గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గండివేట్ గ్రామంలో బుధవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్‌తో ఓ గుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో గుడిసెలో నివాసం ఉంటున్న చాకలి గంగవ్వకు చెందిన తులంన్నర బంగారు నగలు, వెండి పట్టీలు, ఇంటిలో నిల్వ ఉంచుకున్న నిత్యావసర సరుకులు, దుస్తులు పూర్తిగ కాలిపోయాయి. సమాచారం అందుకున్న డీటీ లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. సుమారు రూ.2.40 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. తక్షణ సహాయంగా 20 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ఉప సర్పంచ్ కాశిరాం ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బియ్యం, వంట సామగ్రి, సరుకులతోపాటు కొంత నగదు అందజేశారు.


