సంక్షిప్తం.. | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం..

Feb 13 2026 3:46 AM | Updated on Feb 13 2026 3:46 AM

సంక్ష

సంక్షిప్తం..

శివస్వాముల ఆధ్వర్యంలో పల్లకీసేవ

భిక్కనూరు: మండల కేంద్రంలో శివస్వాముల ఆధ్వర్యంలో గురువారం పల్లకీ సేవ నిర్వహించారు. సిద్ధరామేశ్వరాలయం మహంత్‌ సదాశివమహంత్‌ ఆద్వర్యంలో చేపట్టిన శివస్వాముల పల్లకీ సేవకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

కొండగట్టుకు తరలిన హన్‌మాన్‌ స్వాములు

భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన 26 మంది హనుమాన్‌స్వాములు మండల దీక్ష పూర్తి చేసుకుని గురువారం కొండగట్టు హన్‌మాన్‌ దేవాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుని దీక్ష విరమణ చేస్తామని స్వాములు తెలిపారు. హన్‌మాన్‌ గురుస్వాములు నాగభూషణం, గజ్జెవేణు, గంగారాం, శంకర్‌లతో పాటు హనుమాన్‌ స్వాములు పాల్గొన్నారు.

క్రిస్టియన్‌ మైనార్టీ ఫౌండేషన్‌ డే వేడుకలు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్‌ పాఠశాలలో గురువారం క్రిస్టియన్‌ మైనార్టీ ఫౌండేషన్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి బహుమతులను ప్రదానం చేశారు. ప్రిన్సిపల్‌ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు

చేయించుకోవాలి

భిక్కనూరు: ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవాలని కంటివైద్యుడు రవీందర్‌ పటేల్‌ అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్‌ ఫోన్‌లను వీలైనంత తక్కువగా చూడాలన్నారు. కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. కంటి వైద్యులు సాధన, ఎంపీహెచ్‌ఈవో వెంకటరమణ, హెల్త్‌ అసిస్టెంట్‌ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు.

వశిష్ట విద్యాసంస్థల వార్షికోత్సవం

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డె న్‌లో వశిష్ట విద్యాసంస్థల 23వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా టీయూ ప్రొఫె సర్‌ సంపత్‌ కుమార్‌ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థా యికి ఎదగాలని పిలుపునిచ్చారు. సీఈవో హరిస్మర ణ్‌ రెడ్డి విద్యార్థులకు నైపుణ్యాల ఆవశ్యకతను వివ రించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా, టాపర్లకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

సంక్షిప్తం..1
1/4

సంక్షిప్తం..

సంక్షిప్తం..2
2/4

సంక్షిప్తం..

సంక్షిప్తం..3
3/4

సంక్షిప్తం..

సంక్షిప్తం..4
4/4

సంక్షిప్తం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement