కామారెడ్డి అర్బన్: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఎస్‌ఈ కార్యాలయం వద్ద జిల్లా స్థాయి విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు వంటావార్పు, ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వివిధ విద్యుత్ యూనియన్ల నేతలు.. ఆర్టిజన్లకు సంఘీభావం తెలిపారు. ఏపీఎస్‌ఈబీ సర్వీస్ నిబంధనల అమలు, విద్యార్హతను బట్టి కన్వర్షన్, జీవో–11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ హరికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి భీంరాజ్, కామారెడ్డి జిల్లా కన్వీనర్ జయసింహారెడ్డి, వర్కింగ్ అధ్యక్షుడు కిష్టాగౌడ్, డివిజన్ చైర్మన్ సునీల్‌గౌడ్, కన్వీనర్ రంజిత్ యాదవ్, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ల ప్రతినిధులు కృష్ణ, రాజేందర్, బాలరాజు, రాజాగౌడ్, విజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్ నరేష్, నితిన్, ప్రదీప్ పాల్గొన్నారు.


