క్రైం కార్నర్
కుమ్మన్‌పల్లిలో ఒకరి ఆత్మహత్య
బోధన్‌రూరల్: సాలూర మండలంలోని కుమ్మన్‌పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఊషం లక్ష్మణ్ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 5న ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం మృతుడి భార్య మల్లుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రెండు గ్రామాల్లో చోరీలు
రామారెడ్డి: రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో, పాల్వంచ మండలం సింగరాయిపల్లి గ్రామంలో దొంగలు గురువారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సింగరాయపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రెండు బైక్‌లు దొంగిలించారు. వాటిలో ఒక బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో గ్రామంలోనే వదిలివేశారు. అలాగే సింగరాయిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి చిల్లర నాణేలను, సీసీ కెమెరాలను, హార్డ్‌డిస్క్‌లను కూడా దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు. రెడ్డిపేట గ్రామంలో ఒక బైక్
డ్రంకన్‌డ్రైవ్‌లో 33మందికి శిక్షలు
కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు డ్రంకన్‌డ్రైవ్ కేసుల్లో 33 మందికి శిక్షలు విధించాయి. ఇటీవల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడ్డారు. వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా 10 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 33 మందికి రూ.35వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.


