బాన్సువాడలో బీజేపీ, ఎంఐఎం బోణీ
బాన్సువాడ: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఫ లితాలు ఉత్కంఠ రేపాయి. మున్సిపల్ ఎన్నికల ఓ ట్ల లెక్కింపు శుక్రవారం ఉండడంతో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు ఉద యాన్నే చేరుకున్నారు. ఎన్నికల అధికారులు 19 వా ర్డుల ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపట్టడడంతో ఫలితా లు ఒకేసారి ప్రకటించారు. మొదటి సారిగా ఎంఐ ఎం ఒక వార్డులో విజయం సాధించి, పాగ వేయగా బాన్సువాడలో బీజేపీ పార్టీ బలంగా ఉందని ఓట ర్లు నిరుపించారు. గతంలో ఒక్క సీటు రాని బీజేపీ ఈసారి మూడు కౌన్సిలర్ల స్థానాలను కై వసం చేసుకుంది. మరొ నాలుగు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో ఒడిపోయారు. 19 వార్డులకు గాను 11 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. మెజారిటీ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బతగిలింది.
బాన్సువాడలో బీజేపీ, ఎంఐఎం బోణీ


