తాగునీటి వృథాను అరికట్టాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో తాగునీటి వృథాను అరికట్టాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ ప్రవీణ్‌రెడ్డి సూచించారు. రాఘవపల్లి, అక్కంపల్లి, గోపాల్‌పేట గ్రామాల్లో తాగునీటి సరపరాపై మంగళవారం స్థానిక అధికారులతో కలిసి వారు స్పెషల్‌డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్‌లతో కలిసి వారు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వారు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజ్‌కుమార్, రాఘవపల్లి, అక్కంపల్లి సర్పంచ్‌లు గంగామణి, వెంకాగౌడ్, కార్యదర్శులు జానకి, కిష్టయ్య, రాజు తదితరులున్నారు.


