పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు | - | Sakshi
Sakshi News home page

పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు

Feb 15 2026 6:54 AM | Updated on Feb 15 2026 6:54 AM

పల్లె

పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు

కలపను అమ్ముకున్న సర్పంచ్‌లు

పట్టించుకోని అధికారులు

అవెన్యూ ప్లాంటేషన్‌లదీ అదేగతి

రెంజల్‌(బోధన్‌): పల్లెలు, పట్టణాల్లో పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచాలనే బృహత్తర ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గ త ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టింది.అంతటి ప్రాధాన్యం కలిగిన పథకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు.గత పాలకవర్గాలు ప్రతి గ్రా మంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయ గా, మొక్కల సంరక్షణకు గత ప్రభుత్వం రూ. లక్ష లాది నిధులు విడుదల చేసింది. మొక్కలు ప్ర స్తుతం చెట్లుగా ఎదిగాయి. వాటిని కాపాడాల్సిన ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు కొన్ని పచ్చని చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి వేస్తున్నాయి. సర్పంచ్‌లకు అవగాహన లేక చెట్లను నరికి కలపను అమ్ముకుంటున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు.

ఆహ్లాదం అందనంత దూరం

జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలు చాలా వరకు గ్రా మాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారాయి. అవెన్యూ ప్లాంటేషన్‌లో భా గంగా రోడ్లకు ఇరు వైపులా నాటిన మొక్కలు చె ట్లుగా మారినా రహదారుల వెంట పచ్చదనం కరువైతుంది. ప్రయాణికులకు ప్రాణవాయువును అందించి వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ని వారించే చెట్ల పాలిట విద్యుత్‌ తీగలు శాపంగా తయారయ్యాయి.10–15 అడుగులు పెరిగిన చె ట్లను విద్యుత్‌ సిబ్బంది అడ్డంగా నరికేస్తున్నారు. ప చ్చందంతో కనిపించాల్సిన చెట్లు మోడు వారికి కనిపిస్తున్నాయి.రెంజల్‌ మండలంలోని మౌలాలితండా, కళ్యాపూర్‌ గ్రామాల సర్పంచ్‌లు ఇటీవల ప చ్చని చెట్లను నరికి కలపను అమ్ముకున్నారు. వీరన్నగట్ట శ్మశాన వాటికలో పెరిగిన చెట్లను సైతం నరికి వేయించారు.

పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు1
1/1

పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement