కాసుల బాల్‌రాజ్‌ను విమర్శిస్తే ఊరుకోం
బాన్సువాడ: ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీర్కూర్ మాజీ ఎంపీపీ విజయప్రకాష్ అన్నారు. కాసుల బాల్‌రాజ్‌పై రుద్రూర్ సర్పంచ్ చంద్రశేఖర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ చంద్రశేఖర్ 5వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతుండగా స్వయంగా కాసుల బాల్‌రాజ్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడని, కాంగ్రెస్‌లో ఉండి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాసుల బాల్‌రాజ్‌ను విమర్శించే స్థాయి చంద్రశేఖర్‌కు లేదని అన్నారు. నాయకులు బోయిని శంకర్, యామ రాములు, బస్వరాజ్, దొంతురాం కాశీరాం, సందీప్, శశికాంత్ తదితరులున్నారు.


