అ‘పూర్వ’ సమ్మేళనం
లింగంపేట/ కామారెడ్డి టౌన్: లింగంపేట మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 1970–71 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి, రఘునాథ్, సుధాకర్, గురునాథ్, చంద్రశేఖర్, సరసింహరెడ్డి, సాజిద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1972–73 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ భేటీలో పూర్వ విద్యార్థులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అ‘పూర్వ’ సమ్మేళనం


