ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

దరఖాస్తుల ఆహ్వానం

ధర్పల్లి: మండల కేంద్రంలో కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మల్లయ్య ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ధర్పల్లి: ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement