ ప్రారంభమైంది. కాగా, టాస్క్‌ఫోర్స్ చేసే పనులను ప్రస్తుతం సీసీఎస్ ద్వారా చేయనున్నట్లు తెలుస్తోంది. -
మానవత్వం చాటారు
వృద్ధురాలు శకుంతలతో మాట్లాడుతున్న సీఐ నరహరివృద్ధురాలికి తినిపిస్తున్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియకామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ షెడ్డులో కొన్ని రోజులుగా వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఉంటున్న వృద్ధురాలి దీన స్థితిపై ‘సాక్షి’ దినపత్రిక మెయిన్‌పేజీలో సోమవారం ‘అనాథగా అమ్మ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కథనాన్ని చదివి ఏఎస్పీ చైతన్యారెడ్డి చలించిపోయారు. ఆ వృద్ధురాలికి అన్ని విధాలుగా సహాయం చేసి, పూర్తి వివరాలు సేకరించాలని పట్టణ సీఐ నరహరిని ఆదేశించారు. దీంతో సీఐ నరహరి సోమవారం ఉదయం వృద్ధురాలు శంకుతల ఉన్న చోటికి వెళ్లి వివరాలను సేకరించి ఏఎస్పీకి తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సైతం సాక్షి కథనానికి స్పందించి మానవత్వం చాటారు. వృద్ధురాలి వద్దకు వెళ్లి స్వయంగా భోజనం తినిపించారు. దుస్తులు ధరింపజేసి, దుప్పటి అందజేశారు. పోలీసులతో కలిసి ఆటోలో వృద్ధురాలిని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. వృద్ధురాలి దీనస్థితిపై కథనం రాసిన ‘సాక్షి’కి ఏఎస్పీ, పట్టణ సీఐ, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌తోపాటు పలువురు అభినందనలు తెలిపారు. ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి ‘అనాథగా అమ్మ’ వివరాలు సేకరించాలని సీఐకి ఆదేశం ఆస్పత్రికి తరలించి వైద్యమందేలా చేసిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ -
నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
బిచ్కుంద: నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శెట్లూర్ గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న మంజీర నదిలో సోమవారం గుండెకల్లూర్ గ్రామానికి చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 657 గొర్రెలు, శెట్లూర్కు చెందిన ఒక రైతులో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలపడంతో వారు అధికారులు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు సమాచారం అందించారు. దీంతో డిచ్పల్లినుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సహాయక బృందాలను రపించి సహాయక చర్యలు చేపట్టారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విఠల్‌రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్ తదితరులు తెల్లవారుజామున 5 గంటలకు శెట్లూర్ మంజీర నది వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ బృందం ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టి 657 జీవాలను, నలుగురు వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. సాయిగొండ, యాదుగొండ, సాయిగొండ, రైతు చాకలి సాయిలులను బోట్లో ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు. రెండు బోట్ల సహాయంతో ఒక్కో బోటులో 25 నుంచి 30 గొర్రెల చొప్పున తీసుకువచ్చారు. అధికారులను అభినందించిన ఎమ్మెల్యే కాపరులు, గొర్రెలు చిక్కుకున్న ప్రదేశానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బోట్లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విఠల్‌రెడ్డితోపాటు ఇతర అధికారులు, రెస్క్యూ టీంను అభినందించారు. పశువైద్యులను పిలిపించి, గొర్రెలకు వైద్య పరీక్షలు చేయించారు. సహాయక చర్యలలో సహకారం అందించిన యువకులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి అందించారు. నలుగురు వ్యక్తులు, 657 గొర్రెలను కాపాడిన రెస్క్యూ టీం సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, సబ్ కలెక్టర్ కిరణ్మయి -
మళ్లీ కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్
నిజాంసాగర్: సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మళ్లీ కొట్టుకుపోయింది. దీంతో నీరంతా వృథా అవుతోంది. గతేడాది కురిసిన భారీ వర్షాలవల్ల వరదనీరు పోటెత్తడంతో సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ (అడ్డుగోడ) కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరద నీటిని కాపాడేందుకు తాత్కాలికంగా ఇసుక బస్తాలను అడ్డుగా వేసి మట్టి కట్టలు వేశారు. దీనికి రూ. 8.4 లక్షలు వెచ్చించారు. అయితే శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక మరోసారి రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయింది. సుమారు 14 మీటర్ల మేర అడ్డుగోడ కొట్టుకుపోవడంతో పాటు 10 మీటర్ల మేర రిటెయినింగ్ వాల్ శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్ధంగా ఉంది.గతేడాది కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్‌కు అ ప్పట్లో రూ. 8.4 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారు లు వాల్ నిర్మాణం కోసం రూ. 1.8 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు నిధులు మంజూరు చేయలేదు. భారీ వర్షాలు కురిస్తే మళ్లీ రిటెయినింగ్వాల్ కొట్టుకుపోయే అవకాశాలున్నాయని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అయినా పాలకులు శ్రద్ధ వహించకపోవడంతో మరోసారి కొట్టుకుపోయింది. దీంతో నీరు వృథాగా పోతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఖాళీ అవుతున్న సింగితం నీరు! -
‘నానో యూరియా ఎంతో ప్రయోజనకరం’
కామారెడ్డి క్రైం: యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించాలని, ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 500 మిల్లీలీటర్ల నానో యూరియా 45 కిలోల యూరియా బస్తాకు సమానమని, ధర కూడా తక్కు వని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయన్నారు. డ్రోన్ సహాయంతో సులభంగా పిచి కారి చేయవచ్చన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సొసైటీ ల ముందు క్యూలు ఉండకుండా గ్రామాల వారీగా తేదీలను కేటాయించి యూరియా సరఫరా చేయాలన్నారు. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా పరిశ్రమలు, వస్తు తయారీ ఇండస్ట్రీలలో తనిఖీలు చేయాలన్నారు. ఆయన వెంట డీఏవో మోహన్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు ఉన్నారు. -
ఆర్ట్స్ కళాశాలలో బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో సోమవారం బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త శ్రీవల్లి మాట్లాడుతూ సహజ సిద్ధంగా లభించే కలబంద, పసుపు, తేనె, నిమ్మరసం లాంటి పదార్థాలను ఉపయోగించి అందం పెంపొందించే విధానాలను తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు దినకర్, మానస తదితరులు పాల్గొన్నారు. ‘రైతులు డ్రోన్ సేవలు వినియోగించుకోవాలి’ కామారెడ్డి అర్బన్: పంటలపై పురుగు మందుల పిచికారి కోసం రైతులు డ్రోన్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. డ్రోన్‌తో పురుగు మందుల పిచికారి ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు డ్రోన్లకోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. 22న కలెక్టరేట్లో జాబ్‌మేళా కామారెడ్డి అర్బన్: మెదక్ ఐటీసీ ఫుడ్ డివిజన్లో 20 మిషన్ అపరేటర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ లేదా ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 29 ఏళ్లలోపువారు ఈనెల 22న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 87907 37320, 76719 74009 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ‘న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా’ కామారెడ్డి టౌన్ : న్యాయవాదుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి లీగల్ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్‌గౌడ్ న్యాయవాదుల సమస్యలను అశోక్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కై లాస్ శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ సోషల్ మీడియా ఇన్చార్జి ముబిన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, లీగల్ సెల్ ప్రతినిధులు ఉమాశంకర్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంగోపాల్‌రావు, నర్సింహారెడ్డి, సిద్ద్దరాములు, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన వరద.. అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్: నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులలోకి ఆదివారం అర్ధరాత్రి వేళ వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే గేట్లను ఎత్తారు. దీంతో ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలనుంచి బయటపడ్డాయి. రాత్రి 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 7 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదిలారు. 2022 తర్వాత ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి. కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. ఎగువ ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 15 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,402.75 అడుగుల (14.654 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. భారీ వర్షంలోనూ.. నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులలోకి అర్ధరాత్రి వేళ భారీగా వరద నీరు రావడంతో అధికారులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు వెంటనే స్పందించారు. వెంటనే ఆయా ప్రాజెక్టులను సందర్శించి అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప రిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వరద గేట్ల ను ఎత్తడానికి అధికారులకు సహాయం చేశారు. -
36 ఏళ్ల తర్వాత..
నేడు నిజాంసాగర్ 20 గేట్లకు ట్రయల్‌రన్ నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ముప్పై ఆరేళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు చివరన ఉన్న 20 గేట్లను ఎత్తనున్నారు. మంగళవారం ఈ గేట్లను ఎత్తి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రాజెక్టుకు మూడు చోట్ల కలిపి 48 గేట్లున్నాయి. నిజాంసాగర్‌కు ఒకవైపు 12, మధ్యలో16, ఇంకోవైపు 20 గేట్లున్నాయి. సాధారణంగా మధ్య లో ఉన్న 16 గేట్లను, అవసరానుగుణంగా ఒకవైపు ఉన్న 12 గేట్లను ఎత్తుతుంటారు. 20 గేట్ల ను భారీ ఇన్‌ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఎత్తు తారు. 1988 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రా జెక్టుకు 3 లక్షల క్యూసెక్కులు, 1989 సంవత్సరంలో 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో ఈ 20 గేట్లను ఎత్తి నీటిని మంజీర నదిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం భారీ వరద వస్తుండడంతో డ్యాం సేఫ్టీ దృష్ట్యా ఈ 20 గేట్ల ను ఎత్తాలని నిర్ణయించారు. ఒక్కో గేటును 5 ఫీట్ల మేర లేపి, నీటిని దిగువకు వదులుతూ ట్ర యల్ రన్ నిర్వహిస్తామని నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. నిపుణుల బృందం గేట్ల పనితీరును పరిశీలిస్తుందన్నారు. నీటి విడుదల నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతంలో బోర్లు, పైపులైన్లు, కరెంట్ వైర్లు కలిగి ఉన్న రైతులు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. -
గ్రంథాలయాల సేవలను మెరుగుపర్చేందుకు కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డిబోధన్: జిల్లాలో గ్రంథాలయ శాఖలను పటిష్టం చేసి పాఠకులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే గ్రంథాలయ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూర మండల కేంద్రంలో నూతనంగా గ్రంథాలయ శాఖ ఏర్పాటు కోసం కొత్త భవన నిర్మాణానికి గ్రామస్తులు ఎంపిక చేసిన స్థలాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్, గ్రామపెద్దలతో కలిసి పరిశీలించారు. కొత్త భవనం నిర్మాణం అయ్యే వరకు సహకార సంఘం కోసం ఇటీవల కొత్తగా నిర్మించిన రెండు గదుల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయనను గ్రామపెద్దలు సన్మానించారు. విశ్రాంత హెచ్ఎం ఇల్తెపు శంకర్, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సొసైటీ సీఈవో బస్వంత్‌రావు పటేల్, గ్రామ పెద్దలు కేజీ గంగారాం, లక్ష్మణ్ గౌడ్, కన్నె రమేశ్, సొక్కం రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయ మార్గాలపై దృష్టి
బాన్సువాడ: మున్సిపల్ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 10,122 గృహాలు.. 1,223 కమర్షియల్, వాణిజ్య, వ్యాపార దుకాణాలున్నాయి. కొంతకాలంగా పట్టణంలో గృహ నిర్మాణం పేరిట వాణిజ్య సముదాయాలు నడుపుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో పట్టణాన్ని మూడు డివిజన్లుగా విభజించి ఇంటి పన్నులు విధించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రతి ఇంటిని భువన్ సర్వే చేసి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. పాత ఇంటి పన్నుల ఆధారంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇంటి పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఆదాయం ఏరియర్స్‌తో కలుపుకొని రూ.4.50 కోట్లు కాగా దాన్ని మరింత పెంచుకునే మార్గాలను మున్సిపల్ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రతీ ఏటా రివిజన్ నిర్వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణం పేరిట వాణిజ్యం.. పట్టణంలోని మెయిన్ రోడ్డు, పాత బాన్సువాడ రోడ్డు, బీసీ హాస్టల్ రోడ్డు, తాడ్కోల్ చౌరస్తా నుంచి తాడ్కోల్ వరకు, పాత అంగడి బజారు, కొత్త అంగడి బజారు, టీచర్స్ కాలనీ, గాంధీ చౌక్ రోడ్డు, జెండా గల్లీ తదితర రోడ్లలో కమర్షియల్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని అందులో వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్‌కు గృహ నిర్మాణ పన్నులు మాత్రమే చెల్లిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌కు గృహ నిర్మాణ అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. పన్నులు మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఆదాయానికి గండిపడుతోంది.పై అధికారుల ఆదేశాల మేరకే రివిజన్ నిర్వహిస్తున్నాం. పాత ఇంటి పన్నులకు కొత్తగా పన్నులు పెంచడం లేదు. అక్రమ నిర్మాణాలు, అనుమతులు తీసుకోని వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్న వారికి పెనాల్టీ వేస్తున్నాం. పన్నులు అధికంగా వేశారని అనుకుంటే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ రివ్యూ చేస్తాం. – శ్రీహరి రాజు, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ అనుమతులు గృహాలకు.. నడుస్తున్నది కమర్షియల్ గ్రౌండ్ ఫ్లోర్‌కే పన్ను చెల్లింపులు.. పైఅంతస్తులకు ఎగవేత అక్రమ నిర్మాణాలకే పెనాల్టీ అంటున్న అధికారులు -
నూత్‌పల్లిలో స్వయంభూ శివలింగం
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల చెల్లింపులు ఇలా..సమాచారంఖలీల్వాడి: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు లక్షల నిధులు అందిస్తుంది. దీనిని నాలుగు విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించే స్థలంలో ముగ్గు పోయగానే సంబంధిత అధికారులు కొలతలు వేసి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇంటి యాప్‌లో ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా నిధులు మంజూరవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. మొదటి విడత ఇంటి బేస్మెంట్ నిర్మాణం పూర్తికాగానే మున్సిపల్ వార్డు ఆఫీసర్, గ్రామ పంచాయతీ స్థాయిలో సెక్రెటరీ ఇంటి వద్దకు వచ్చి పరిశీలన చేసి ఫొటో తీసుకుంటారు. దానిని సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తే మండల ఏఈకి వెళ్తుంది. దీనిని ఏఈ నుంచి డీఈకి లాగిన్ అవుతుంది. డీఈ నుంచి పీడీకి చేరుతుంది. పీడీ కలెక్టర్ లాగిన్‌కు పంపిస్తారు. కలెక్టర్ పంపిన వివరాలు అన్ని పరిశీలించిన రూ. లక్ష నగదును లబ్ధిదారుని ఖాతాల్లో జమ చేస్తారు. రెండో విడత రెండో విడతలో మరో రూ. లక్ష మంజూరువుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే స్లాబు వేసేంత ఎత్తు గోడలు నిర్మించాల్సి ఉంటుంది. మూడో విడత మూడో విడతలో మరో రూ. రెండు లక్షలు నిధులు మంజూరు అవుతాయి. దీని కోసం ఇంటి పైకప్పు సిమెంట్ స్లాబ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అధికారులు ఇంటిని పరిశీలించి ఫొటోలను సంబంధిత యాప్‌లో అప్లోడ్ చేస్తారు. నాలుగో విడత ఇక నాలుగో విడతలో రూ. లక్ష మంజూరవుతుంది. ఈ నిధులు మంజూరు కావాలంటే ఇంటికి ప్లా స్టరింగ్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటికి రంగులు వేసి ఉండాలి. అధికారులు అన్ని పనులు పూ ర్తయ్యాయా లేదా అని పరిశీలించి ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత రూ. లక్ష నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి.మీకు తెలుసా? డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని నూత్‌పల్లిలో స్వ యంభూ లింగ క్షేత్రం ప్రత్యేక చరిత్రను సంతరించుకుంది.ఈ ఆలయంలోని శివలింగం పశువుల పేడ కింద వెలిసినట్లు,గుడిలోని నంది ఎగి రి వచ్చినట్లుగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి ఆనుకున్న ఉన్న ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని 150 ఏళ్ల క్రితమే రాతితో నిర్మించారు. వందల ఏళ్ల క్రితం చంద్రయ్య మహారాజ్ అమ్మమ్మ ఒకనాడు పిడకల కోసం పశువులు ఉండే ఊరి కొండ ప్రాంతానికి వెళ్లింది. ఆమె పేడను తీసే క్రమంలో శివలింగం బయటపడింది. విషయం తెలుసుకున్న చంద్రయ్య మహారాజ్ ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి గుడిని నిర్మించారు. రాజరాజేశ్వర స్వామిపై చంద్రయ్య భజన, కీర్తనలు రచించి గ్రామగ్రామాన సంచరించి భక్తి ప్రచారం చేసి, శివుడిలో ఐక్యమైనట్లు స్థలం పురాణం ఉంది. ఆయన సమాధి కూడా గుడికి కొద్ది దూరంలో ఉంది. చంద్రయ్య మహారాజ్ ఓ దొరగారింట్లో భక్తి, కీర్తనలు చేశారు. విని తరించిన దొర కానుకగా ఏమివ్వాలని చంద్రయ్యను అడిగారట. దొర ఇంట్లో ఉన్న నంది విగ్రహం కావాలని కోరారట. చంద్రయ్య నందిపై మంత్రపుష్పాలు వేయగానే దానికి చలనం వచ్చి ఐదు మూరలు రంకెలు కొట్టి నూత్పల్లి శివాలయానికి ఎగిరి వచ్చినట్లు స్థల పురాణం. ప్రస్తుతమున్న నూత్పల్లి గ్రామానికి పురా తన ఆలయం ఐదు కిలో మీటర్ల దూరంలో ఉండగా, దీనిని ప్రతీకగా గ్రామంలోనే మరొక కొత్త గుడిని నిర్మించి అక్కడే ప్రతి ఏటా అక్టోబర్‌లో జాతర నిర్వహిస్తారు. -
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ప్రత్యేక కోచింగ్ సెంటర్ త్వరలో ప్రారంభమవుతుందని యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆదివారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారి కోసం అనలాగ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తుందన్నారు. నిరుద్యోగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనివర్సిటీ విద్యార్థులు రాము, సచిన్, శివరాం, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మోర్తాడ్/ నిజామాబాద్ అర్బన్: మోర్తాడ్ ఉన్నత పాఠశాలలో 1980–81కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 45 ఏళ్ల తర్వాత నాటి మిత్రులందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీముక్క అయోధ్యరామ్ విద్యానికేతన్‌కు చెందిన 1995–96 పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి గురువులను ఘనంగా సన్మానించారు. పాఠశాల వ్యవస్థాపకుడు ముక్త దేవేందర్ గుప్తా, ఉపాధ్యాయులు సందీప్ కులకర్ణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్సులో ప్రసవం
పెర్కిట్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన రవిత ఆదివారం 108 అంబులెన్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మచ్చర్లకు చెందిన రవిత ఆదివారం కాన్పు నొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శిశువుకు జన్మనిచ్చింది. అంబులెన్సు సిబ్బంది ప్రథమ చికిత్సలు అందించి దేగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంబులెన్సు సిబ్బంది రమేశ్, శాంత, ఆశా వర్కర్ పుష్పకు కృతజ్ఞతలు తెలిపారు. కిటికీ ఊచలు తీసి దొంగతనం ఖలీల్‌వాడి: నగరంలోని మహాలక్ష్మి కాలనీ నాగటవర్స్లో ఉంటున్న బేవసాని విఠల్ ఇంట్లో దుండగులు కిటికీల ఊచలు తీసి దొంగతనం చేసినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. విఠల్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని రాత్రి రెండు గంటల ప్రాంతంలో గదిలో నిద్రపోయారు. దుండగులు పక్క రూమ్‌లో ఉన్న కిటీకల ఊచలు తొలగించి లోపలికి ప్రవేశించారు. ముందుగా కుటుంబ సభ్యులు పడుకున్న రూమ్‌కు గొళ్లెం పెట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.12 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగతనం చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పాలు పోసే అతను రావడంతో విషయం గమనించి డోరు తీశారు. విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పైపు లైన్‌కు లీకేజీలు.. వృథాగా నీరు.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పో చంపాడ్కాలనీకి నీటిని సరఫరా చేసే పైపు లైన్ కు లీకేజీలు ఏర్పడటంతో నీరు వృథాగా పో తుంది. లీకేజీల గురించి పట్టించుకోకుండా నీ టిని అలానే సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రాజెక్ట్ నిర్మా ణ కాలంలో ప్రాజెక్ట్ నుంచి సిమెంట్ పైపులు వేశారు. ప్రస్తుతం ఆ పైపులకు లీకేజీలు ఏర్పడ్డాయి. వర్షకాలం కావడంతో తాగునీరు కలుషితమవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
● ఇళ్ల మధ్య పొదలతో ఇబ్బందులు ● నిలుస్తోన్న వర్షపు నీరు ● సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశందోమకొండ: మండలకేంద్రంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. దీంతో వర్షపు నీరు నిలిచి చుట్టూ పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలాల్లో, గ్రామాల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. స్థలాలను కొనుగొలు చేసిన యజమానులు వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా వదిలేయగా, పిచ్చిమొక్కలు పెరిగి విషపురుగులకు ఆవాసాలుగా మారుతున్నాయి. కొత్తగా మండల కేంద్రాలతో పాటు, జిల్లా కేంద్రం ఏర్పడగా చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంచారు. దీంతో చుట్టుపక్కల ఇళ్ల వారు చెత్త చెదారం అక్కడే వేస్తున్నారు. విష పురుగులు, కీటకాల సంచారం.. జనావాసాల మధ్య ఖాళీ స్థలాలు ఉండటంతో వాటిని ఆనుకుని ఉన్న ఇళ్లలోకి విష పురుగులు, కీటకాలు వస్తున్నాయి. చెట్లు ఏపుగా పెరిగి, వాననీటికి తడిసి చిత్తడిగా మారుతున్నాయి. పాములు, తేళ్లు, విష కీటకాల కాటుకు గురువుతున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు మురికి కాలువను సైతం తీయడం లేదని, మురికి నీరుతో దుర్గంథం వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దోమకొండ మండల కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరించినా మురికి కాలువలు నిర్మించలేదు. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి రాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండగా, వర్షాకాలం మొక్కలు పెరిగి విష పురుగులు వస్తున్నాయని మండల కేంద్రానికి చెందిన పలువురు మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో వెంటనే పంచాయితీ అధికారులకు సూచనలు చేశాం. సీజనల్ వ్యాధులు కూడా ప్రజలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాకు సమాచారం ఇవ్వాలి. – ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, దోమకొండ -
మూడు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
ఇందల్వాయి: మండలంలోని పలు గ్రామాల్లో దుండగులు శనివారం రాత్రి మూడు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. నల్లవెల్లి శివారులో గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి, గన్నారం గ్రామానికి చెందిన సామల రాజేశ్, మెగ్యానాయక్ తండాకు చెందిన లంబాని రెడ్య అనే రైతులకు చెందిన మూడు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి లైన్‌మన్ నవీన్‌కి సమాచారం అందించారు. లైన్‌మన్ పంచనామా నిర్వహించి జరిగిన నష్టంపై పై అధికారులకు నివేదిక అందించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్దతడ్గూర్లో ఆదివారం పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో నడుచుకుంటు వెళ్తున్న సంజయ్, విఠబాయి, అనిల్, దాదారావు, నారాయణ, గంగాధర్‌లపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు గాయాలపారైన వారిని మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని కనిపించిన వారందరిని గాయపరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నవీపేట: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మునిగి ఒకరు మృతి చెందిన ఘటన నవీపేట మండలం లక్ష్మాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మాపూర్‌కు చెందిన గుడిమెట్ల శంకర్(45) రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చింతల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం శంకర్ మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడి కుమారుడు కార్తిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్‌లో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. మహిళలు, యువకులు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలోయువకులు ఆనందోత్సవాల మధ్య ఉట్టిని కొట్టారు. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. వీడీసీ చైర్మన్ ఏనుగు మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం, రాజిరెడ్డి, ముకేష్‌గౌడ్, రాజయ్య, మల్లేష్, మనోహర్, బాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోపాల్‌పేటలో.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేటలో గోకులాష్టమి వేడుకలను స్వాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణతో ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామప్రధాన కూడళ్లల్లో చిన్నారులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దీంతోపాటు చిన్నారులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. -
ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌కు మాతృవియోగం
సిరికొండ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి రిక్క లక్ష్మమ్మ శనివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. స్వగ్రామం సిరికొండ మండలం రావుట్లలో ఆమె అంత్యక్రియల ను ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల్లో బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు మధుశేఖర్ తదితరులు పాడె మోసి లింబాద్రిని పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల అనంతరం లింబాద్రిని పరామర్శించారు. పంట రక్షణకు పాత చీరలు బాల్కొండ: అడవి పందుల భారీ నుంచి మక్క పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. పాత చీరలను పంట చేనుకు రక్షణ కడుతున్నారు. మార్కెట్లో పాత చీరలను రూ.50 ఒక్కటి కొనుగోలు చేసి చీరలను చుట్టూ కంచె వేసినట్లు కడుతున్నారు. పంట రక్షణ కోసం రైతులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రస్తుత సంవత్సరం మక్క పంటకు అడవి పందుల బెడద తీవ్రంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్కోల్‌లో..సిరికొండ: అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. రాత్రి వేళల్లో మొక్కజొన్న చేనుపై దాడి చేయడానికి వచ్చే అడవి పందులకు బెదురుగా కనబడటానికి చేను చుట్టూ పాత చీరలను రక్షణగా కడుతున్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, న్యావనంది, నర్సింగ్‌పల్లి, చీమన్‌పల్లి, తాళ్లరామడుగు గ్రామాల్లో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. అడవి పందుల నుండి కాపాడుకోవటానికి మొక్కజొన్న చేను చుట్టు పాత చీరలను బెదుర్లుగా వాడుతున్నారు. -
ఆటోమెటిక్ రెయిన్ గేజ్‌ను కప్పేస్తున్న టేకు చెట్లు
కామారెడ్డి అర్బన్: భారత వాతావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పాత తహసీల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ రెయిన్ గేజ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో వర్షపాతం కొలవడానికి పాత పద్ధతులుండగా ప్రస్తుతం మనుషుల అవసరం లేకుండా ఉపగ్రహం ద్వారా ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. కానీ రెయిన్ గేజ్ కేంద్రంపై ఎలాంటి చెట్లు అడ్డుగా ఉండకూడదు. చెట్ల ఆకులు అడ్డుగా ఉంటే సరైన వర్షపాతం నమోదు కాదు. ఆకులపై నీళ్లు నిలిచి ఒకేసారి పడితే వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవ కాశం ఉంటుంది. రెయిన్ గేజ్ కేంద్రానికి గొడు గుగా ఓ వైపున పెద్ద పెద్ద టేకు చెట్లు ఉన్నాయి. కేంద్రంలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయింది. వీటి వల్ల వర్షపాతం తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. జలవనరుల నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ అ ధ్యయనాలకు ఉపయోగపడే నిరంతర డేటాను తప్పుగా చూపితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాగా ఆటోమెటిక్ రెయిన్ గేజ్ కేంద్రం నిర్వహణతో తమకు సంబంధం లేదని, చెట్లు ఉన్నా ఏమీ కాదని మండల గణాంకాధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. -
‘శక్తిమంతమైన దేశంగా చేయడమే సంఘ్ లక్ష్యం’
మద్నూర్: భారత్‌ను శక్తిమంతమైన దేశంగా చేయడమే సంఘ్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క ప్రముఖ్ కోటూరి శ్రీధర్ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను స్థాపించి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో జుక్కల్ ఖండ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్‌ను స్థాపించి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపన ఆవశ్యకత, లక్ష్యం గురించి ప్రజలకు వివరించాలన్నారు. వందేళ్ల ప్రస్థానంలో దేశ సేవకు నిస్వార్థంగా పనిచేసిన స్వయం సేవకులను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కా ర్యవాహ సంతోష్, జుక్కల్ ఖండ కార్యవా హ జుబ్రె సంజు, మద్నూర్, డోంగ్లీ, జుక్కల్ మండలాల స్వయం సేవకులు పాల్గొన్నారు. ‘స్వదేశీ వస్తువులను వినియోగించాలి’ కామారెడ్డి అర్బన్: దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలందరు మద్దతు ఇవ్వాలని, స్వదేశీ వస్తువులనే వినియోగించాలని స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) తెలంగాణ రాష్ట్ర సహ సంయోజక్ అశోక్ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీసర్వసతి విద్యామందిర్ హైస్కూల్లో ఎస్జేఎం జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు, విదేశీ వస్తువులపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. భారత్‌ను వ్యతిరేకించే దేశాల వస్తువులను కొనుగోలు చేయవద్దన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. నాసిరకం చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్జేఎం ఇందూర్ విభాగ్ సహ సంయోజక్ రాజాగౌడ్, తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ రాహుల్‌కుమార్, జిల్లా సంయోజక్ మహేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ఎస్ఈగా జగదీశ్ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్‌గా జగదీశ్ రానున్నారు. కంతనపల్లి ప్రాజెక్ట్ ఈఈగా పని చేస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. ఎస్సారెస్పీ ఇన్చార్జి ఎస్ఈగా ఏడాదిపాటు శ్రీనివాస్‌గుప్తా పని చేశారు. నూతన ఎస్ఈ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని కార్యా లయ వర్గాలు తెలిపాయి. -
వర్షం.. నష్టం
● నీట మునిగిన పంటలు ● ఆందోళనలో రైతులునాగిరెడ్డిపేట : భారీ వర్షాలు, వరదలతో మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదలవడంతోపాటు పోచారం ప్రాజెక్టు అలుగుపై నుంచి దిగువకు పొంగిపొర్లుతున్న వరదనీటితో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా మంజీరనదిలో దట్టంగా పెరిగిన తుమ్మ చెట్ల కారణంగా నీటిప్రవాహ వేగం తగ్గి వరదనీరు మంజీరనది ఒడ్డున ఉన్న పంట పొలాల్లోకి చేరుతోంది. ఫలితంగా మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపేట, వెంకంపల్లి, మాటూర్ తదితర గ్రామాల శివార్లలో వరిపంటలు మంజీరనీటితో ముంపునకు గురయ్యాయి. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి మంపునకు గురవుతున్న పంటలను పరిశీలించారు. నాగిరెడ్డిపేట మండలంలో మంజీరనీటి వల్ల సుమారు 150 ఎకరాలు నీటమునిగాయని ఏవో సాయికిరణ్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయించేందుకు బాన్సువాడ ఎమ్మెల్యేతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడానన్నారు. లింగంపేట మండలంలో.. లింగంపేట: భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరదలతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. లింగంపేట మండలంలోని పర్మళ్ల, శెట్పల్లిసంగారెడ్డి, మోతె, సురాయిపల్లి, అయిలాపూర్ తదితర గ్రామాలలో రైతులు టమాట, బీర, కాకర, పచ్చిమిర్చి, బెండకాయ, చిక్కుడు, ఆకుకూరలు, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల వల్ల పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గుంతల దారి..
కల్కినగర్ రోడ్‌నంబర్–4 లో గుంతలుభవానీనగర్లో రోడ్డుపై ఏర్పడిన గుంతలుజిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మరింతగా దెబ్బతిన్నాయి. పట్టణంలోని భవానీనగర్ కాలనీలో రోడ్లపై గుంతలు ఏర్పడి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్కినగర్ వీధి నంబర్ –4 లో కూడా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
పంటలను ఆశిస్తున్న తెగుళ్లు
● జోరుగా పురుగు మందుల పిచికారీ నిజాంసాగర్ : వానాకాలం సాగు చేస్తున్న వరితో పాటు ఆరుతడి పంటలను తెగుళ్లు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే ఎండలు.. లేకపో తే అధిక వర్షాలు.. పంటలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం పంటపొలాల్లో నీరు నిలుస్తుండడంతో తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రధానంగా వరి పై రుకు తెగుళ్ల బెడద అధికం అయ్యింది. మొన్నటి వరకు మొగిపురుగు బెడద ఎక్కువగా ఉండడంతో రైతులు పురుగు మందులను పిచికారీ చేశారు. ప్ర స్తుతం పంటపొలాలపై పచ్చ పురుగు దాడి చేస్తోంది. దీంతో తెగుళ్ల నివారణకు రైతులు పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. వర్షాలు తగ్గిన తర్వా తే మందులు పిచికారీ చేయాలని మహమ్మద్‌నగర్ మండల వ్యవసాయాధికారి నవ్య సూచిస్తున్నారు. పచ్చ పురుగు నివారణకు కోరాజెన్ 60 ఎంఎల్ మందును ఎకరానికి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే పంటపొలాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి..
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండ లా మారుతుండడంతో సోమవారం గేట్లు ఎత్తను న్నారు. ఎగువన ఉన్న పోచారం ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, మంజీర నది, సింగూరు ప్రాజెక్టుల ద్వారా ఆదివారం 90వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు కాగా.. ఆదివారం రాత్రి వరకు 1,402.37 అడుగుల (14.162 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి తరువాత గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటి పారుదలశాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సోమవారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు సమాచారం.. -
కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కార్పొరేట్, ప్రైవేటు బ్యాంకులు రుణాలు ఇచ్చే విషయంలో రుణగ్రహీతకు సంబంధించిన ఏదేని ఆస్తిని తనఖా పెట్టుకుంటాయి. తీసుకున్న రుణం చెల్లించలేని పక్షంలో వారిపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకువస్తారు. ఇక చెల్లించకుండా మొండికి వేసినపుడు తనఖా పెట్టుకున్న ఆస్తులను చట్ట ప్రకారం సీజ్ చేసి, వేలం నోటీసులు జారీ చేస్తాయి. అయినా చెల్లించకుంటే వేలం వేసి తమకు రావలసిన బాకీని తీసుకుంటాయి. అయితే ఫైనాన్స్, చిట్స్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలు.. అప్పు ఇవ్వడానికి గానీ, చిట్టీ డబ్బు చెల్లించడానికి గానీ ష్యూరిటీలు అడుగుతాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న నిబంధన పెడతాయి. తమ అవసరం కోసం తెలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులను బతిమాలుకుని ష్యూరిటీగా సంతకాలు పెట్టిస్తాయి. అంతవరకు బాగానే ఉంటుంది. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి గానీ, చిట్టీ డబ్బులు తీసుకున్న వ్యక్తి గానీ వాయిదాలు చెల్లించని పక్షంలో ఒకటి రెండు పర్యాయాలు అడిగి, తరువాత రుణగ్రహీతను వదిలేసి ష్యూరిటీ సంతకం చేసిన వారికి నోటీసులు పంపిస్తున్నాయి. అప్పు తీసుకున్న వ్యక్తి అందుబాటులో లేని పక్షంలో, ఆ వ్యక్తి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు ష్యూరిటీ వద్దకు వెళ్లాల్సిన ఫైనాన్స్, చిట్స్ నిర్వాహకులు, సంస్థలు.. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.ష్యూరిటీ పెట్టిన పాపానికి కొందరు ఇబ్బందులు పడుతుండడంతో.. వారి అనుభవాలను చూస్తున్న ఇతరులెవరూ తమకు దగ్గరి వ్యక్తులకు సైతం ష్యూరిటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. తన శక్తి మేరకు ఎంతోకొంత సాయం అందిస్తా గానీ, ష్యూరిటీ మాత్రం ఉండనంటూ కొందరు చేతులెత్తేస్తున్నారు. చాలా చిట్‌ఫండ్ సంస్థల్లో అవసరానికి చిట్టీ తీసుకున్న వ్యక్తులకు ష్యూరిటీలు దొరకని పరిస్థితి తలెత్తుతోంది. కొందరు నెలల తరబడిగా ష్యూరిటీల కోసం తెలిసిన వారినల్లా అడుగుతున్నారు. ష్యూరిటీ పెడితే వచ్చే ఇబ్బందులను చెబుతూ కొందరు.. తాము ఇప్పటికే వేరే వాళ్లకు జమానత్ ఉన్నామంటూ మరికొందరు తప్పించుకుంటున్నారు. దీంతో చిట్టీలు ఎత్తుకున్నవారికి ష్యూరిటీ ఇచ్చేవారు కరువవుతున్నారు.చిట్‌ఫండ్, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకున్నవారు, చిట్టీ డబ్బులు తీసుకున్నవారు ద ర్జాగా ఉంటే ష్యూరిటీదారులు మాత్రం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. డబ్బులు కట్టేంతవరకు ఫైనాన్స్ సంస్థలు, చిట్ఫండ్ల నుంచి నోటీసుల మీద నోటీసులు వ స్తూనే ఉంటున్నాయి. దీంతో ష్యూరిటీ ఇచ్చినవారు అప్పు తీసుకున్న వారి వద్దకు వెళ్లి బతి మాలుకోవాల్సి వస్తోంది. తమకు వచ్చే జీతం తమ అవసరాలకు కూడా సరిపోవడం లేదని, ష్యూరిటీ ఉన్నందుకు ఎక్కడి నుంచి తేవాలంటూ కొందరు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. ఉద్యోగానికి సెలవు పెట్టి కోర్టులకు తిరగాల్సి వస్తోందని పూచీ పడిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తీసుకున్నోళ్లను వదిలేస్తున్న ఫైనాన్స్ సంస్థలు జమానత్దారులకు వేధింపులు డబ్బులు చెల్లించాల్సిందేనంటూ నోటీసులు లబోదిబోమంటున్న ష్యూరిటీ ఇచ్చినవారు దగ్గరి వాళ్లకూ పూచీ ఇవ్వడానికి వెనకడుగు వేసే పరిస్థితి -
సొసైటీల పదవీకాలం పెంపుపై హర్షం
పిట్లం(జుక్కల్): ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ పదవీ కాలాన్ని మరోసారి ఆరు నెలలు పొడిగించినందునందుకు గాను మండలంలోని సహకార సంఘం చైర్మన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేష్ షెట్కర్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, మండలంలోని సహకార సంఘం చైర్మన్లు ,ఒంటరి శపథం రెడ్డి, జార నాగి రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబీకుల ఆందోళన నిజామాబాద్‌నాగారం:రోడ్డు ప్ర మాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించా రు. వివరాలు ఇలా.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్(26) మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండేవాడు. అతడు శనివారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్‌కు కారులో బయలుదేరగా, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి హైవే వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రుడెన్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి ఆస్పత్రిలో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు వైద్యు ల నిర్లక్ష్యం కారణంగానే మృతిచెందినట్లు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం సభ్యులు ధ ర్నా చేపట్టారు. వీరికి మద్ధతుగా సీఐటీయూ నాయ కులు నూర్జహాన్, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు రషీదాభేగం, టీడీపీ అధికార ప్రతినిధి పురుషోత్తం, మెడికల్ రిప్రజంటేటివ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
దంచికొట్టిన వాన
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుపాను ప్రభావంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద వస్తోంది. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు నిండి అలుగు పారుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల వర్షంతో పాత ఇళ్లు కూలిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా రామారెడ్డిలో 123.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ తదితర మండలాలు మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లింగంపేట మండలంలో పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోల్కంపేట, భవానీపేట, నాగా రం కాసుకత్త వాగులు పారుతున్నాయి. తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు, ఎర్రాపహడ్, కరడ్‌పల్లి, కాళీజీవాడి, కన్కల్, చందాపూర్, సోమారం ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. గాంధారి మండంలోని దుర్గం– గుజ్జుల్, గుర్జాల్– వండ్రికల్, గాంధారి–తిప్పారం మధ్య వాగులు ఉ ధృతంగా పారుతున్నాయి. మద్నూర్ మండలంలో ని అంతాపూర్ సమీపంలో లోలెవల్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహించడంతో మ ద్నూర్–జుక్కల్ మధ్య రాకపోకలు నిలిచిపోయా యి. చిన్న ఎక్లారలోంచి వాగు ప్రవహించింది. గ్రా మంలోని హనుమాన్ ఆలయం, వాటర్ ట్యాంక్ చు ట్టూ ఉన్న ఇళ్లలో వరదనీరు చేరడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. మాచారెడ్డి మండలంలో పా ల్వంచ వాగు ఉధృతంగా పారుతోంది. ఎల్పుగొండ తండాకు వెళ్లే రోడ్డు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగింది. రామారెడ్డి మండలంలోని కన్నాపూర్‌లో వాగు పొంగి ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డి ఎ మ్మెల్యే మదన్మోహన్రావు వాగును పరిశీలించారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన రావుల సిద్ధిరాములు, కిషన్‌రావు, రాజు, మల్లీశ్వరిలకు చెందిన ఇళ్లు శనివారం కూలిపోయాయి. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రాజంపేట మండలం ఆరెపల్లి తండాకు చెందిన లంబాడి శంకర్ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. గాంధారి మండలం జువ్వాడిలో చాకలి సంగవ్వకు చెందిన ఇల్లు కూలింది. ఆ ఇంట్లో ఎవరూ నివసించకపోవడంతో ప్రమాదం తప్పింది. చెన్పాపూర్లో సూర లలిత, సంపంగి మల్లేష్లకు చెందిన ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గాంధారి తహసీల్దార్ రేణుకా చౌహాన్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. సోయాబీన్, చెరుకు, పత్తి పంటలు నీట మునిగాయి. చిన్న ఎక్లార, లచ్చన్, కొడిచిర, ధన్నూర్ శివారులోని పంటలు నీట మునిగాయని రైతులు తెలిపారు. చిన్న ఎక్లార గ్రామాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ కిరణ్మయిజిల్లాలోని వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం..(మి.మీ.) లొకేషన్ వర్షపాతం రామారెడ్డి 123.3 సోమూర్ 89.8 రాంలక్ష్మణ్‌పల్లి 87.3 మక్దుంపూర్ 71.5 గాంధారి 69.8 తాడ్వాయి 62.3 సదాశివనగర్ 60.5 కలెక్టరేట్ 58.8 సర్వాపూర్ 54.8 లింగంపేట 50.5 బొమ్మన్‌దేవ్‌పల్లి 43.0 అర్గొండ 42.5 హసన్‌పల్లి 38.0 నస్రుల్లాబాద్ 36.0 జుక్కల్ 35.3 కొల్లూర్ 34.0 పాతరాజంపేట 32.8 ఇసాయిపేట 32.5 పెద్దకొడప్గల్ 31.5 మాచాపూర్ 28.3 బీర్కూర్ 28.3 లచ్చాపేట్ 25.8 నాగిరెడ్డిపేట 21.8 మేనూర్ 21.3 బిచ్కుంద 20.0వరద ప్రాంతాల పరిశీలన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి లింబూర్‌వాడి వాగు వద్దకు పంచాయతీ ట్రాక్టర్లో వెళ్లారు. వాగుకు అవతలి వైపు ఉన్న గ్రామస్తులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఎవరూ వాగుదాటి రావద్దని సూచించారు. అనంతరం మద్నూర్ మండలంలోని అంతాపూర్ వద్ద మద్నూర్–జుక్కల్ రహదారిపై గల వంతెనను పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. చిన్న ఎక్లార గ్రామానికి వెళ్లి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా గ్రామం గుండా వెళ్తున్న వాగు పొంగిపొర్లడంతో వరద నీటిలో విరిగిన చెట్ల కొమ్మలు కొట్టుకుని వచ్చి పైప్‌లైన్‌లో తట్టుకున్నాయని, దీంతో నీరు గ్రామంలోకి చేరిందని పేర్కొన్నారు. వెంటనే పొక్లెయిన్ సహాయంతో వాటిని తొలగించారు. ఆమె వెంట తహసీల్దార్ ముజీబ్, బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్సై విజయ్‌కొండ తదితరులున్నారు.పొంగి ప్రవహిస్తున్న వాగులు అలుగెల్లిన పోచారం ప్రాజెక్టు నిజాంసాగర్‌కు పెరిగిన వరద చెరువులు, కుంటల్లోకి చేరిన నీరుమద్నూర్ : డోంగ్లీ మండలంలోని లింబూర్ వాడి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలు కురవడంతో లింబూర్, లింబూర్ వాడి మధ్యలోనున్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మహాలక్ష్మి’తో ఆర్టీసీకి ఆదాయం
బాన్సువాడ : మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ బస్‌డిపోకు వచ్చిన రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సులను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నిజామాబాద్ నుంచి జహీరాబాద్‌కు(వయా బోధన్, బాన్సువాడ, నిజాంసాగర్), మరొకటి బాన్సువాడ నుంచి నారాయణ్‌ఖేడ్ (వయా పిట్లం, నిజాంపేట్) నడుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సరితాదేవి, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. నియోజకవర్గానికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాన్సువాడలో పంపిణీ చేశారు. బాన్సువాడ రూరల్‌లో 23 మందికి రూ.7.11 లక్షలు, మున్సిపాలిటీలో 10 మందికి రూ.3.24 లక్షలు, బీర్కూర్ మండలంలో ఐదుగురికి రూ.1.56 లక్షలు, నస్రుల్లాబాద్ మండలంలో 10 మందికి రూ. 3.39 లక్షలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కమిటీ నియామకం కామారెడ్డి అర్బన్: స్వదేశీ జాగరణ్ మంచ్ జి ల్లా కమిటీని శనివారం ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలక్ బొడ్డు శంకర్ ప్రకటించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా సంయోజక్‌గా బి.మహేష్‌రెడ్డి, సహా సంయోజక్‌గా ఏ.రాజేశ్వర్‌గౌడ్, విచార విభాగ ప్రముఖ్‌గా లింబా గౌడ్, మహిళా ప్రముఖ్‌గా మండల శైలజ, సంపర్క్ ప్రముఖ్‌గా ఇటిక్యాల మహేష్, సంఘర్షణ ప్రముఖ్‌గా సంతోష్ నేత, పర్యా వరణ ప్రముఖ్‌గా నరేష్, శోధ్ ప్రముఖ్‌గా దిలీప్, ప్రౌఢ ప్రముఖ్‌గా బి.రాములు, యువ ప్రముఖ్‌గా నవీన్‌గౌడ్, ప్రచార ప్రముఖ్‌గా బి.గౌతమ్‌లను నియమించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ సంతోష్‌రెడ్డి, మంచ్ తెలంగాణ ప్రాంత సహ సంయోజక్ జి.అశోక్, ఇందూ ర్ విభాగ్ సహ సంయోజక్ రాజాగౌడ్, ప్రాంత యువ ప్రముఖ్ డాక్టర్ రాహుల్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధి డాక్టర్ యాలాద్రి తదితరులు పాల్గొన్నారు. ‘వార్షిక టోల్ పాస్‌ను సద్వినియోగం చేసుకోండి’ పిట్లం: వార్షిక టోల్ పాస్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంగళూరు టు మహారాష్ట్ర బార్డర్ హైవే మెయింటెనెన్స్ కం రెసిడెన్స్ ఇంజినీర్ రవి శంకర్ సూచించారు. శనివా రం ధర్మారం టోల్ ప్లాజా వద్ద వాహనాల కోసం వార్షిక పాస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రీ బుకింగ్ శుక్రవారం ప్రారంభమైందన్నారు. పాస్ యాక్టివేట్ అయిన త ర్వాత నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రి ప్పుల వరకు చెల్లుబాటు అవుతుందన్నారు. జాతీయ రహదారులపైనే చెల్లుతుందని, రా ష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని హైవేలపై వర్తించ దని పేర్కొన్నారు. వార్షిక పాస్ వాణిజ్య వా హనాలకు వర్తించదన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ టోల్ ఎక్స్పర్ట్ మహమ్మద్ రఫీ, క్యూబ్ హైవేస్ మేనేజర్ అక్షయ్ కుమార్, ధర్మారం టోల్ ప్లాజా కాంట్రాక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు
● మందులు అందుబాటులో ఉన్నాయి ● ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోంది ● డీఎంఈ నరేంద్రకుమార్కామారెడ్డి టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్ర కుమార్ తెలిపారు. శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ అజయ్‌కుమార్‌తో కలిసి జీజీహెచ్‌ను సందర్శించారు. బ్లడ్ బ్యాంక్, ల్యాబ్, ఐసీయూ, ట్రామా, ఎక్స్‌రే, డయాలసిస్, ఓపీ, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. డెంగీకి సంబంధించి రక్తపరీక్షలు, ప్లేట్లెట్స్ వైద్య సేవలపై ఆరా తీశారు. రక్తఫలికలను వేరు చేసే ఎస్డీపీ యంత్రం సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్ఎంవో సంతోష్‌కు సూచించారు. ఇన్నేళ్లుగా యంత్రాన్ని వినియోగించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్‌గున్యా, విషజ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీజీహెచ్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు సరిపడా బెడ్స్, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. జిల్లాలో గతనెలలో 81 డెంగీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్, సూపరింటెండెంట్లు విచారణ చేస్తున్నారన్నారు. జీజీహెచ్‌లో సిటి, ఎంఆర్ఐ సేవలను త్వరలోనే ప్రారంభిస్తామని డీఎంఈ తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్దనున్న దేవి ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించారు. సీజనల్ వ్యాధుల బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, వైద్యులు శరత్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలతో ఆస్పత్రి భవనం పైకప్పునుంచి నీరు లీకవుతోంది. దీంతో నీరు కింద పడకుండా చూసేందుకు సిబ్బంది నీరు ఊరుస్తున్న ప్రాంతాలలో డబ్బాలు, చెత్తబుట్టలను ఉంచారు. డీఎంఈ వాటిని చూస్తూ ముందుకు వెళ్లారు. ఎమర్జెన్సీ, మెటర్నిటీ వార్డులలోనూ ఇదే పరిస్థితి ఉంది. వంటశాలలో భవనం పైకప్పు పెచ్చులూడుతున్నాయి. -
పొంగుతున్న ‘పోచారం’
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టుకు వరద నీరు పొటెత్తింది. శుక్రవారం రాత్రి ఎగువన కురిసిన భారీ వర్షాలతో శనివారం ఉదయం నుంచి ప్రాజెక్టులోకి వరదనీటి చేరిక మొదలయ్యింది. ఉదయం 3 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి 12 వేలు దాటింది. 12,867 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 21.5 అడుగుల(1.820 టీఎంసీ)తో ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో అంతే నీరు అలుగుపైనుంచి దిగువకు ప్రవహిస్తోంది. ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రావు ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు, మంజీర పరీవాహక ప్రాంతాలకు ప్రజలెవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆర్డీవో సూచించారు. ప్రాజెక్టు వద్దకు ప్రజలెవరూ వెళ్లకుండా బందోబస్తే ఏర్పాటు చేయాలని డీఎస్పీ ఆదేశించారు. వారివెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ రాజిరెడ్డి, ఎస్సై భార్గవ్‌గౌడ్, ఎంపీడీవో ప్రభాకరచారి, ఇరిగేషన్ ఏఈ అక్షయ్‌కుమార్ తదితరులున్నారు.● 12,867 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ● ప్రాజెక్టును సందర్శించిన ఆర్డీవో, డీఎస్పీ మద్నూర్‌లో ఇంట్లోకి చేరిన వరద నీరు -
విద్యుత్ షాక్‌తో గేదె మృతి
మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌పేట్‌లో శనివారం విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందినట్లు పంచాయతీ కార్యదర్శి సంజయ్ తెలిపారు. విద్యుత్ తీగల కింద గేదె మేత మేస్తుండగా విద్యుత్ తీగలు తెగి గేదైపె పడ్డాయి. దీంతో గేదె కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. కళేబరానికి పంచనామ నిర్వహించి మేనూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈకి సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు. దాబాపై పోలీసుల దాడి ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్ శ్రీమాతా దాబాపై శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. దాబాలో మద్యం తాగేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతులు లేని దాబాలలో మద్యం సేవించవద్దని ఎస్సై మద్యం ప్రియులకు సూచించారు. పేకాడుతున్న 10మంది అరెస్టు ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్లపేట శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.43,150ల నగదు, 10 సెల్ఫోన్లు, 11 బైకులు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు ఆయన తెలిపారు. గుంతలో దిగపడిన లారీ నస్రుల్లాబాద్: మండల కేంద్రంలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో దిగబడిపోయింది. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండగా రహదారి పక్కన గుంతలు తవ్వా రు. ఈక్రమంలో శుక్రవారం మండల కేంద్రంలోని సమీకృత భవనం ఎదురుగా వర్ని వైపునకు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో దిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, బార్డర్ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కన్నాపూర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తా
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● వర్షంలోనే కొనసాగిన ఎమ్మెల్యే పర్యటనరామారెడ్డి: వర్షాలు ముగిసిన వెంటనే మండలంలోని కన్నాపూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శనివారం రామారెడ్డి మండలంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు పర్యటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కన్నాపూర్ మత్తడివాగు వాగును వర్షంలోనే ఎమ్మెల్యే మదన్మోహన్రావు అధికారులతో కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలోనే సంబంధిత మంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. 40 ఏళ్లుగా కన్నాపూర్ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు కన్నాపూర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే పరిష్కారిస్తామన్నారు. పనులకు సంబంధించిన విషయమై అక్కడి నుంచే ఎమ్మెల్యే డీఈ బాల్లింగంతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం కన్నాపూర్, కన్నాపూర్ తండా, పోసానిపేట్,ఉప్పల్వాయి గ్రామాల్లో వర్షంలోనే ఎమ్మెల్యే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో తిరుపతిరెడ్డి, హౌసింగ్ ఏఈ సుచిత్ర, సీడీసీ చైర్మన్ ఇర్షద్, డైరెక్టర్ రవుఫ్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రావు, రూపేందర్‌రెడ్డి, రంగు రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్, సంగోజివాడి గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా కల్యాణ లక్ష్మీచెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. మండల కేంద్రంలో తమసమస్యలు తీర్చాలని కోరుతూ ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే మదన్మోహన్కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో సాజీద్‌అలీ, శివాజీ, లక్ష్మణచారీ, షౌకత్‌అలీ, సుధాకర్‌రావు, శ్యాంరావు, మేకల రాజు, రాంచంద్రం,గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి అర్బన్ : విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక జన్మభూమిరోడ్డులో నాయకులు కాషాయజెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, ధర్మసంస్థాపన, హిందు సమాజాన్ని ఏకం చేయడం కోసం 1964 సంవత్సరం గోకులష్టమి రోజున విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేశారని వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు వడ్ల వెంకటస్వామి అన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా ప్రచార ప్రముఖ్ గోపిరాజ్ శ్రీకాంత్‌రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ప్రతినిధులు విశ్వంగుప్తా, అనిల్‌కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
నీటి గుంతలో పడి ఒకరి మృతి ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో పడి ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన పురేందర్ గౌడ్(52) గతంలో ఉపాధి కోసం వైన్ షాపుల్లో, కల్లు బట్టీల్లో పని చేసేవాడు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడతో పని కోసం వెతుకుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అతడు ఇందల్వాయి నుంచి సిర్నాపల్లి వైపు నడుచుకుంటూ బయలుదేరాడు. గన్నారం గ్రామ శివారులోగల రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో అతడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. మోర్తాడ్(బాల్కొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మోర్తాడ్‌కు చెందిన కనకం అనిల్(31) ఈనెల 4న బంధువులను కలవడానికి బైక్‌పై శెట్పల్లి గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరగా, పాలెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. మృతదేహానికి శనివారం ఆర్మూర్ ఆస్పత్రిలో పోసుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. బీబీపేట మండలంలో ఒకరు.. బీబీపేట: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట గ్రామానికి చెందిన పోసు నారాయణ (65) గత మూడేళ్లుగా అల్సర్‌తో బాధపడుతుండేవాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారం తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల క్రితం చెరువులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై రంజిత్ తెలిపారు. -
గత ప్రభుత్వం చేసిన తప్పులతోనే ఊరిలోకి వరద
● చిన్న ఎక్లారలో పర్యటించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ● రైతులను ఆదుకుంటాం మద్నూర్(జుక్కల్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చిన్న ఎక్లార గ్రామంలో వరద నీరు వచ్చి చేరిందని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని చిన్న ఎక్లారలో శనివారం వరద నీరు గ్రామంలోకి చేరడంతో పాటు భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే చిన్న ఎక్లార గ్రా మంలో పర్యటించారు. గ్రామంలోని వాగు వరద నీ రు ఊర్లోకి వెళ్లినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యేతో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల క్రితం గ్రామంలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లోపంతో నిర్మించడంతో కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారన్నారు. చెక్‌డ్యాంకు మరమ్మతులు చేయించి తిరిగి వరద నీరు ఊర్లోకి రాకుండా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. వర్షాలతో గ్రామ శివారులోని 6 నుంచి 7 వందల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ను ఆదుకుంటుందని భరోసా ఇస్తున్నానని, తక్షణమే వ్యవసాయ అధికారులచే పంట నష్టంపై సర్వే నిర్వహించాలని ఆదేశించానని ఎమ్మెల్యే చెప్పారు. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు హన్మాండ్లు స్వామి, సాయిపటేల్, నాగేశం, మహేశ్, గ్రామస్తులున్నారు.