పోలింగ్‌కు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు వేళాయె!

Feb 11 2026 7:23 AM | Updated on Feb 11 2026 7:23 AM

పోలింగ్‌కు వేళాయె!

పోలింగ్‌కు వేళాయె!

ఏర్పాట్లు పూర్తి.. నిఘా నీడలో..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు వేళయ్యింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 447 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,49,525 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు.

ఓటరు ఎటువైపో?

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ గతనెల 27న వెలువడింది. అదే రోజునుంచి మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశలు నిర్వహించారు. కొందరైతే ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించారు. కులాలు, సంఘాలు, సిండికేట్లు, సొసైటీల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వారి డిమాండ్‌లు నెవరేర్చారు. కొందరు అభ్యర్థులు సొంత డబ్బులతో కొన్ని గల్లీల్లో బోర్లు తవ్వించారు. అధికార పార్టీకి చెందిన వారు పలుకుబడి ఉపయోగించి బోర్లు వేయించి మోటార్లు బిగించారు. నోటిఫికేషన్‌ రాకముందే సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కట్టించారు. మరికొన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అభ్యర్థులు పలువురు ఓటర్లను ఆకట్టుకోవడానికి విందులు ఏర్పాటు చేశారు. తాయిలాలూ అందించారు. గెలుపుకోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. పలువురు డబ్బును నీళ్లలా ఖర్చు చేశారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సులలో నిక్షిప్తం కానుంది. ఓటర్లు ఎవరిని ఆదరించారో శుక్రవారం తేలనుంది.

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా కామారెడ్డిలో 17 మంది, ఎల్లారెడ్డిలో నలుగురు, బాన్సువాడలో ఏ డుగురు, బిచ్కుందలో నలుగురు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ నిర్వహణ కోసం 1,398 మంది సిబ్బందిని నియమించారు. కామారెడ్డిలో 883 మంది, ఎల్లారెడ్డిలో 142 మంది, బాన్సువాడలో 229 మంది, బిచ్కుందలో 144 మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. నాలుగు మున్సిపాలి టీల పరిధిలోని 92 వార్డుల్లో ఏర్పాటు చేసిన 239 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాలు నిఘా నీడలో ఉన్నాయి. అధికారులు వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించనున్నారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాలలో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ప్రత్యేక బృందాల ద్వారా ఆయా కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

522 బ్యాలెట్‌ బాక్సులు..

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల కోసం 522 బ్యాలెట్‌ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇందులో కామారెడ్డి బల్దియాకు అత్యధికంగా 364, బాన్సువాడకు 60, ఎల్లారెడ్డికి 58, బి చ్కుందకు 40 బాక్సులు కేటాయించారు. వీటి ని పోలింగ్‌ కేంద్రాలకు పంపించారు. పోలింగ్‌ పూర్తవగానే స్ట్రాంగ్‌ రూంలకు తరలిస్తారు.

మున్సిపాలిటీలలో వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల వివరాలు..

బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు..

పురపోరు చివరి దశకు చేరుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం

5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

ఓటరు తన తీర్పును బ్యాలెట్‌ బాక్సులో నిక్షిప్తం చేయనున్నాడు.

నాలుగు మున్సిపాలిటీల పరిధిలో

92 వార్డులు

ఎన్నికల బరిలో 447 మంది

అభ్యర్థులు

239 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేయనున్న 1,49,525 మంది ఓటర్లు

ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు

చేరిన సిబ్బంది

నేటి ఉదయం 7 నుంచి

సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement