‘ఆడబిడ్డ పెళ్లికి రూ. 11 వేల కానుకిస్తా’
ఎల్లారెడ్డి: ఎన్నికలలో గెలుపుకోసం అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సిద్ధి శ్రీధర్ వినూత్న హామీలిస్తున్నారు. వార్డు పరిధిలోని ఆడబిడ్డల వివాహం సందర్భంగా రూ. 11 వేల కానుకిస్తానని, ఆడపిల్ల జన్మిస్తే రూ. 10 వేలు ఇస్తానని చెబుతున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ. 10 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అందిస్తాననీ మాటిస్తున్నారు.


