ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

బాన్సువాడ రూరల్‌: వాహనచోదకులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని లేదంటే చలాన్లు పడతాయని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్‌ అన్నారు. గురువారం బాన్సువాడ–బిచ్కుంద రోడ్‌లో బుడిమి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రైవింగ్‌లైసెన్స్‌, ఆర్‌సీ, ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్సు, పొల్యూషన్‌ తదితర సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపటం నేరమన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలన్నారు. నిబంధనలు పాటించని వారు చట్టప్రకారం శిక్షార్హులు అవుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement