రెండో విడత ర్యాండమైజేషన్‌ | - | Sakshi
Sakshi News home page

రెండో విడత ర్యాండమైజేషన్‌

Feb 11 2026 7:23 AM | Updated on Feb 11 2026 7:23 AM

రెండో

రెండో విడత ర్యాండమైజేషన్‌

కామారెడ్డి క్రైం: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్‌ కుమార్‌ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. కౌంటింగ్‌ సూపర్‌వైజ ర్లు, అసిస్టెంట్లకు రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా విధులు నిర్వహించాల్సిన బల్దియాలను కేటాయించారు. కౌంటింగ్‌కు మొత్తం సూపర్‌వైజర్లుగా 89 మందిని, అసిస్టెంట్లుగా 178 మంది సిబ్బందిని కేటాయించామని కలెక్టర్‌ తెలిపారు. వారికి ఆయా మున్సిపాలిటీల్లో ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, మధుమోహన్‌, సీపీవో రఘునందన్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ శివకుమార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు

కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం

కామారెడ్డి క్రైం: లెండి అంతరాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశాన్ని మంగళవా రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించా రు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధ భవనం నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి నుంచి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సమావేశంలో చర్చించారు.

‘రేపటి బంద్‌లో ఆటో జేఏసీ పాల్గొనట్లేదు’

కామారెడ్డి అర్బన్‌: ఈనెల 12న చేపట్టే రాష్ట్ర బంద్‌కు కామారెడ్డి జిల్లా ఆటో జేఏసీ మద్ద తు ఇవ్వడం లేదని ఆటో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు ఒక ప్రకటనలో తె లిపారు. వామపక్ష యూనియన్లు, పార్టీలు తమ ఉనికి కోసం బంద్‌ పాటిస్తున్నాయని ఆరోపించారు. బంద్‌తో ఆటో కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, అందుకే బంద్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

ఈవీఎం గోదాం పరిశీలన

కామారెడ్డి క్రైం : సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్‌కు సమీపంలోని ఈవీఎం గో దాంను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మంగళవా రం సందర్శించారు. రికార్డులు, భద్రతా చ ర్యలు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవె న్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆర్డీవో వీణ, ఎ న్నికల డిప్యూటీ తహసీల్దార్‌ అనిల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియాతోపాటు అవసరమైన ఇతర ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారానే యూరియా బుక్‌ చేయాలని సూచించారు. ఈ యాప్‌ ద్వారా రైతులు కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో ఎక్కడైనా యూరియా బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

బ్యాంక్‌ సేవలను

వినియోగించుకోవాలి

మాచారెడ్డి : ప్రతి ఒక్కరు బ్యాంక్‌ల సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎల్డీఎం చంద్రశేఖర్‌ సూచించారు. పాల్వంచ మండలం భవానీపేటలో మంగళవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ల సౌజన్యంతో స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్‌ సోషల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్‌ ఖాతాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్‌ఎస్టీ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ ప్రవీణ్‌, పాల్వంచ టీజీబీ మేనేజర్‌ వేణుగోపాల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

రెండో విడత ర్యాండమైజేషన్‌ 
1
1/2

రెండో విడత ర్యాండమైజేషన్‌

రెండో విడత ర్యాండమైజేషన్‌ 
2
2/2

రెండో విడత ర్యాండమైజేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement