రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు
రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామ పంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామసభలో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని మొదలైన వివాదం చివరకు పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫి ర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు రాయకూర్ పంచాయతీ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చించేందుకు బుధవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో టార్పాలిన్ కవర్లు వేయడంతో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెంట్, కుర్చీలు వేసి సభ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పాలకవర్గం, ప్రత్యర్థి వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి సభ గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. వివాదంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై జీపీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేయగా, మండలంలో చర్చనీయాంశంగా మారింది.


