భయం భయంగా విధులు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గది, కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. నిత్యం భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోందని సబ్ స్టేషన్‌లో పని చేసే ఆపరేటర్లు, విద్యుత్‌శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. స్థానిక సబ్‌స్టేషన్‌లో నిత్యం లైన్లను మార్చుతూ, ఎల్‌సీలు ఇస్తూ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. సబ్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరి స్లాబ్ పెచ్చులూడి మీద పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో భవనం ఊరుస్తుందని వారు తెలిపారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.


