నీటి ఎద్దడి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

నీటి

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): లింగంపల్లిలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్‌ లావణ్య తెలిపారు. గురువారం గ్రామంలో నీటి సమస్య ఉన్న వీధులను పరిశీలించి నివేది కలు తయారు చేశారు. ఉప సర్పంచ్‌ ఎడ్ల గంగారాం,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

పోల్కంపేటలో..

లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేట గ్రామ పంచాయతీలో గురువారం పాలక వర్గం వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినట్లు సర్పంచ్‌ దివిటి రమేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వేసవిలో గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ రజినీకాంత్‌, కార్యదర్శి అశ్వక్‌, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

అన్నాసాగర్‌లో..

ఎల్లారెడ్డిరూరల్‌: గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నాసాగర్‌ సర్పంచ్‌ స్రవంతి అన్నారు. గురువారం అన్నాసాగర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పాలకవర్గ సభ్యులతో చర్చించారు.

నీళ్లను వృథా చేయొద్దు

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ట్యాంకులు, నల్లల ద్వారా వచ్చే నీటిని వృథా చేయవద్దని కాలోజీవాడి సర్పంచ్‌ చంద్రారెడ్డి అన్నారు. ఆయన గురువారం కాలోజీవాడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నల్లాలను తనిఖీ చేశారు. నల్లల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు అవసరం ఉన్నంత మేరకు పట్టుకొని వెంటనే వాటిని బంద్‌ చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఉపసర్పంచ్‌ సాయికుమార్‌, జీపి సిబ్బంది ఉన్నారు.

నీటి ఎద్దడి నివారణకు చర్యలు 1
1/3

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు 2
2/3

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు చర్యలు 3
3/3

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement