నాడు విద్యార్థినేత.. నేడు ప్రజానేత
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన గడ్డమీది అంజగౌడ్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించిన విష యం తెలిసిందే. ఈయన బాన్సువాడలో ఏబీవీపీ నాయకుడిగా 2007లో అడుగుపెట్టి అంచలచెలుగా ఎదిగి 2015లో ఏబీవీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత ఏబీవీపీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు జిల్లా కన్వీనర్‌గా మూడేళ్లు పని చేశారు. తెలంగాణ యూనివర్సీటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అంజగౌడ్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 2020లో జరిగిన బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అప్పట్లో ఈ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. రెండవ స్థానంలో అంజగౌడ్‌కు 215 ఓట్లు వచ్చాయి. ఈసారి మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కానీ అంజగౌడ్‌కు బీఆర్‌ఎస్ టికె ట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా 12వ వార్డు నుంచి పోటీలో నిలిచి, గెలిచారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో విజయం సాధించిన ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థిగా అంజగౌడ్‌కు గుర్తింపు వచ్చింది. గతంలో వచ్చిన ఎయిర్‌కండిషనర్ గుర్తే ఈ సారి కూడా రావడంతోనే విజయం సాధించినట్లు అంజగౌడ్ తెలిపారు.


