కేసులు నమోదు
● ఎంపీ అర్వింద్‌పై ఒకటో టౌన్‌లో..
● రెండో టౌన్‌లో 15 మంది
బోగస్ ఓటర్లపై..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాల పోలింగ్ బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా దూసుకెళ్లారని, పోలీసులను దుర్భాషలాడారని ఎంపీ అర్వింద్‌తోపాటు మరో ఏడుగురు బీజేపీ నాయకులపై ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన 14 మంది మహిళలపై రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. గోల్డెన్‌జూబ్లీ పాఠశాల, నేషనల్ స్కూల్, వాటర్ ట్యాంక్ పాఠశాల పోలింగ్‌కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం నాయకుల మధ్య గొడవ జరగడంతో ఆరో టౌన్ పోలీస్‌లో ఎంఐఎం నాయకులు నలుగురిపై కేసులు నమోదయ్యాయి. బాబాసాహెబ్‌పహాడ్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటేసేందుకు యత్నించి పట్టుబడగా అతడిపై కేసు నమోదైంది.
● బోధన్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 12 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
● మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్‌లో మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు 20 మందిపై కేసులు నమోదు చేశారు.


