దోమకొండలో ఉర్దూ కవి సమ్మేళనం
దోమకొండ: దోమకొండ పోర్ట్ అండ్ విలేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గడికోటలో ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహించారు. ఆధునిక ఉర్దూ సాహిత్యం, ఆధునిక కవులు వారి రచనలు, సమాజంపై వాటి ప్రభావం అంశాలపై అమెరికాలోని విలియం ప్యాటర్సన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మీర్ అమీర్ హుస్సేన్ మాట్లాడారు. మంజీర కాలేజీ ఉ ర్దూ విభాగం విద్యార్థులు కవితలు చెప్పారు. చివరలో ఖవాలి నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటెక్ కన్వీనర్ షాహద్ షాహిద్, హైదరాబాద్ ఇంటెక్ కన్వీనర్ అనురాధారెడ్డి, కవులు వినయ్‌వర్మ, యాసిర్ మ హమ్మద్ రేపాయ్, అలీనా తర్జీన్, మోహిన్‌ర హీ, రహీల్ కరీంనగరీ, గడీకోట వారసులు కామినేని అనిల్‌కుమార్, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, సర్పంచ్ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి స్వతంత్రులు..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలో గెలుపొందిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదా రు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 40వ వార్డునుంచి పోటీ చేసిన నాగమణి, 38వ వార్డు నుంచి గెలిచిన ఇప్ప ఉమారాణి, మూడో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై న షేక్ బబ్లూలకు షబ్బీర్ అలీ కాంగ్రెస్ కండువాలు కప్పారు.
డిచ్‌పల్లి పోలీస్ సబ్ డివిజనల్‌కు ఆమోదం!
నిజామాబాద్‌అర్బన్: డిచ్‌పల్లి కేంద్రంగా పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జిల్లా పోలీస్ శాఖ డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలను పంపించింది. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉండడంతో సబ్ డివిజనల్ ఏర్పాటు కు సంబంధించిన ప్రక్రియను పోలీస్ శాఖ పూర్తి చేసింది. ప్రస్తుతం నిజామాబాద్ డివి జన్ పరిధిలో ఉన్న 15 పోలీస్ స్టేష న్‌లలో నుంచి ఏడింటిని డిచ్‌పల్లి సబ్ డివిజనల్‌కు కేటాయించారు. ఇందులో మోపాల్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లు న్నాయి. ఇటీవల జిల్లాకు డీజీపీ శివధర్‌రెడ్డి వచ్చిన సందర్భంలో సబ్ డివిజనల్ ఏర్పాటుపై సీపీ చర్చించగా ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు.
డీఎస్పీగా రాజా వెంకటరెడ్డి!
డిచ్‌పల్లి పోలీస్ సబ్ డివిజనల్ ఏర్పాటుకు డీఎస్పీగా రాజావెంకటరెడ్డి నియమితుల య్యే అవకాశం ఉంది. నిజామాబాద్ ఏసీపీ గా పని చేసిన ఆయనను ఇటీవల బదిలీ చే స్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే నూతన డివిజనల్ ఏర్పాటుతోపా టు డీఎస్పీ నియామకం ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి.


