రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మాచారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అన్నారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి–సిరిసిల్ల రహదారిపై పాల్వంచ, భవానీపేట గ్రామాల మధ్య బ్లాక్ స్పాట్స్ వద్ద 9 రేడియం డ్రమ్ములను ఏర్పాటు చేశారు. గతంలో సైతం 12 డ్రమ్ములను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పాల్వంచ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సత్యం ఉన్నారు.
మాక్లూర్: మండలంలోని మాణిక్‌బండార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు డీఈవో అశోక్ ఆధ్వర్యంలో రూ. లక్షా 20 వేలు విలువ చేసే సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా సైకిళ్లను అందించటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, సంస్థ సభ్యులు దొడ్లె శేఖర్, సతీశ్, శ్రీనివాస్, గౌతమి, చిరంజీవి, కిశోర్, రజిని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న విద్యార్థులకు వ్యాసరచ న, డ్రాయింగ్‌తోపాటు ఇతర పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ నాయకులు కోయేడి నర్సింహులు,గుర్రం వెంకటమల్లయ్య శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు.నగరంలోని నాందేవ్‌వాడలో ఉన్న మల్లు స్వరాజ్యం కార్యా లయంలో ఆదివారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణ,ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వ హిస్తున్నామన్నారు.ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలనివారు కోరారు.
మోపాల్: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి, సెలవుదినంగా ప్రకటించాలని ఏఐబీఎస్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎల్ బాలు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా బిడ్డల ను భక్తి మార్గంలో నడిపించారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేశారని కొని యాడారు. పార్లమెంట్‌లో సేవాలాల్ మహరా జ్ గురించి మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలకు అధికారికంగా సెలవుదినంగా ప్రకటించా లని కోరారు. మండల ప్రధానకార్యదర్శి జలంధర్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరేశ్, నాయకులు ఇందల్, ఓం సింగ్, జోర్‌సింగ్ పాల్గొన్నారు.
రుద్రూర్: పొతంగల్ మండలంలోని హంగర్గాలో హరినామ స్మరణతో మారుమ్రోగుతోంది. గ్రామంలో కొనసాగుతున్న సప్తాహం కార్య క్రమానికి శుక్రవారం రాత్రి చైతన్య మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ప్రవచనం చేశారు. అనంతరం భక్తులు మహరాజ్‌ను ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో కీర్తనకారులు, భజన బృందం సభ్యులు, భక్తులు, సర్పంచ్ ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు


