33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా | - | Sakshi
Sakshi News home page

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

Feb 9 2026 7:28 AM | Updated on Feb 9 2026 7:28 AM

33వ వ

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కుంబా రవియాదవ్‌ ఆదివారం వార్డులోని కాలనీలలో ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. 24 గంటల పాటు వార్డులో అందుబాటులో ఉంటానని, వార్డులోని సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు.

37వ వార్డులో జోరుగా ప్రచారం

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా 37వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి నిట్టు కృష్ణమోహన్‌రావు ఆదివారం ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

డప్పు కళాకారులతో వినూత్న ప్రచారం

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలో 10వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదివారం వినూత్నంగా ప్రచారం చేపట్టారు. డప్పు కళాకారులతో వార్డులోని కాలనీలో ప్రచారం చేశారు. ఉదయం నుంచి కళాకారులతో ప్రభుత్వ పథకాలు, వార్డు అభ్యున్నతికి తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను పాటల ద్వారా ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తానో ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాకారులతో పాటల ద్వారా వివరించారు. కౌన్సిలర్‌ అభ్యర్థి కళావతి మాట్లాడుతూ.. మొదటిసారి పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాయకుడు రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా 1
1/2

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా 2
2/2

33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement