పోలింగ్‌ను సజావుగా నిర్వహించాలి
● సమస్యలు తలెత్తితే సమాచారం ఇవ్వండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వ హించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని ఏఎంసీ గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ సమయంలో ఏవైనా సమస్య లు తలెత్తితే విధులు నిర్వహించే అధికారులు వెంట నే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూ చించారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారు లు తమ కేంద్రాలకు తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ పూర్తి చేసి రిసెప్షన్ కేంద్రానికి చేరుకునే వ రకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ తప్పకుండా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సి బ్బందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులు, బస్సు సౌకర్యం కల్పించామని తెలిపా రు. పోలింగ్, భద్రత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహ న్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల అ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


