ఓటరు దేవుడు.. అందరివాడు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పురపోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సంపాదించినప్పటికీ.. ఓటర్లు ప్రతిపక్షాలకూ తగిన ప్రాధాన్యతనిచ్చా రు. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 92 వార్డు లు ఉండగా కాంగ్రెస్ ఖాతాలో 50 స్థానాలు చే రాయి. బీజేపీ 19, బీఆర్‌ఎస్ 17 వార్డుల్లో గెలుపొందాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. కామారెడ్డిలో మాత్రం హంగ్ ఏర్పడింది. కాగా నాలుగు మున్సిపాలిటీలలో కలిపి 1,03,896 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌కు 37.46 శాతం ఓట్లు వచ్చా యి. బీఆర్‌ఎస్ పార్టీకి 26.69 శాతం, బీజేపీకి 22.31 శాతం ఓట్లు రావడం గమనార్హం.
కామారెడ్డిలో పోటాపోటీగా..
జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 32.98 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 28.36 శాతం ఓటర్ల మద్దతు లభించింది. బీఆర్‌ఎస్‌కు 26.06 శాతం మంది ఓటేశారు.
బాన్సువాడలో మూడింటికి..
బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 38.80 శాతం ఓట్లొచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 25.97 శాతం, బీజేపీకి 17.44 శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది.
ఎల్లారెడ్డిలో వన్‌సైడ్!
ఎల్లారెడ్డి బల్దియాలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ పోలైన ఓట్లలో 58.34 శాతం అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. బీఆర్‌ఎస్‌కు 28.21 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి నామమాత్రంగా 6.20 శాతమే ఓట్లు పోలయ్యాయి.
బిచ్కుందలో కాంగ్రెస్‌కు భారీగానే..
బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 42.33 శాతం ఓటర్ల మద్దతు లభించింది. బీఆర్‌ఎస్‌కు 30.52 శాతం, బీజేపీకి 8.38 శాతం ఓట్లేశారు.
మున్సిపాలిటీలవారీగా పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు..
బల్దియా మొత్తం పోలైన కాంగ్రెస్ శాతం బీజేపీ శాతం బీఆర్‌ఎస్ శాతం
ఓట్లు ఓట్లు
కామారెడ్డి 99,313 65,483 21,598 32.98 18,571 28.36 17,069 26.06
ఎల్లారెడ్డి 13,265 10,581 6,173 58.34 665 6.20 2,985 28.21
బాన్సువాడ 24,188 17,818 6,914 38.80 3,109 17.44 4,625 25.97
బిచ్కుంద 12,759 10,014 4,239 42.33 840 8.38 3,057 30.52
మొత్తం 1,49,525 1,03,896 38,924 37.46 23,185 22.31 27,739 26.69
మూడు పార్టీలకూ ఆదరణ
నాలుగు మున్సిపాలిటీల్లో 92వార్డులు
కాంగ్రెస్‌కు 50, బీజేపీకి 19,
బీఆర్‌ఎస్‌కు 17 స్థానాలు
అన్ని పార్టీలకు గణనీయంగా ఓట్లు


