దండుపాళ్యం బ్యాచ్‌ను సాగనంపండి
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న దండుపాళ్యం బ్యాచ్‌ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయని.. అదే నిధులతో ఎల్లారెడ్డిలో పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.5 కోట్లతో బస్టాండ్ నిర్మాణం, రూ.18 కోట్లతో డబుల్ బెడ్‌రూంల నిర్మాణం, రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు బీఆర్‌ఎస్ నిధులు మంజూరు చేసి నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసి తాము అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.2 కోట్ల నిధులు కూడా తేలేదని అన్నారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లకు బీటీ వేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు జలంధర్‌రెడ్డి, ఆదిమూలం సతీష్, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌నాయక్, నర్సింలు, ముదాం సాయిలు, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రసీలా, పద్మ, జీనత్ సుల్తానా, తదితరులున్నారు.


