రెబల్స్ సవాల్!
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
– 8లో u
ప్రధాన పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తమ ఓట్లకు ఎక్కడ గండిపడుతుందేమోనని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలోని నాలుగు బల్దియాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్ భయపెడుతున్నారు. ఆయా పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన వారిలో కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీటుగా ప్రచారం నిర్వహిస్తూ జనంలోకి చొచ్చుకుపోతూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రెబల్స్ గెలిచే అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల వీరి మూలంగా ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు బాన్సువాడలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది.
ప్రచారంలో జోరు.. గెలుపోటములపై ప్రభావం
వివిధ పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో వారి ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరిలో కొందరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా.. మరికొందరు తమకు టికెట్టు ఇవ్వని పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెబల్స్ సైతం జోరుగా ప్రచారం చేస్తుండడంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీంతో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న
పలువురు తిరుగుబాటు అభ్యర్థులు
పలు వార్డుల్లో సత్తా చాటే ప్రయత్నం
ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు
ఎవరికి చేటు తెస్తారోనని ఆందోళన
రెబల్స్ సవాల్!


